- Home
- Andhra Pradesh
- Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ ... ఇంతకూ 5 రోజులా? 10 రోజులా?
Sankranti Holidays : ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ ... ఇంతకూ 5 రోజులా? 10 రోజులా?
ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు పదిరోజులా? ఐదురోజులా?... మీరు కూడా ఇదే కన్ష్యూజన్ లో వున్నారా? అయితే క్లారిటీ కోసం ఈ ఆర్టికల్ చూడండి.

Sankranti Holidays
Sankranti Holidays : సంక్రాంతి పండక్కి సమయం దగ్గరపడుతోంది. మరో పదిహేను రోజుల్లో పల్లెలు సంక్రాంతి శోభను సంతరించుకుంటాయి. ఈ క్రమంలో సొంతూళ్లకు వెళ్లేందుకు స్కూల్ పిల్లలు, కాలేజీ స్టూడెంట్, వారి తల్లిదండ్రులు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి సెలవులపై వారిలో కన్ఫ్యూజన్ నెలకొంది. సెలవులు కుదించారనే ప్రచారం పిల్లలనే కాదు వారి తల్లిదండ్రులను కంగారు పెడుతోంది. ఈ క్రమంలో సంక్రాంతి సెలవులపై ఏపీ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది.
ఆంధ్ర ప్రదేశ్ లో సంక్రాంతిని చాలా ఘనంగా జరుపుకుంటారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడినవారు కుటుంబసమేతంగా సొంతూళ్ళకు వెళుతుంటారు. చివరి నిమిషంలో రద్దీ పెరిగి టికెట్లు దొరికే అవకాశం వుండదు కాబట్టి ఇప్పటినుండే రైలు లేదంటే బస్సు టికెట్లు బుక్ చేసుకుంటారు. ఈ క్రమంలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ లేక టికెట్స్ ఎప్పటినుండి బుక్ చేసుకోవాలి? సొంతూళ్లకు ఎప్పుడు వెళ్లాలి? అనేదానిపై పిల్లల తల్లిదండ్రులు గందరగోళానికి గురయ్యారు. తాజాగా సంక్రాంతి సెలవులపై ఏపీ SCERT (State Council of Educational Research and Training) డైరెక్టర్ కృష్ణారెడ్డి స్పందించారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు అకడమిక్ క్యాలెండర్ 2024-25 లో పేర్కొన్న ప్రకారమే సంక్రాంతి సెలవులు వుంటాయని కృష్ణారెడ్డి స్పష్టం చేసారు. అంటే జనవరి 10 నుండి 19 వరకు మొత్తం పదిరోజుల సెలవులు వుంటాయన్నమాట. ఈ సెలవులను కుదించడంగాని, సెలవుల్లో విద్యార్థులకు క్లాసులు నిర్వహించాలని గాని నిర్ణయించలేమన్నారు. ఇలా జరుగుతున్న ప్రచారాన్ని ఎస్సిఈఆర్టి డైరెక్టర్ ఖండించారు.
Sankranti Holidays
సంక్రాంతి సెలవుల కుదింపు ప్రచారం :
ఈ సంవత్సరం(2024)లో విద్యాసంస్థలకు భారీగా సెలవులు వచ్చాయి. సాధారణంగా పండగలు, ప్రత్యేక రోజుల్లో స్కూళ్లకు సెలవులు వస్తుంటాయి... కానీ ఈసారి భారీ వర్షాలు, వరదల వల్ల కూడా చాలారోజులు స్కూళ్లు నడవలేవు. విద్యార్థుల రక్షణను దృష్టిలో వుంచుకుని భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం.
అయితే ఇలా అనుకోకుండా వచ్చిన సెలవులతో విద్యా సంవత్సరంలో ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తికాలేదట. దీంటో అటు ఉపాధ్యాయులపై, ఇటు విద్యార్థులపై ఒత్తిడి పెరగకుండా వుండేందుకు సంక్రాంతి సెలవులను ఉపయోగించుకోవాలని విద్యాశాఖ అధికారులు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అందువల్లే ముందుగా అకడమిక్ క్యాలెండర్ లో ప్రకటించినట్లు పదిరోజులు కాకుండా కేవలం ఐదురోజులే సంక్రాంతి సెలవులు ప్రకటించే అవకాశం వుందని ప్రచారం జరిగింది.
డిసెంబర్ 11 నుండి 15 లేదా డిసెంబర్ 12 నుండి 16 వరకు మాత్రమే ఏపీలోని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు వుంటాయని ప్రచారం జరిగింది. మిగతా ఐదురోజులు యధావిధిగా స్కూళ్లు, కాలేజీలు పనిచేస్తాయని పేర్కోన్నారు. ఇంత తక్కువరోజులు సంక్రాంతి సెలవులు వస్తున్నాయన్న ప్రచారం ప్రజలను కంగారుపెట్టింది. సొంతూళ్లకు వెళ్లాలని ప్లాన్స్ వేసుకుంటున్నవారికి ఈ సెలవుల కుదింపు ప్రచారం షాక్ ఇచ్చింది.
అయితే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి సంక్రాంతి సెలవులపై క్లారిటీ ఇవ్వాలనే డిమాండ్ విద్యాశాఖ అధికారులకు ఎదురయ్యింది. దీంతో ప్రభుత్వంతో చర్చించిన అధికారులు అలాంటి నిర్ణయమేది తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే ప్రకటించినట్లు జనవరి 10 నుండి 19 వరకు సెలవులు వుంటాయని... సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని నమ్మొద్దని ఏపీ ప్రజలకు సూచిస్తున్నారు ఎస్సిఈఆర్టి డైరెక్టర్ కృష్ణారెడ్డి.
Sankranti Holidays
టెన్త్ స్టూడెంట్స్ కు ఎన్నిరోజుల సెలవులు?
చంద్రబాబు సర్కార్ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను ఇప్పటికే ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ తేదీలను వెల్లడించారు. 2025 మార్చి 17 నుండి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక పరీక్షకు మరో పరీక్షకు మద్యలో ఓ రోజు గ్యాప్ వుండేలా చూసారు... అంటే గతంలో మాదిరిగా వరుసగా పరీక్షలు నిర్వహించరన్నమాట. పరీక్ష సమయంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇలా ఈసారి పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించి మంచి రిజల్ట్ రాబట్టాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందుకోసమే పదో తరగతి విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఎక్కువగా ఇవ్వకూడదని నిర్ణయించారు... కేవలం డిసెంబర్ 13,14,15 తేదీల్లో అంటే మూడు రోజులు మాత్రమే సెలవు ఇవ్వాలని నిర్ణయించారు.భోగి, సంక్రాంతి, కనుమ రోజులు మినహా మిగతారోజుల్లో వారి ప్రిపరేషన్ యధావిధిగా కొనసాగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.