మంత్రుల పనితీరుపై సీఎం జగన్ ఫోకస్:లిస్ట్ లో సీనియర్ మంత్రులు

First Published Oct 4, 2019, 4:21 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ నిప్పులు చెరుగుతుంది. ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీ ప్రతీ పనిని తప్పుబడుతూ యుద్ధానికి కాలుదువ్వుతోంది తెలుగుదేశం పార్టీ. 
 
అయితే ప్రభుత్వంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేస్తున్న దాడికి ఎదురుదాడి చేయడంలో వైసీపీ విఫలమవుతోందని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలపై కనీసం ఆశాఖ మంత్రులు సైతం స్పందించకపోవడంపై వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారట.

మంత్రులు నోరు మెదకపోవడంపై ముఖ్యమంత్రి జగన్ సైతం గమనిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు  పనితీరుపై ఫోకస్ పెట్టిన సీఎం జగన్ పలువురు మంత్రుల తీరును పరోక్షంగా హెచ్చరిస్తున్నట్లు సమాచారం.

జగన్ కేబినెట్ లో చోటు దక్కించుకున్న 25 మంది మంత్రుల్లో ప్రతిపక్ష పార్టీపైనా, బీజేపీ పైనా విమర్శలు చేసే వారిని వేళ్లతో లెక్కించ వచ్చు. ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశంపైనా, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపైనా ఒంటికాలిపై లేస్తున్నారు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకున్నప్పుడు తనకున్న రాజకీయ అనుభవంతో ఏదో ఒక అంశాన్ని సన్సేషనల్ గా చేస్తున్నారు. కీలక ప్రకటనలు చేస్తూ దానిపై చర్చ జరిగేలా చేస్తున్నారు.

పదేళ్లు మంత్రిగా ఉన్న అనుభవంతో చంద్రబాబు నాయుడు తీరును తీవ్రంగా తప్పుబడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. వైయస్ జగన్ పై టీడీపీ చేస్తున్న విమర్శలపై మెుదట స్పందించే మంత్రుల్లో బొత్స సత్యనారాయణ మెుదటి స్థానంలో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరోవైపు తెలుగుదేశం పార్టీపై ఎదురుదాడికి దిగుతున్న మంత్రుల్లో మరోక మంత్రి అనిల్ కుమార్ యాదవ్. జగన్ కేబినెట్ లో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్న అనిల్ కుమార్ యాదవ్ అవకాశం దొరికినప్పుడల్లా టీడీపీపై నిప్పులు చెరుగుతున్నారు.

ఇదిలా ఉంటే మరోమంత్రి అవంతి శ్రీనివాస్ సైతం తనదైన శైలిలో తెలుగుదేశం పార్టీ అంటేనే ఒంటికాలిపై లేస్తున్నారు. చంద్రబాబు నాయుడుని, లోకేష్ ను తూర్పారబడుతున్నారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని దుకాణం సర్దేసుకోవాలంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇకపోతే ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి, డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి సైతం తెలుగుదేశం పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు అండ్ కో చేసే విమర్శలకు ధీటుగా సమాధానం చెప్తున్నారు పుష్పశ్రీవాణి.

తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కీలక నేత, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సైతం తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తుతున్నారు. ఇకపోతే ముఖ్యమంత్రి వైయస్ జగన్ తో తన నియోజకవర్గంలోనే గ్రామ సచివాలయం వ్యవస్థను ప్రారంభించుకుంటూ జగన్ దృష్టిలో మంచి మార్కులే కొట్టేశారు.

అయితే ఇదే జిల్లాకు చెందిన మరోమంత్రి పినిపే విశ్వరూప్ మాత్రం మౌనమునిని తలపిస్తున్నారు. మంత్రి అయిన తర్వాత పెదవి విప్పడం లేదు. వైసీపీ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను తిప్పటికొట్టకుండా మిన్నకుండిపోవడం చర్చనీయాంశంగా మారింది.

పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అందులో ఒకరు డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖమంత్రి ఆళ్లనాని కాగా రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు.

మంత్రులు ఇద్దరూ వివాదాలకు దూరంగా ఉంటారు. మంత్రిగా కీలక పోస్టుల్లో ఉన్నప్పటికీ ఇదే పంథాలో పోతున్నారు. తమ శాఖలపై టీడీపీ విమర్శలు చేస్తున్నప్పటికీ కనీసం నోరు మెదపడం లేదని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇకపోతే కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్నినాని, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని. ఈ నేతలు ఇద్దరూ అడపాదడపా మీడియా ముందుకు వస్తున్నారే తప్ప ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను మాత్రం తిప్పటి కొట్టడం లేదని ప్రచారం.

గుంటూరు జిల్లా విషయానికి వస్తే హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత సైతం మౌనమునిని తలపిస్తున్నారు. పోలీస్ శాఖపై తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు.

ఇక రాయలసీమ విషయానికి వస్తే ఒకరిద్దరు మినహా మెుత్తం సైలెంట్ అయిపోయారు. రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం అప్పుడప్పుడు పెదవి విప్పుతున్నారు. ఇటీవలే గ్రామ సచివాలయం ఉద్యోగాలు చేపట్టిన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ఆయన టీడీపీ విమర్శలను తిప్పికొట్టడంలో సక్సెస్ అయ్యారు.

రాజకీయాల్లో సీనియర్ నేత అయినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివాదాలకు దూరంగా ఉంటారు. మౌనంగానే తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తుంటారు. ఎప్పుడో గానీ మీడియా ముందుకు రారు. అలాంటిది మంత్రి అయిన తర్వాత తన పంథామార్చుకుని చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు.

ఇకపోతే అసెంబ్లీలో అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగుదేశం పార్టీపై ఆధారాలతో సహా విరుచుకుపడే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం మౌనంగానే ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం విదేశాల్లో పర్యటించిన ఆయన ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

ఇకపోతే వైసీపీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి మాత్రం మెుదటి నుంచి ఉన్న ఊపునే కొనసాగిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, దేవినేని ఉమా, బుద్దా వెంకన్నలపై విరుచుకుపడుతున్నారు. తనదైన శైలిలో పంచ్ లు వేస్తూ టీడీపీని ముప్పుతిప్పలు పెట్టడంలో సక్సెస్ అయ్యారు.

అయితే మిగిలిన మంత్రులు ఎవరూ స్పందించకపోవడంపై వైసీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ యుద్ధానికి ఒంటికాలిపై లేస్తుంటే వైసీపీ మంత్రులు స్పందించకపోవడంపై కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ సైతం మంత్రుల వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?