MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • వారం రోజుల్లో త‌ల్లిదండ్రుల ఖాతాల్లోకి రూ. 13 వేలు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వం

వారం రోజుల్లో త‌ల్లిదండ్రుల ఖాతాల్లోకి రూ. 13 వేలు.. కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వం

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించే ‘తల్లికి వందనం’ పథకాన్ని 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అమలు చేస్తోంది. అర్హులైన విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేయనుంది.

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 16 2026, 07:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జూలై 22 నుంచి ప్రారంభం.. అర్హుల జాబితా కూడా అదే రోజు
Image Credit : Gemini AI

జూలై 22 నుంచి ప్రారంభం.. అర్హుల జాబితా కూడా అదే రోజు

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.10,120.78 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేయగా, నిధుల విడుదలకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 22న గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాలను ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ధ్రువీకరణ పూర్తయిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అదే రోజు నుంచి ఆర్థిక సాయం జమ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే జూలై 22 నుంచి ఆగస్టు 3 వరకు స్వీకరిస్తారు. అనంతరం వాటిని పరిశీలించి ఆగస్టు 10 నాటికి అదనపు అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎవరు అర్హులు.. ఎంత మొత్తం అందుతుంది?
Image Credit : iTDP Official @ X

ఎవరు అర్హులు.. ఎంత మొత్తం అందుతుంది?

ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులు, 42,70,802 మంది తల్లులు లేదా సంరక్షకులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 మంజూరు చేస్తారు. అయితే ఇందులో రూ.2,000ను పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతుల అభివృద్ధి కోసం వినియోగిస్తారు. మిగిలిన రూ.13,000ను తల్లి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేస్తారు.

Related Articles

Related image1
నాగ దుర్గ ఒక సైకో.. అందుకే ఎన్నో అవకాశాలు కోల్పోయింది. కొరియోగ్రాఫ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
Related image2
Motivational story: అన్న‌ద‌మ్ములంటే ఇలా ఉండాలి.. ఈ త‌రం వాళ్లు క‌చ్చితంగా చ‌ద‌వాల్సిన క‌థ‌
34
కొత్త అడ్మిషన్లకు ప్రత్యేక అవకాశం.. ఆగస్టు 30న నిధుల జమ
Image Credit : iTDP Official @ X

కొత్త అడ్మిషన్లకు ప్రత్యేక అవకాశం.. ఆగస్టు 30న నిధుల జమ

కొత్తగా పాఠశాలల్లో చేరిన విద్యార్థులను కూడా ప్రభుత్వం పథకంలో చేర్చింది. 1వ తరగతి, 9వ తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొత్తగా అడ్మిషన్ పొందిన అర్హుల వివరాలను ఆగస్టు 25 వరకు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. వారి అర్హతలను పరిశీలించిన తర్వాత ఆగస్టు 30న అదనపు లబ్ధిదారుల జాబితాను ప్రకటించి, అదే రోజు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో కూడా ఆర్థిక సాయం జమ చేయనున్నారు.

44
ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు కూడా వర్తింపు.. ప్రత్యేక నిబంధనలు
Image Credit : Gemini AI

ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు కూడా వర్తింపు.. ప్రత్యేక నిబంధనలు

ఆర్టీఈ చట్టం కింద ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌లను పరిగణనలోకి తీసుకుని, మిగిలిన మొత్తాన్ని ‘తల్లికి వందనం’ పథకం ద్వారా అందించనుంది. విద్య కారణంగా కుటుంబాలపై పడే ఆర్థిక భారం తగ్గించడం, పేద విద్యార్థులు చదువును మధ్యలో నిలిపివేయకుండా ప్రోత్సహించడం, ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న అర్హులందరికీ సమానంగా ఆర్థిక చేయూత అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్| Nara Lokesh Powerful Speech
Recommended image2
Now Playing
శ్రీవారిని దర్శించుకున్ననారా భువనేశ్వరి, అయ్యన్న పాత్రుడు | Nara Bhuvaneswari Visits Tirumala
Recommended image3
Now Playing
జగన్‌ 2.ఓ సూపర్‌యాప్‌ ఆవిష్కరించిన జగన్ | YS Jagan Launches Jagan 2.0 Super App
Related Stories
Recommended image1
నాగ దుర్గ ఒక సైకో.. అందుకే ఎన్నో అవకాశాలు కోల్పోయింది. కొరియోగ్రాఫ‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
Recommended image2
Motivational story: అన్న‌ద‌మ్ములంటే ఇలా ఉండాలి.. ఈ త‌రం వాళ్లు క‌చ్చితంగా చ‌ద‌వాల్సిన క‌థ‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved