- Home
- Andhra Pradesh
- AP SSC Exam 2025 Hall Tickets : 9552300009 నంబర్ కు వాట్సాప్ చేయండి చాలు... మీ హాల్ టికెట్ వచ్చేస్తుంది
AP SSC Exam 2025 Hall Tickets : 9552300009 నంబర్ కు వాట్సాప్ చేయండి చాలు... మీ హాల్ టికెట్ వచ్చేస్తుంది
ఆంధ్ర ప్రదేశ్ లో విద్యార్థులకు పరీక్షలు మొదలయ్యాయి. ఇప్పటికే ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా త్వరలోనే టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్షల వేళ విద్యార్థులు ఇబ్బందిపడకుండా హాల్ టికెట్స్ ను ఈజీగా పొందే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.ఇందుకోసం విద్యార్థులు ఏం చేయాలంటే...

AP SSC Hall Ticket 2025
AP SSC Exams 2025 : ఆంధ్ర ప్రదేశ్ లో పరీక్షల హడావిడి ప్రారంభమయ్యింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి... అవి ఇలా ముగియగానే అలా పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది.
మార్చి 17 నుండి 31 వరకు ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని పదిహేను రోజులు ముందుగానే హాల్ టికెట్స్ విడుదల చేసారు. స్కూళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా ఇంట్లోనే కూర్చుని హాల్ టికెట్ పొందే సదుపాయాన్ని కల్పించింది ప్రభుత్వం. వివిధ మార్గాల్లో కేవలం విద్యార్థులు ఫోన్ లోనే హాల్ టికెట్లు పొందవచ్చు.
విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.in ద్వారా హాల్ టికెట్ పొందవచ్చు. లేదంటే మన మిత్ర గవర్నెన్స్ కింద అందిస్తున్న వాట్సాప్ సేవల ద్వారా కూడా హాల్ టికెట్స్ పొందవచ్చు. ఇందుకోసం విద్యార్థులు 9552300009 ను వాట్సాప్ ద్వారా సంప్రదించాలి.
How to download AP SSC Hall Ticket 2025 in WhatsApp
వాట్సాప్ లో పదో తరగతి హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ :
పదో తరగతి చదివే విద్యార్థులు ముందుగా వాట్సాఫ్ ఓపెన్ చేసి ప్రభుత్వం సూచించిన 9552300009 నెంబర్ కి Hi అని మెసేజ్ చేయండి.
వెంటనే ఈ నెంబర్ నుండి మీకు రిప్లై వస్తుంది. సేవను ఎంచుకొండి అని లింక్ వస్తుంది. దీనిపై క్లిక్ చేయండి.
వాట్సాఫ్ ద్వారా ప్రభుత్వం అందించే సేవల లిస్ట్ వస్తుంది. ఇందులో విద్య సేవలు అనే ఆప్షన్ ఎంచుకొండి.
తరువాత ఇంటర్మీడియట్, SSC హాల్ టికెట్స్ ఆప్షన్ వస్తుంది. ఇందులో SSC హాల్ టికెట్స్ పై క్లిక్ చేయండి.
మీ అప్లికేషన్ నంబర్ లేదా విద్యార్థి గుర్తింపు సంఖ్య, పుట్టిన తేదీ అడుగుతుంది. వీటిని ఫిల్ చేయాలి. అలాగే మీరు పదో తరగతి రెగ్యులర్ గా చదువుతున్నారా లేక ప్రైవేట్ లో చదువుతున్నారా, OSSC రెగ్యులర్, OSSC ప్రైవేట్, ఒకేషనల్ ఇలా ఐదు ఆప్షన్స్ అడుగుతుంది. వీటిలో మీరు పదో తరగతి పరీక్ష ఎలా రాస్తున్నారో ఎంపిక చేసుకోవాలి. మీరు రెగ్యులర్ అయితే రెగ్యులర్ ను ఎంపిక చేసుకోవాలి...లేదంటే వేరే ఆప్షన్స్ ఎంపికచేసుకోవాలి.
మీరు వివరాలు అందించగానే కొద్ది క్షణాల్లోని పదో తరగతి హాల్ టికెట్ మీ ఫోన్ కు వస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది.
ఇలా చాలా సింపుల్ గా ఇంట్లో ఉండే వాట్సాప్ ద్వారా హాల్ టికెట్స్ పొందవచ్చు. విద్యార్థులు ఈ విధానంలోనే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు.
Nara Lokesh
టెన్త్ విద్యార్థులకు నారా లోకేష్ సూచన :
ప్రియమైన పదో తరగతి విద్యార్థులారా... త్వరలోనే పబ్లిక్ ఎగ్జామ్స్ రాయనున్న మీకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా... మీరు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ లో ట్వీట్ చేసారు. అంతేకాదు పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ కు సంబంధించిన వివరాలను తెలిపారు.
''మార్చి 2025 లో జరగనున్న పదో తరగతి పరీక్షల హాల్ టికెట్స్ విడుదలయ్యాయి... ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి. 03.03.2025 మధ్యాహ్నం 2 గంటల నుండి హాల్ టికెట్స్ అందుబాటులో ఉంటాయి. మీరు BSE AP అధికారిక వెబ్ సైట్ http://bse.ap.gov.in లో మీ స్కూల్ లాగిన్ ద్వారా హాల్ టికెట్స్ పొందవచ్చు. లేదా మన మిత్ర ద్వారా ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ సర్వీస్ (9552300009)లో ఎడ్యుకేషన్ సర్వీస్ ఎంపిక చేసుకుని మీ అప్లికేషన్ నంబర్ లేదా చైల్డ్ ఐడి మరియు డేట్ ఆఫ్ భర్త్ వివరాలు అందించి పొందవచ్చు'' అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు సూచించారు.