ఏపీలో కురుస్తున్న వర్షాలు.. నవంబర్ 6న మరో అల్పపీడనం.. తుపాన్‌గా మారే ఛాన్స్..
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు, శ్రీలంక తీర ప్రాంతం సమీపంలో ఈ అల్పపీడనం ఏర్పడింది. అయితే నవంబర్ 6వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు, శ్రీలంక తీర ప్రాంతం సమీపంలో ఈ అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో ఏపీలోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం దక్షిణ కోస్తా, రాయలసీయ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.
అయితే నవంబర్ 6వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి తుపాన్‌గా మారే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ప్రస్తుతం ఉన్న అల్పపీడనం మూడు, నాలుగు రోజులు పశ్చిమ దిశలో ప్రయాణించి బలహీన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ అల్పపీడనానికి అనుబంధగా ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా మరో మూడు రోజులు కూడా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్రలో కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇక, శుక్రవారం ఏపీలో 5.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది.
ఇక, నేడు ఉప ఎన్నిక జరుగుతున్న బద్వేల్‌లో కూడా శుక్రవారం భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో అధికారులు పలు జాగ్రత్తలు తీసుకన్నారు. ఎన్నికల సామాగ్రి తడవకుండా పోలింగ్ కేంద్రాలకు తరలించారు.