కరోనా దెబ్బ: అంచనాలకు దూరంగా ఏపీ ఆర్ధిక పరిస్థితి, పడిపోయిన ఆదాయం

First Published 20, Oct 2020, 3:10 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా పరిపుష్టమయ్యేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.అయితే ఇదే సమయంలో కరోనా రూపంలో ప్రభుత్వానికి తీవ్ర దెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపింది. కరోనా వైరస్ కారణంగా రాష్ట్రానికి ఆదాయం భారీగా తగ్గిపోయింది. ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం రాలేదు. అంచనాలకు, వాస్తవానికి మధ్య చాలా గ్యాప్ ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను చేపడుతోంది.  సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ది కార్యక్రమాలకు కూడ పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం... నిధుల కొరతతో సతమతమౌతోంది.ఈ సమయంలో కరోనా వైరస్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. బడ్జెట్ సమయంలో ప్రభుత్వం చేసిన అంచనాలు చేరుకోలేకపోయింది ఆర్ధికశాఖ.

తొలి ఆరు మాసాల అంచనాలు, వాస్తవాలకు మధ్య చాలా తేడా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో రూ. 70,679 కోట్ల పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం అంచనా వేసింది. తొలి అర్ధ భారంలో రూ. 35 వేల కోట్లు వసూలు చేయాలని టార్గెట్ గా పెట్టుకొంది. తొలి ఆరు నెలల్లో రూ. 14, 962 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

57 శాతం తక్కువగా పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. కేవలం 43 శాతం మాత్రమే  పన్నుల ద్వారా ఆదాయం వచ్చిందని ఆర్ధిక శాఖ వర్గాలు తెలిపాయి. 2019-20 ఆర్ధిక సంవత్సరం తొలి ఆరు మాసాల్లో రూ. 21,967 కోట్లు పన్నుల ద్వారా  ఆదాయం వచ్చింది. గతం కంటే 32 శాతం తక్కువ ఆదాయం వచ్చినట్టుగా రికార్డులు చెబుతున్నాయి.

మరోవైపు రోజువారీ ఖర్చులకు కూడ ఇబ్బందులు తప్పేలా లేవని ఆర్ధిక శాఖకు చెందిన అధికారులు తెలిపారు. పన్నుల ద్వారా కూడ ఆదాయాలు రాకుండా పోయాయి. పెరిగిపోతున్న ఖర్చులతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు నెలకొన్నాయి.

ప్రతి నెల  ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, సామాజిక భద్రత పెన్షన్ల కోసం  నిధుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. డిసెంబర్ నుండి ఉచిత విద్యుత్ రైతుల కోసం వారి ఖాతాల్లో  నెలకు రూ. 700 కోట్లు చెల్లించాల్సిన పరిస్థితులు కూడ ఉన్నాయి.కరోనా నేపథ్యంలో ప్రభుత్వానికి గతంలో మారిదిగా పన్నుల ద్వారా ఆదాయం రావడం లేదు.