Andhra Pradesh Jobs : తెలుగు యువతకు బంపరాఫర్ ... ఎలాంటి పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఎలాంటి రాతపరీక్ష లేకుడా కేవలం మెరిట్ ఆధారంగానే ఈ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నారు. ఇంతకూ ఆ ఉద్యోగాలేమిటో తెలుసా?
Andhra Pradesh Jobs
Andhra Pradesh Jobs : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం యువతకు తీపికబురు అందించింది. వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్రంలో ఖాళీగా వున్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఆ దిశగా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 పోస్టులను వైద్యారోగ్య శాఖ భర్తీ చేస్తుంది. వీటిలో రెగ్యులర్ తో పాటు బ్యాక్ లాగ్ పోస్టులు కూడా వున్నాయి. ఎలాంటి రాత పరీక్ష వుండదు... కేవలం మెరిట్ ఆదారంగానే సెలెక్ట్ చేస్తారు. ఇప్పటికే ఈ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
Andhra Pradesh Jobs
ఎలా దరఖాస్తు చేసుకోవాలి :
ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ సర్విసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ చేపడుతోంది. నోటిఫికేషన్ లో పేర్కొన్న అన్ని అర్హతలు కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ http:apmsrb.ap.gov.in/msrb/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
డిసెంబర్ 4 నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభయ్యింది...ఇది డిసెంబర్ 13 వరకు కొనసాగుతుంది. చివరి తేదీలోపు ఆన్ లైన్ పేమెంట్, దరఖాస్తు పూర్తిచేయాల్సి వుంటుంది. ఆ తర్వాత ఎలాంటి పొడిగింపులు వుండదని వైద్యారోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.
ఓసి అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.1000. ఎస్సి, ఎస్టి, బిసి, ఈబ్ల్యుఎస్, దివ్యాంగులు, మాజీ సైనికులకు అప్లికేషన్ ఫీజు రూ.500. 13వ తేదీలోపు ఆన్ లైన్ లో ఈ దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
Andhra Pradesh Jobs
విద్యార్హతలు :
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పకుండా పిజి లేదంటే సంబంధిత విభాగంలో డిప్లొమా చేసి వుండాలి. వీరు ఏపి మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టరయి వుండాలి.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ (జనరల్) : ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కేవలం ఎంబిబిఎస్ పూర్తిచేసివుంటే చాలు. లేదంటే ఈ ఎంబిబిఎస్ కు సమానమైన కోర్సు చేసివుండాలి. వీళ్ళు కూడా ఏపి మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకుని వుండాలి.
Andhra Pradesh Jobs
వయోపరిమితి :
ఓసి అభ్యర్థుల వయసు నోటిఫికేషన్ వెలువడేనాటికి 42 ఏళ్లు మించకూడదు.
ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు కొంత వయసు మినహాయింపు వుంటుంది. వీళ్లు నోటిఫికేషన్ వెలువడే నాటికి 47 ఏళ్ళ వయసు మించకూడదు.
52 ఏళ్లలోపు దివ్యాంగులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే నోటిఫికేషన్ నాటికి 50 ఏళ్లు మించకూడదు.
కేవలం ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారే అర్హులు :
వైద్యారోగ్య శాఖ చేపట్టిన ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకే స్థానికులే అర్హులు. అంటే ఏపీ ప్రభుత్వం నియమనిబంధనల ప్రకారం స్థానికత కలిగివుండాలి. అలాగయితేనే ఈ ఉద్యోగాలను పొందవచ్చు. స్థానికులు అంటే 4వ తరగతి నుండడి 10వ తరగతి వరకు ఆంధ్ర ప్రదేశ్ లో చదివివుండాలి.
చదువుకున్న ప్రాంతాన్ని బట్టే స్థానికతను నిర్ణయిస్తారు... తహసీల్దార్లు లేదా ఇతర ప్రభుత్వ అధికారుల నుండి పొందే నివాస దృవపత్రాలను పరిగణలోకి తీసుకోబడవని నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయవద్దని ముందుగానే సూచించారు.
Andhra Pradesh Jobs
ఎంపిక ప్రక్రియ :
ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండానే ఈ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు చేపడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్ట్ రెడీచేసి దాని ఆదారంగానే ఎంపిక చేపడతారు.
దరఖాస్తు సమయంలో పిజి,డిఎన్బి, పిజి డిప్లోమాకు చెందిన అన్ని సంవత్సరాల ఎగ్జామ్ మొమోలను అప్ లోడ్ చేయాలి. ఈ కోర్సులు పూర్తిచేసినపుడు అందించే సర్టిఫికేట్ కూడా జతచేయాలి.
ఎంబిబిఎస్ ఓరిజినల్ సర్టిపికేట్, అన్ని సంవత్సరాలకు చెందిన మార్కుల మెమోలు కూడా అప్ లోడ్ చేయాల్సి వుంటుంది. ఇంటర్న్ షిప్ పూర్తిచేసిన సర్టిఫికెట్ కూడా అందించాలి.
ఏపి స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్టిఫికెట్ జతచేయాలి.
పుట్టిన రోజు వివరాల కోసం పదో తరగతి మెమో లేదా దానికి సమానమైన మరేదైనా దృవీకరణ పత్రం అప్ లోడ్ చేయాలి. అలాగే స్థానికత కోసం 4వ తరగతి నుండి 10వ తరగతి చదివిన సర్టిఫికేట్లు అందించాలి.
కుల దృవీకరణ పత్రం కూడా అప్ లోడ్ చేయాలి.
దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్స్ దరఖాస్తు చేసుకుంటే ఆ దృవీకరణ పత్రాలను కూడా జతచేయాలి.