- Home
- Andhra Pradesh
- Colleges Bandh : స్కూళ్లకే కాదు కాలేజీలకూ సోమవారం సెలవే... వరుసగా రెండ్రోజులు బంద్
Colleges Bandh : స్కూళ్లకే కాదు కాలేజీలకూ సోమవారం సెలవే... వరుసగా రెండ్రోజులు బంద్
Colleges Bandh : ఆంధ్ర ప్రదేశ్ లో బుధవారం నుండి ప్రారంభం కావాల్సిన దసరా సెలవులు ఈ ఆదివారం నుండే షురూ అవుతున్నాయి. అయితే ఈ సోమవారం స్కూళ్ళే కాదు కాలేజీలు కూడా బంద్ కానున్నాయి. ఎందుకో తెలుసా?

ఏపీలో కాలేజీల బంద్
Colleges Bandh : ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు దసరా సెలవులు రేపట్నుంచి (సెప్టెంబర్ 21) ప్రారంభంకానున్నాయి... దాదాపు 12 రోజులు విద్యార్థులు స్కూల్ వైపు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇదే సమయంలో ఏపీలోని ప్రైవేట్ కాలేజీల యువతీయువకులకు కూడా సడన్ సెలవులు వస్తున్నాయి. వచ్చే రెండ్రోజులు అంటే ఆది, సోమవారం రాష్ట్రంలోని అన్ని కాలేజీలు మూతపడనున్నాయి. ఆదివారం సరే మరి సోమవారం కాలేజీలు ఎందుకు కాలేజీలు నడవట్లేదు... సెలవు ఎందుకు వస్తుంది? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
సోమవారం కాలేజీల బంద్
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ప్రభుత్వమే ఫీజు రియింబర్స్ మెంట్ పథకాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసిందే. అంటే విద్యార్థుల ఫీజులో కొంత ప్రభుత్వమే చెల్లిస్తుందన్నమాట. అయితే ఇలా చెల్లించాల్సిన ఫీజులు భారీగా బకాయి పడటంతో కాలేజీలు నడపలేని పరిస్థితి వచ్చిందని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే తమకు రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సంఘం బంద్ కు పిలుపునిచ్చింది. ఈ మేరకు వచ్చే సోమవారం (సెప్టెంబర్ 22న) రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు బంద్ పాటించనున్నాయి.
ప్రభుత్వానికి కాలేజీల బంద్ నోటీస్
ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘం ఇప్పటికే ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కు బకాయిల చెల్లింపుకు సంబంధించి వినతిపత్నం సమర్పించారు. అలాగే నిధుల విడుదల కోసం తలపెట్టిన కాలేజీల బంద్ పై కూడా సమాచారం అందించారు. ఇలా ఇప్పటికే ప్రభుత్వానికి సమాచారం అందించారు... మరి వాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి. బంద్ ను విరమించుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపే అవకాశం ఉంది... ఇందులో తీసుకునే నిర్ణయాలను బట్టి బంద్ కొనసాగుతుందో లేదో తేలిపోతుంది.
తెలంగాణలో కూడా బంద్ తలపెట్టారు.. మరి ఏమయ్యింది?
తెలంగాణలో కూడా ఇలాగే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల ఫీజు రియింబర్ప్ మెంట్ బిల్లుల కోసం ఆందోళనకు సిద్దమయ్యారు. కాలేజీలను మూసివేయడానికి బంద్ కు కూడా పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వం వెంటనే స్పందించి కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపి ఫీజు రియింబర్స్ మెంట్ బిల్లుల విడుదలకు అంగీకరించింది. దీంతో బంద్ పై వెనక్కితగ్గి యధావిధిగా కాలేజీలు నడపాలని నిర్ణయించారు.
తెలుగు రాష్ట్రాల్లో సెలవులే సెలవులు
ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు సెప్టెంబర్ 21 నుండి దసరా సెలవులు ప్రారంభం అవుతున్నాయి. తెలంగాణలో అక్టోబర్ 3 వరకు సెలవులుంటే ఏపీలో మాత్రం అక్టోబర్ 2 వరకు ఉన్నాయి... 3న తిరిగి స్కూళ్ళు ప్రారంభం అవుతాయి. మొదట ఏపీలో కేవలం 9 రోజులే దసరా సెలవులు ప్రకటించారు... దీనిప్రకారం సెప్టెంబర్ 24న సెలవులు ప్రారంభం కావాలి. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వినతి మేరకు సెలవులను రెండ్రోజుల పెంచారు... వీటికి మరో ఆదివారం కలిసిరావడంతో మొత్తం దసరా హాలిడేస్ సంఖ్య 12 రోజులకు చేరింది. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 2 వరకు ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు దసరా సెలవులు వస్తున్నాయి.