బలపడుతున్న స్నేహం.. ప్రశాంత్ కిశోర్ కోసం భార్యతో సహా జగన్

First Published 17, Feb 2020, 12:26 PM IST

లక్నో, గోమ్‌తీనగర్‌లోని హోటల్‌ తాజ్‌మహల్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ల మధ్య బంధం రోజు రోజుకీ బలపడుతోంది. గతేడాది ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ విజయం వెనక ఉన్నది ప్రశాంత్ కిశోర్.

ప్రశాంత్ కిశోర్, ఆయన టీం... ఏపీలో జగన్ విజయం కోసం చాలా కృషి చేశారు. వారి కష్టమే.. ఇప్పుడు జగన్ కి అధికారం కట్టబెట్టేలా చేసింది. కాగా... ఆ నాటి నుంచి పీకేతో జగన్ బంధం కొనసాగుతోంది. కాగా... ఇప్పుడు ఆ స్నేహం మరింత బలపడినట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ కిశోర్ (పీకే) కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోకు చేరుకున్నారు. ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐప్యాక్‌ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి వివాహానికి సీఎం జగన్ హాజరైనట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ కిశోర్ (పీకే) కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోకు చేరుకున్నారు. ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐప్యాక్‌ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ సింగ్ అనే వ్యక్తి వివాహానికి సీఎం జగన్ హాజరైనట్లు తెలుస్తోంది.

లక్నో, గోమ్‌తీనగర్‌లోని హోటల్‌ తాజ్‌మహల్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

లక్నో, గోమ్‌తీనగర్‌లోని హోటల్‌ తాజ్‌మహల్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అనంతరం సీఎం జగన్ దంపతులు కొద్దిసేపు వారితో ముచ్చటించారు. ఆ తర్వాత జగన్ దంపతులు విజయవాడ చేరుకున్నారు.

సీఏఏను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పీకేను.. ఇటీవలే జేడీయూ ఉపాధ్యక్ష పదవి, పార్టీ నుంచి నితీష్ కుమార్ తొలగించిన విషయం తెలిసిందే.   కాగా, సీఏఏ, ఎన్ఆర్‌సీ విషయంలో సీఎం జగన్ వైఖరిపై పీకే ఆగ్రహంగా ఉన్నారంటూ ఇటీవల వార్తలు వెలువడ్డాయి.

అయితే... వారి మధ్య మనస్పర్థలు వచ్చాయనే వార్తలన్నీ అబద్ధాలు అని తేల్చేస్తే... పీకే కోసం జగన్ సతీసమేతంగా యూపీ వెళ్లడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. రాజకీయంగా వారి స్నేహం మరింత బలపడిందనే వాదనలు వినపడుతున్నాయి.

ఇదిలా ఉండగా... ఇటీవల  ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మూడోసారి అధికారం దక్కించుకున్నారు.  ఆప్‌కు సైతం ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే.

loader