Anant Ambani: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ.. టీటీడీకి భారీ విరాళం
Anant Ambani : ప్రముఖ వ్యాపారవేత్త అనంత్ అంబానీ తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీకి రూ. 27.5 కోట్ల విరాళంతో పాటు 25 ఎలక్ట్రిక్ బస్సులు, గోశాల ఆధునీకరణను ప్రకటించారు.

అనంత్ అంబానీ తిరుమల టూర్.. గుండు కొట్టించుకుని మరి టీటీడీకి ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?
బిలియనీర్ ముఖేష్ అంబానీ ముద్దుల కొడుకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లికి ముందు నుంచే ఆధ్యాత్మిక సేవలో బిజీగా ఉంటున్న అనంత్, తాజాగా కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
ఆదివారం తెల్లవారుజామున తిరుమల కొండకు చేరుకున్న ఆయన, స్వామివారికి నిర్వహించే అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ స్వామివారిపై తనకున్న అపారమైన భక్తిని చాటుకుంటూ తలనీలాలు సమర్పించారు. దర్శనం అనంతరం ఆలయ ఈవో, వేద పండితులు అనంత్ అంబానీకి శేషవస్త్రం కప్పి, తీర్థప్రసాదాలు అందించి సంప్రదాయబద్ధంగా ఆశీర్వచనాలు అందించారు.
తిరుమల కొండపై గ్రీన్ విప్లవం.. టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులు
శ్రీవారి దర్శనం తర్వాత, తిరుమలకు వచ్చే భక్తులకు పర్యావరణహితమైన సేవలు అందించడమే లక్ష్యంగా అనంత్ అంబానీ ఏకంగా రూ. 27.5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా టీటీడీకి 25 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులను గిఫ్ట్‌గా ప్రకటించారు.
జీతాల టెన్షన్ లేదు.. ఛార్జింగ్ స్టేషన్ కూడా ఫ్రీ
అనంత్ అంబానీ కేవలం బస్సులు ఇచ్చి చేతులు దులుపుకోలేదు. ఆ బస్సులను మెయింటెన్ చేయడానికి అయ్యే ఖర్చును కూడా తామే భరిస్తామని చెప్పారు. ఈ 25 ఈవీ బస్సులను నడిపేందుకు అవసరమయ్యే 50 మంది డ్రైవర్ల శాలరీస్ రిలయన్స్ సంస్థే పే చేయనుంది. దీనివల్ల టీటీడీపై ఎలాంటి ఎకనామికల్ బర్డెన్ పడదు. అంతేకాదు, ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం తిరుమల కొండపై ఒక హైటెక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌ను కూడా రిలయన్స్ ఏర్పాటు చేయబోతోంది. ఇది ఫ్యూచర్‌లో తిరుమలలో మరిన్ని ఎలక్ట్రిక్ వాహనాలు పెరగడానికి బేస్ లాగా పనిచేస్తుంది.
తిరుమల గోశాలకు వంతారా టచ్
అనంత్ అంబానీకి జంతువులన్నా, ప్రకృతి అన్నా ఎంత ప్రాణమో అందరికీ తెలిసిందే. గుజరాత్‌లో ఆయన సృష్టించిన వరల్డ్ క్లాస్ యానిమల్ రెస్క్యూ ప్రాజెక్ట్ వంతారా తరహాలోనే, తిరుమలలోని టీటీడీ గోశాలను కూడా అల్ట్రా మోడర్న్‌గా మార్చేందుకు అనంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోవుల సంరక్షణ, వాటికి బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్, క్లీన్ ఎన్విరాన్మెంట్ ఉండేలా మోడ్రనైజ్ చేయనున్నారు.

