రేణు దేశాయ్ పై అంబటి సంచలన వ్యాఖ్యలు.. నిన్ను మోసం చేసినట్టే రాష్ట్రాన్ని కూడా...
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మీద మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను మోసం చేసినా హిందూ మహిళగా భర్త మంచే కోరుకుంటుందని అన్నారు.

అమరావతి : వైసిపి మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు.
రేణు దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘నిన్ను మోసం చేసినవాడు.. ఒక్క అవకాశం గనక ఇస్తే రాష్ట్రాన్ని మోసం చేయడా అమ్మా?’.. అంటూ తీవ్ర వ్యాక్యలు చేశారు మంత్రి.
మోసం చేసినా.. రేణు దేశాయ్ హిందూ మహిళగా ఆలోచించి… తన అన్యాయం చేసినా సరే.. విషాల దృక్పథంతో తన కొడుకుకి తండ్రి అయిన పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకోవడం సహజం అన్నారు.
కానీ, రేణు దేశాయ్ కోరుకున్నట్లుగా, పవన్ కళ్యాణ్ అడుగుతున్నట్లుగా ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా లేరని అంబటి రాంబాబు చెప్పారు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్, పుంగనూరులో చంద్రబాబు పోలీసులతో గొడవ పడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు ఏడాదిలో పట్టిసీమ పూర్తి కాకపోయినా ఇన్సెంటివ్ గా పేరుతో రూ.257 కోట్లు దోచి పెట్టారని మంత్రి అంబటి ఆరోపించారు. గత ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా పట్టిసీమను నిర్మించింది.
దీంతో నెషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ24.90 కోట్ల జరిమానా విధించింది. దీన్ని వైసిపి ప్రభుత్వమే చెల్లించిందని అంబటి రాంబాబు అన్నారు. ప్రకాశం బ్యారేజ్ కి నీరు చేరాలంటే పట్టిసీమ కడితే సరిపోదు. దాదాపు 175 కిలోమీటర్ల మేర కుడి కాలువ మట్టి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఇవేమీ చెప్పకుండా పట్టిసీమ కట్టేసి వారే తెచ్చినట్టు కలరింగ్ ఇస్తున్నారని.. ఈ పనుల్లో సింహభాగం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని అంబటి అన్నారు.