చంద్రబాబు వర్సెస్ జగన్: వారి భార్యలకు అంటుతున్న బురద

First Published 4, Jan 2020, 11:32 AM

వైఎస్ జగన్ సతీమణి భారతి కూడా రాజకీయాలకు చాలా వరకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కొద్ది సందర్భాల్లో మాత్రమే ఆమె మాట్లాడారు. నేరుగా రాజకీయాలు నడిపిన సందర్భాలు లేవు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సతీమణి భువనేశ్వరి రాజకీయాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో కుప్పం నియోజకవర్గం నేతలతో ఆమె మాట్లాడడం తప్ప అంతకు ముందు గానీ ఆ తర్వాత గానీ పెద్దగా రాజకీయాలను పట్టించుకోలేదు. అయితే, ఇటీవల చంద్రబాబుతో కలిసి అమరావతిలో పర్యటించడంతో ఆమెపై కూడా విమర్శలు వెల్లువెత్తడం ప్రారంభమైంది.

వైఎస్ జగన్ సతీమణి భారతి కూడా రాజకీయాలకు చాలా వరకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కొద్ది సందర్భాల్లో మాత్రమే ఆమె మాట్లాడారు. నేరుగా రాజకీయాలు నడిపిన సందర్భాలు లేవు. భువనేశ్వరిపై విమర్శలు వెల్లువెత్తుండడంతో భారతిని టీడీపీ నేతలు కూడా దుమ్మెత్తిపోస్తున్నారు.

ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు సంఘీభావంగా చంద్రబాబుతో పాటు భువనేశ్వరి పర్యటన చేశారు. అమరావతి ప్రజలను పట్టించుకున్న తర్వాతనే కుటుంబాన్ని చంద్రబాబు పట్టించుకునేవారని ఆమె అన్నారు. దాంతో ఆగకుండా ఉద్యమానికి విరాళంగా ఆమె తన చేతికి ఉన్న బంగారు గాజులను ఇచ్చారు. ఆ గాజులను బహిరంగంగా వేలం వేసి, వచ్చిన డబ్బును ఉద్యమానికి వాడుకోవాలని చెప్పారు.

అమరావతి రైతులకు భువనేశ్వరి గాజులు ఇవ్వడంపై వైఎస్సార్ కాంగ్రెసు నాయకులు ఎదురు దాడి ప్రారంభించారు. అమరావతి రైతులకు ఇవ్వాల్సింది గాజులు కాదని, ఇన్ సైడర్ ట్రేడింగ్ తో పప్పు బెల్లాల మాదిరిగా చౌకగా కొట్టిసిన భూములను తిరిగి ఇవ్వాలని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి వ్యాఖ్యానిం్చారు. భువనేశ్వరి హెరిటేజ్ పేరుతో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి 14.22 ఎకరాల భూమిని చౌకగా కొట్టేశారని ఆమె అన్నారు. దయచేసి ఆ భూములను రైతులకు ఇవ్వాలని ఆమె అన్నారు

అమరావతి రైతులకు గాజులు ఇచ్చిన భువనేశ్వరిపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చి పనిలో పనిగా అమరావతిలో పర్యటించారని ఆయన వ్యాఖ్యానించారు. రైతులకు గాజులు ఇవ్వడం కాదు, భుములు ఇవ్వాలని ఆయన అన్నారు.

భువనేశ్వరిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పుష్ప శ్రీవాణిపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సరం వేడుకలను పక్కనపెట్టి భువనేశ్వరి అమరావతి రైతులకు సంఘీభావం తెలపడానికి వచ్చారని, అందులో భాగంగా గాజులు విరాళంగా ఇచ్చారని ఆమె అన్నారు. భర్త చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో కూడా భువనేశ్వరి రాజకీయాలకు దూరంగానే ఉన్నారని గుర్తు చేశారు.

పుష్ప శ్రీవాణి వ్యాఖ్యలపై టీడీపీ నేత వంగలపూడి అనిత కూడా స్పందించారు. బోగస్ సర్టిఫికెట్లతో ఎస్టీ అని చెప్పుకుని ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్న పుష్ప శ్రీవాణికి భువనేశ్వరిని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు.హెరిటేజ్ సంస్థ తన కంపెనీని విస్తరించే క్రమంలో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో భూములు కొనాలని 2014 మార్చిలోనే నిర్ణయం తీసుకుందని చెప్పారు.

భువనేశ్వరి గాజులు విరాళంగా ఇవ్వడంపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. భువనేశ్వరికి అంత జాలి ఎందుకని ఆయన అడిగారు. గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే జాలి కలుగలేదని, తండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు జాలి కలగలేదని ఆయన భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేశారు.

నారా భువనేశ్వరిపై వైసిపీ నేతలు విమర్శలు చేయడాన్ని టీడీపీ నేత కంభంపాటి రామ్మోహన్ రావు ఖండించారు. రైతుల ఆవేదనను చూసి భువనేశ్వరి చలించిపోయి గాజులు విరాళంగా ఇచ్చారని చెప్పారు దాన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు.

భువనేశ్వరిపై వైసీపీ చేసిన విమర్శల మీద టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రంగా ప్రతిస్పందించారు. జగన్ సతీమణి భారతి మాదిరిగా భువనేశ్వరి అవినీతికి పాల్పడలేదని ఆయన అన్నారు. భువనేశ్వరి ఏ కేసులోనూ నిందితురాలు కారని, మనీ లాండరింగ్ కేసులో భారతి ఐదో నిందితురాలని ఆయన అన్నారు. ఆమె బ్యాంక్ ఖాతాలను కూడా సీజ్ చేశారని ఆయన గుర్తు చేశారు.

ఉద్యమానికి భువనేశ్వరి తన గాజులు విరాళాలు ఇస్తే అంత ఉలుకు ఎందుకని టీడీపీ మరో నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ప్రశ్నించారు. భువనేశ్వరి గాజుల విరాళంతో జగన్ వెన్నులో వణుకు పుట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అమరావతిలోని 29 గ్రామాల్లో ఎక్కడికైనా వెళ్లగలరా అని ప్రశ్నించారు.