ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ జీబ్రోనిక్స్ జెబ్-మాంక్ బ్లూటూత్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ భారతదేశంలో లాంచ్ చేసింది. నెక్‌బ్యాండ్ తరహాలోనే వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్ కాల్స్ సమయంలో నాయిస్ తగ్గించడానికి ఆక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ తో వస్తుంది.

ఇతర ఫీచర్స్ లో  స్మార్ట్ కంట్రోల్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ఉన్నాయి. జెబ్-మాంక్ ఇయర్‌ఫోన్‌లు స్ప్లాష్ ప్రూఫ్ డిజైన్‌ పొందింది. దీనిలో బ్యాటరీ 12 గంటల వరకు ప్లేబ్యాక్ సమయాన్ని అందించేలా రూపొందించారు.

కొత్త ఇయర్‌ఫోన్స్ 12 ఎంఎం నియోడైమియం మాగ్నెట్ డ్రైవర్‌తో మంచి  బేస్ అందిస్తాయని జెబ్రోనిక్స్ పేర్కొంది. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌ల బరువు కేవలం 32 గ్రాములు మాత్రమే.
 

భారతదేశంలో జీబ్-మాంక్ ధర, సేల్స్ 
జెబ్-మాంక్ వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్  ధర రూ. భారతదేశంలో 4,999, ఒకే బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తాయి. భారతదేశంలోని ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్లు, రిటైల్ దుకాణాల్లో లభిస్తాయని పేర్కొంది.

also read 4 సంవత్సరాల తరువాత ఇండియన్ యూసర్ల కోసం నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫీచర్.. ...

జెబ్-మాంక్ ఇయర్‌ఫోన్స్ ఫీచర్స్ 
 ఫీచర్స్ విషయానికొస్తే జీబ్-మాంక్ వైర్‌లెస్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ వర్క్ అవుట్  సమయంలో సౌకర్యామైన నెక్‌బ్యాండ్ సపోర్ట్ తో వస్తాయి. స్టైలిష్ డిజైన్‌తో కూడా ఉంటాయి. ఇయర్‌ఫోన్స్ స్ప్లాష్ ప్రూఫ్ తో వస్తుంది, అంటే అవి వర్క్ అవుట్ సమయంలో అప్పుడప్పుడు వాటిపై చెమట చిందటం, చెమటను తట్టుకోగలవు.

బ్యాటరీ లైఫ్ విషయానికొస్తే, జీబ్-మాంక్ ఇయర్‌ఫోన్స్  12 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ అందిస్తుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్  ఆన్ లో ఉంటే 10 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ అందిస్తాయి. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌లో అదనపు బేస్ అందించడానికి 12 ఎంఎం నియోడైమియం మాగ్నెట్ డ్రైవర్ అమర్చినట్లు కంపెనీ పేర్కొంది.

మెడ నుండి జారిపడకుండా మరింత భద్రత కోసం  మాగ్నెట్ కారణంగా ఇయర్‌పీస్ ఒకదానికొకటి అతుక్కుంటాయి. ఇతర ఫీచర్స్ లో వీడియో, ఆడియో కోసం స్మార్ట్ కంట్రోల్స్ ఉన్నాయి. వాయిస్ కమాండ్ కంట్రోల్స్  సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5 కూడా సపోర్ట్  చేస్తుంది.

జెబ్రోనిక్స్ డైరెక్టర్ ప్రదీప్ దోషి ఒక ప్రకటనలో, “వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారికి ఈ ఇయర్ ఫోన్లు ఎంతో అవసరమని నేను భావిస్తున్నాను. మా బ్రాండ్  టెక్నాలజి పరిజ్ఞానాన్ని ప్రజలకు సరసమైనదిగా చేయడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ” అని అన్నారు.