చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమి ఫిబ్రవరి 23న ఎమ్‌డబ్ల్యుసి ప్రీ ఈవెంట్‌లో ఎం‌ఐ 10 సిరీస్‌ను ఆవిష్కరించాల్సిన తేదీని  ఇప్పుడు మార్చి 27న మార్చింది.  ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది.

ఈ లాంచ్ ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లోని అధికారిక షియోమి ఖాతాలలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని ఒక న్యూస్ వెబ్ సైట్ నివేదించింది. కంపెనీ ఇప్పటికే దాదాపు 10 నెలల క్రితం చైనా మార్కెట్లో ఎం‌ఐ 10 లైనప్‌ను విడుదల చేసింది.

also read  కరోనా వైరస్ పై ఉద్యోగులకు ఆపిల్ సి‌ఈ‌ఓ సలహా...

రాబోయే ఎం‌ఐ ​​10 సిరీస్‌లో స్టాండర్డ్ ఎం‌ఐ 10 స్మార్ట్ ఫోన్ 5జి, ఎం‌ఐ 10 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌, 6.67-అంగుళాల ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి ఫుల్ హెచ్‌డి + పంచ్-హోల్ డిస్ప్లేను ఉంది. రెండు స్మార్ట్ ఫోన్స్ లో 20 ఎంపి సెల్ఫీ కెమెరా సెన్సార్ ఇందులో ఉంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే ఎం‌ఐ 10లో 108 ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా, 13 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2 ఎంపి మాక్రో కెమెరా, 2 ఎంపి డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ప్రో వెర్షన్‌లో 108 ఎంపి ప్రైమరీ కెమెరాతో పాటు 20 ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 8 ఎంపి టెలిఫోటో కెమెరా, 12 ఎంపి పోర్ట్రెయిట్ కెమెరా ఉన్నాయి.

also read రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్....ఎక్కువ రోజుల వాలిడిటీతో....

ఎం‌ఐ 10ప్రో 4500 ఎంఏహెచ్ బ్యాటరీని 50W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్  తో వస్తుంది.  నాన్-ప్రో మోడల్ ఎం‌ఐ10 స్మార్ట్ ఫోన్ 4780mAh సామర్థ్యం కలిగిన పెద్ద బ్యాటరీతో వస్తుంది.