ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయరీ సంస్థ షియోమీ రెడ్‌మీ  కె30  పేరుతో మొట్టమొదటి 5జి ఫోన్‌ని ఇండియాలో  లాంచ్ చేయనుంది. ఫ్రాస్ట్ వైట్, మిస్ట్ పర్పుల్ రంగులలో స్మార్ట్‌ఫోన్‌ రానుంది. 6జిబి + 64జిబి, 6జిబి + 128జిబి ఇంకా 8జిబి + 128జిబి కాన్ఫిగరేషన్‌లతో ఫోన్‌ను లాంచ్ చేయవచ్చని కూడా సమాచారం.

షియోమి స్పిన్‌ఆఫ్ సంస్థ రెడ్‌మి డిసెంబర్‌లో చైనాలో రెడ్‌మి కె30, రెడ్‌మి కె30 5జిలను విడుదల చేసింది. రెడ్‌మి కె30 ను ఫిబ్రవరిలో పోకో ఎక్స్ 2 గా లాంచ్ చేశారు.

 టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ సహకారంతో రెడ్‌మి కె30 5జిని భారతదేశంలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765జితో లాంచ్ చేయవచ్చు. దేశంలో 5జి నెట్‌వర్క్ కనెక్టివిటీ ఉన్న మొదటి రెడ్‌మి ఫోన్ ఇదే కావచ్చు. ఇందులో 8జిబి + 256జిబి మోడల్‌ కూడా ఉంది, కాకపోతే అది భారతదేశంలో లాంచ్ కాకపోవచ్చు.

also read ఎయిర్‌టెల్ కస్టమర్లకు స్పెషల్ ఆఫర్.. రీఛార్జ్ పై ఉచిత డాటా కూపన్లు.. ...

రెడ్‌మి కె30 5జి స్పెసిఫికేషన్లు 
 డ్యూయల్ సిమ్ (నానో), 6.67-అంగుళాల పూర్తి-హెచ్‌డి + హోల్-పంచ్ డిస్ ప్లే, 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 120Hz రిఫ్రెష్ రేట్. 5జి వేరియంట్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 765జితో పాటు 8 జిబి ర్యామ్, 256 జిబి వరకు స్టోరేజ్ ఉంటుంది.  

క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 64 మెగాపిక్సెల్ సోనీ IMX686 ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా, 120 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో డ్యూయల్ సెల్ఫీ కెమెరా వస్తుంది.

ఈ సెటప్‌లో 20 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అమర్చారు. ఫోన్ యూ‌ఎస్‌బి టైప్-సి పోర్టుతో పాటు 3.5 ఎంఎం ఆడియో జాక్ తో వస్తుంది.