కరోనా వైరస్ లాక్ డౌన్ సడలింపుతో స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు తిరిగి లాభాలను ఆర్జించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందుకోసం ఆఫర్లతో పాటు కొన్ని స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్ కూడా అందిస్తుంది. కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు షియోమి సంస్థ తాజా రెడ్‌మి కె 20 ప్రో ధరపై భారీగా తగ్గింపు అందిస్తుంది.

 
షియోమి సంస్థ జూలై 13 వరకు భారతదేశంలో రెడ్‌మి కె20ప్రో స్మార్ట్ ఫోన్ ధర పై తాత్కాలికంగా తగ్గింపును ప్రకటించింది. ప్రమోషనల్ డిస్కౌంట్ కింద రెడ్‌మి కె 20 ప్రో 6జిబి + 128జిబి వేరియంట్ ఇప్పుడు రూ .24,999 వద్దకే లభిస్తుంది, దాని రిటైల్ ధర రూ.26,999 నుండి, రూ .2,000 ధర తగ్గింపుతో అందిస్తున్నామని షియోమి ఇండియా సీఈఓ మను కుమార్ జైన్ ట్విట్టర్‌లో ప్రకటించారు. అయితే రెడ్‌మి కె20ప్రో 8జిబి + 256జిబి మోడల్ ధర పై మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండదని దీనిని రూ .29,999కే లభిస్తుందని అన్నారు.

also read  జూమ్‌ యాప్‌ను కాపీ చేసిందంటు జియోమీట్‌పై ఫైర్‌.. చట్టపరమైన చర్యలకు సిద్ధం.. ...


రెడ్‌మి కె20ప్రో ఫీచర్లు

రెడ్‌మి కె20ప్రో 6.39-అంగుళాల పూర్తి హెచ్‌డి +అమోలెడ్ డిస్‌ప్లే, 1,080X2,340 పిక్సెల్-స్క్రీన్ రిజల్యూషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో కూడా వస్తుంది.  రెడ్‌మి కె 20 ప్రోలో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది, వీటితో పాటు 8జిబి ర్యామ్, 256 జిబి వెరీఎంట్ కూడా  ఉంది.

ఫోటోగ్రఫీ కోసం 48 మెగాపిక్సెల్ సోనీ ఐ‌ఎం‌ఎక్స్586 ప్రైమరీ లెన్స్‌తో f / 1.75 ఎపర్చర్‌తో ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్‌ ఉంది, 13 మెగాపిక్సెల్ సెకండరీ వైడ్ యాంగిల్ లెన్స్ ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో, 8 మెగాపిక్సెల్ థర్డ్ లెన్స్ f / 2.4 ఎపర్చరు కలిగి ఉంది. ముందు భాగంలో రెడ్‌మి కె20 పాప్-అప్ 20ఎంపి సెల్ఫీ కెమెరాను ప్యాక్ చేస్తుంది. రెడ్‌మి కె20 ప్రో వెనుక కెమెరా నైట్ మోడ్,  ఏ‌ఐ స్కై స్కేపింగ్ వంటి ఫీచర్స్ తో వస్తుంది.

దీనిలో 4,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్  చేస్తుంది. రెడ్‌మి కె20ప్రో కనెక్టివిటీ ఫీచర్లలో 4జి వి‌ఓ‌ఎల్‌టి‌ఈ, వై-ఫై 802.11ac, బ్లూటూత్ వి5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. రెడ్‌మి కె20 ప్రో కార్బన్ బ్లాక్, ఫ్లెమ్ రెడ్, గ్లెసియర్ బ్లూ, పెర్ల్ వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.