షియోమీ ఆటోమేటిక్‌ సోప్‌ డిస్పెన్సర్‌, స్మార్ట్‌ ఎల్‌ఈడీ బల్బు చూసారా....

షియోమీ సరికొత్త ఉత్పత్తులు స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బ్, ఎం‌ఐ ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్‌లను భారత్‌లో విడుదల చేసింది. ఎం‌ఐ స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ 810 ల్యూమన్ కూల్ వైట్ లైట్ 7.5W శక్తిని వినియోగిస్తుంది. ఎం‌ఐ  హోమ్ యాప్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. 

xiaomi Mi Smart LED Bulb, Mi Automatic Soap Dispenser Launched in India

ఢిల్లీ:  ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థ షియోమీ సరికొత్త ఉత్పత్తులు స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బ్, ఎం‌ఐ ఆటోమేటిక్ సోప్ డిస్పెన్సర్‌లను భారత్‌లో విడుదల చేసింది. ఎం‌ఐ స్మార్ట్ ఎల్ఈడి బల్బ్ 810 ల్యూమన్ కూల్ వైట్ లైట్ 7.5W శక్తిని వినియోగిస్తుంది.

ఎం‌ఐ  హోమ్ యాప్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఎంఐ స్మార్ట్‌ లివింగ్‌ 2021 పేరుతో  నిర్వహించిన ఈవెంట్‌లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐవోటీ) డివైజ్‌లను  కంపెనీ ఆవిష్కరించింది. టచ్ సెన్సిటివ్ తో ఆటోమెటిక్‌గా తెరుచుకొని సబ్బు నురగను విడుదల  చేసే డిస్పెన్సర్‌లో తక్కువ శబ్దం వచ్చే మోటారు,ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సార్‌ను ఉపయోగించారు.

బల్బు వెలుతురును యాప్‌ ద్వారా అడ్జెస్ట్‌ చేయవచ్చు. కూర్చొన్న దగ్గరి నుంచే బల్బును  స్విచ్‌ ఆన్‌/ఆఫ్‌ చేసే ఫీచర్‌ ఇందులో ఉంది. బల్బు ధర  రూ.499 కాగా   ఎంఐ డాట్‌ కామ్‌, ఎంఐ హోమ్‌ స్టోర్ల ద్వారా కొనుగోలు  చేయొచ్చు. 

also read అతిపెద్ద భారీ 7040mAh బ్యాటరీతో సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్.. ...

ఆటోమేటిక్‌ సోప్‌ డిస్పెన్సర్‌ ధర రూ.999గా కంపెనీ నిర్ణయించింది. అక్టోబర్‌ 15 నుంచి ఎంఐ డాట్‌కామ్‌, ఎంఐ  హోమ్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.  కంపెనీ ఇప్పటికే ఎంఐ వాట్‌ రివాల్వ్‌, ఎం స్మార్ట్‌ స్పీకర్‌ను విడుదల చేసింది.

స్మార్ట్ ఎల్‌ఈడీ బల్బ్‌ 15,000 గంటల సర్వీస్  లైఫ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది, అంటే రోజుకు 6 గంటలు పాటు బల్బును ఉపయోగిస్తేగించిన 7 సంవత్సరాల పాటు పనిచేస్తుంది. దీనిని వాయిస్‌ ద్వారా కూడా నియంత్రించవచ్చు అమెజాన్ అలెక్సాతో పాటు గూగుల్ అసిస్టెంట్‌తో అనుకూలంగా ఉంటుంది.

బల్బ్‌ను ఉపయోగించడానికి హోల్డర్ అవసరం లేదని, ఎం‌ఐ హోమ్ యాప్ ద్వారా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దీన్ని నేరుగా ఉపయోగించవచ్చని కంపెనీ తెలిపింది.

xiaomi Mi Smart LED Bulb, Mi Automatic Soap Dispenser Launched in India
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios