Asianet News TeluguAsianet News Telugu

హై-ఎండ్ ఫీచర్స్ తో షియోమి కొత్త ఫోన్.. 23 నిమిషాల్లో ఫుల్ చార్జ్..

 స్మార్ట్‌ఫోన్ సంస్థ పోర్ట్‌ఫోలియోలో ఎం‌ఐ 10, ఎం‌ఐ 10 ప్రో, ఎం‌ఐ 10 లైట్‌ కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎం‌ఐ 10, ఎం‌ఐ 10 ప్రోలను ఆవిష్కరించగా ఎం‌ఐ 10 లైట్ మార్చిలో లాంచ్ చేసింది. 

xiaomi Mi 10 Ultra latest smartphone launched
Author
Hyderabad, First Published Aug 12, 2020, 6:26 PM IST

స్మార్ట్ ఫోన్ తయారీ షియోమి ఎం‌ఐ 10 లైనప్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ ఎం‌ఐ 10అల్ట్రా జోడించనుంది. షియోమి సంస్థ 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు జరిగిన వర్చువల్ ఈవెంట్‌లో ఎం‌ఐ 10 అల్ట్రాను ఆవిష్కరించింది.

స్మార్ట్‌ఫోన్ సంస్థ పోర్ట్‌ఫోలియోలో ఎం‌ఐ 10, ఎం‌ఐ 10 ప్రో, ఎం‌ఐ 10 లైట్‌ కూడా ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎం‌ఐ 10, ఎం‌ఐ 10 ప్రోలను ఆవిష్కరించగా ఎం‌ఐ 10 లైట్ మార్చిలో లాంచ్ చేసింది. షియోమి ఎం‌ఐ 10ను భారతదేశంలో మేలో విడుదల చేసింది. అయితే మిగతా రెండు ఫోన్‌లు మాత్రం ఇంకా ఇండియా విడుదల కాలేదు.

షియోమి ఎం‌ఐ 10 అల్ట్రా ధర
ఎం‌ఐ 10 అల్ట్రా బేస్ వెరీఎంట్ 8జిబి + 128 జిబి ధర సిఎన్‌వై 5,299 (ఇండియాలో సుమారు రూ. 57,000) వద్ద ప్రారంభమవుతుంది. 8జిబి + 256జిబి వేరియంట్  ధర సిఎన్‌వై 5,599 (ఇండియాలో సుమారు రూ .60,100), 12జిబి + 256జిబి వేరియంట్ ధర సిఎన్‌వై  5,999 (ఇండియాలో సుమారు రూ. 64,400), 16జిబి + 512జిబి ధర సిఎన్‌వై  6,999 (ఇండియాలో సుమారు రూ .75,200). షియోమి ఎం‌ఐ  10 అల్ట్రా అబ్సిడియన్ బ్లాక్, మెర్క్యురీ సిల్వర్, ట్రాన్స్పరెంట్ ఎడిషన్‌ కలర్లో రానుంది. ఆగస్టు 16 నుండి చైనాలో ఈ ఫోన్  సేల్స్ ప్రారంభం కానుంది. కాకపోతే అంతర్జాతీయ విడుదలపై సమాచారం  లేదు.


షియోమి ఎం‌ఐ 10 అల్ట్రా స్పెసిఫికేషన్లు
ఎం‌ఐ 10 అల్ట్రా ఆండ్రాయిడ్ 10 ఓ‌ఎస్ పై నడుస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల పూర్తి-హెచ్‌డి + ఓ‌ఎల్‌ఈ‌డి  డిస్ ప్లే, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 16జి‌బి LPDDR 5 ర్యామ్ తో వస్తుంది.

ఇంటర్నల్  512జి‌బి వరకు UFS 3.1  స్టోరేజ్ కూడా ఉంది. షియోమి ప్రకారం, ఎం‌ఐ 10 అల్ట్రా ఫోన్ విసి లిక్విడ్ కూలింగ్, మల్టీ-లేయర్ గ్రాఫైట్, థర్మల్ సెన్సార్ అర్రే, గ్రాఫేన్‌తో వస్తుంది. ఇది ఇంటెన్సివ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ ఎక్కువ వేడిగా ఉండకుండా చేస్తుంది.

also read గ్లాస్ డిస్ ప్లేతో షియోమి ఎం‌ఐ సరికొత్త టి‌వి.. ధర ఎంతంటే ? ...

ఎం‌ఐ 10 అల్ట్రా క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా కూడా ఉంటుంది.

ఇతర మూడు వెనుక కెమెరాల్లో 20 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్, 12 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా, సోనీ IMX586 ఇమేజ్ సెన్సార్ టెలిఫోటో షూటర్ ఉన్నాయి, లేజర్ ఆటో-ఫోకస్, ఫ్లికర్ సెన్సార్ ఉంది. కెమెరా సెటప్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఫోన్ ప్రాథమిక, టెలిఫోటో షూటర్ల నుండి 8కె వీడియోలను రికార్డ్ చేయగలదు. ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ కెమెరా ఉంది.

 షియోమిలో వై-ఫై 6, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సి, ఇతర సాధారణ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 23 నిమిషాలు పడుతుంది. అదనంగా 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది, కేవలం 40 నిమిషాల్లో పూర్తి ఛార్జీ చేస్తుంది.

ఛార్జర్ ధర సి‌ఎన్‌వై 199 (ఇండియలో సుమారు రూ. 2,100). ఇంకా, ఫోన్ 10W వరకు రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ఇతర ఫీచర్స్ ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, యూ‌ఎస్‌బి టైప్-సి కేబల్ ఉన్నాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios