షియోమీ కొత్త ఎంఐ10 స్మార్ట్ ఫోన్ లాంచ్...ధర ఎంతో తెలుసా ?
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తాజాగా మరో ఫ్లాగ్ షిప్ ఫోన్ ఎంఐ10 ఫోన్ ఆవిష్కరించింది. దీని ధర రూ.43 వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతుంది.
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ.. బడ్జెట్ ధరల్లో అందుబాటులోకి తీసుకొస్తున్న స్మార్ట్ ఫోన్ల మేజర్ షియోమీ.. తాజాగా మరో ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ‘ఎంఐ 10’ ఆవిష్కరించింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 865 ఎస్వోసీ, ఎల్పీడీడీఆర్6 రామ్ ఫీచర్లతో ఈ ఫోన్ రూపుదిద్దుకున్నది.
క్వాడ్ రేర్ కెమెరా సెటప్, 90హెచ్‌జడ్ కర్వ్డ్ డిస్ ప్లే కలిగి ఉంది. గతేడాది విపణిలోకి షియోమీ విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ ‘ఎంఐ9’కు కొనసాగింపుగా ఎంఐ 10 ఫోన్ విపణిలోకి వచ్చేస్తున్నది.
also read వాట్సాప్ సరికొత్త రికార్డు: ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల యూజర్లు
న్యూ ‘ఎంఐ-సిరీస్’ ఫోన్లలో భాగంగా ఎంఐ 10తోపాటు ఎంఐ ప్రో ఫోన్ కూడా షియోమీ అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఆవిష్కరణకు ముందు షియోమీ.. ఎంఐ 10 ఫోన్ కు సంబంధించిన వివరాలేమీ లీక్ చేయలేదు.
చైనా సోషల్ మీడియా వేదిక వైబో వేదికగా ‘ఎంఐ 10’ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఆన్ లైన్ లో మాత్రమే ఎంఐ10 ఫోన్ ప్రత్యక్ష ప్రసారం కానున్నది. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కరోనా వైరస్ ఎఫెక్ట్ అని చెబుతున్నారు.
ఈ నెల 23వ తేదీన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) సమావేశాల సందర్భంగా ఈ ఫోన్‌ను షియోమీ అంతర్జాతీయంగా ఆవిష్కరించనున్నది.
అయితే ‘ఎంఐ 10’ ఫోన్ 8జీబీ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర 4200 యువాన్లు (సుమారు రూ.43 వేలు), 8 జీబీ విత్ 256 జీబీ స్టోరేజీ ధర 4500 యువాన్లు (రూ.46 వేలు), 12 జీబీ విత్ 256 ఇంటర్నల్ స్టోరేజీ మోడల్ ఫోన్ ధర 4900 యువాన్లు (రూ.50,200) ఉంటుంది.
also read గుడ్ న్యూస్ ఐటీ రంగంలో ఈ ఏడాది రెండు లక్షల కొత్త ఉద్యోగాలు
గతేడాది ఫిబ్రవరి నెలలో ఎంఐ9 ఫోన్‌ను షియోమీ ఆవిష్కరించింది. ఈ ఫోన్ ధరలు రూ.30,700 నుంచి రూ.33,800 మధ్య ఉంటాయి. ఇక ఎంఐ 10 ఫోన్ ఎంఐయూఐ 11, కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది.
90హెచ్‌జడ్, సింగిల్ హోల్ పంచ్ డిజైన్‌తో రూపుదిద్దుకున్నది ఈ ఫోన్. 180 హెచ్ జడ్ టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్డీఆర్10 ప్లస్ స్టాండర్డ్, 8కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉన్నాయి.
4500 ఎంఎహెచ్ బ్యాటరీతోపాటు 50 వాట్ల వైర్డ్ ప్లాష్ చార్జి టెక్నాలజీ, 30 డబ్ల్యూ వైర్ లైస్ చార్జింగ్, 10 డబ్ల్యూ రివర్స్ వైర్ లెస్ చార్జింగ్ వసతులు కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ 5జీ సామర్థ్యం కలిగి ఉండటంతోపాటు వై-ఫై 6, బ్లూ టూత్, డ్యూయల్ ఫ్రీక్వెన్సీ జీపీఎస్, ఎన్ఎఫ్సీ, ఇన్ ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్, 109 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కలిగి ఉంటుంది.