Asianet News TeluguAsianet News Telugu

ఈ ఫోన్లలో వాట్సాప్ ఇక పనిచేయదు: అప్‌డేట్ కావాల్సిందే!

విండోస్ ఫోన్ల వినియోగదారులకు ఇది ఖచ్చితంగా చేదువార్తే. ఎందుకంటే.. ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఈ ఏడాది డిసెంబర్ నుంచి నుంచి విండోస్  ఫోన్లలో పనిచేయదు. విండోస్ ఫోన్లకు వాట్సాప్ చివరి అప్‌డేట్ జూన్ వరకే వస్తుంది.

WhatsApp to end support for Windows phone on Dec 31, 2019
Author
New Delhi, First Published May 9, 2019, 5:32 PM IST

విండోస్ ఫోన్ల వినియోగదారులకు ఇది ఖచ్చితంగా చేదువార్తే. ఎందుకంటే.. ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఈ ఏడాది డిసెంబర్ నుంచి నుంచి విండోస్  ఫోన్లలో పనిచేయదు. విండోస్ ఫోన్లకు వాట్సాప్ చివరి అప్‌డేట్ జూన్ వరకే వస్తుంది.

ఆ తర్వాత 2020 జనవరి 1 నుంచి విండోస్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ఇప్పటి టెక్నాలజీకి తగినట్లుగా కొత్త కొత్త అప్‌డేట్స్ చేస్తుండటం, ఫీచర్స్ మారుస్తుండటంతో పాత ఫోన్లలో యాప్ సరిగా పనిచేయట్లేదు. దీంతో వాటికి వాట్సాప్ సేవల్ని శాశ్వతంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే దశలవారీగా పాత ఫోన్లలో వాట్సాప్ సేవల్ని నిలిపేస్తోంది.

విండోస్ ఫోన్లతోపాటు ఆండ్రాయిడ్ 2.3.7 అంతకంటే ముందు వర్షన్లు, ఐఓఎస్ 7 అంతకంటే ముందు ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో కూడా 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. తమ సేవలు కొనసాగాలంటే ఓఎస్ 4.0 ప్లస్, ఐఓఎస్ 7 ప్లస్ లేదా విండోస్ ఫోన్ 8.1 ప్లస్‌కు అప్‌డేట్ చేసుకోవాలని వాట్సాప్ సూచిస్తోంది.

అయితే, పాత ఫోన్లలో వాట్సాప్ ఆపేయ్యడం ఇదే తొలిసారి కాదు. 2017 జూన్‌లో నోకియా సింబియాన్ ఎస్60, అదే ఏడాది డిసెంబర్ నుంచి బ్లాక్ బెర్రీ 10ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. 

ఇక ఆండ్రాయిడ్ రన్నింగ్ ఓఎస్ 4.0 ప్లస్, ఐఫోన్ రన్నింగ్ ఐఓఎస్ 8 ప్లస్, విండోస్ ఫోన్ 8.1 ప్లస్, జియో ఫోన్, జియో ఫోన్ 2కు వాట్సప్ సేవలు కొనసాగుతాయి. అయితే ఈ ఫోన్లలో చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం లేదని వాట్సాప్ వెల్లడించింది. చాట్ హిస్టరీని ఈ-మెయిల్‌కు పంపుకోవచ్చని సూచించింది.

Follow Us:
Download App:
  • android
  • ios