Asianet News TeluguAsianet News Telugu

లేటెస్ట్ వెరైటీ ఫీచర్లతో వీయు ప్రీమియం 4కె టీవీలు...

కొత్త వు బ్రాండ్  4కె యుహెచ్‌డి టివిలు షియోమి ఎం‌ఐ టివి 4 కు ప్రత్యక్ష పోటీగా ఉంటుందని, వు బ్రాండ్ ఎక్కువగా సోనీ వంటి హై-ఎండ్ బ్రాండ్‌లను లక్ష్యంగా చేసుకుందని, దీని స్మార్ట్ 4కె యుహెచ్‌డి టివిల ధర సాధారణంగా రూ .1 లక్షపై వరకు ఉంటాయని చెప్పారు.
 

Vu Premium new range 4K TV launched  with Dolby Vision support  in India
Author
Hyderabad, First Published Mar 13, 2020, 12:37 PM IST

ముంబైకి చెందిన వు టెలివిజన్ మూడు కొత్త  4కె యుహెచ్‌డి స్మార్ట్ టివిలను మంగళవారం విడుదల చేశాయి. భారతదేశంలో బడ్జెట్, మధ్య-శ్రేణి విభాగాలను లక్ష్యంగా పెట్టుకున్న టిసిఎల్, ఇతరులతో పాటు వు బ్రాండ్ సరసమైన టీవీలను అందిస్తున్నట్లు తెలిసింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరిస్తూ, వు బ్రాండ్ 43 అంగుళాల, 49-అంగుళాల, 55-అంగుళాల 4కె యుహెచ్‌డి టివిలను అధికారిక ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌తో సరసమైన ధర అందిస్తున్నారు.

కొత్త వు బ్రాండ్  4కె యుహెచ్‌డి టివిలు షియోమి ఎం‌ఐ టివి 4 కు ప్రత్యక్ష పోటీగా ఉంటుందని, వు బ్రాండ్ ఎక్కువగా సోనీ వంటి హై-ఎండ్ బ్రాండ్‌లను లక్ష్యంగా చేసుకుందని, దీని స్మార్ట్ 4కె యుహెచ్‌డి టివిల ధర సాధారణంగా రూ .1 లక్షపై వరకు ఉంటాయని చెప్పారు.టాప్-ఎండ్ స్పెసిఫికేషన్లతో కూడిన 4కె యుహెచ్‌డి టివి  సరసమైన ధరకే వద్ద వివిధ రకాల కంటెంట్‌కు సపోర్ట్ చేస్తుంది అని కంపెనీ భావిస్తోంది.

also read చైనాలో తిరిగి తెరుచుకొనున్న ఆపిల్ ఐఫోన్ స్టోర్లు....

43 అంగుళాల, 49-అంగుళాల, 55-అంగుళాల వు ఆండ్రాయిడ్ 4కె యుహెచ్‌డి టివిలు 3840x2160 పిక్సెల్ రిజల్యూషన్‌తో A + గ్రేడ్ ఐపిఎస్ ప్యానల్‌తో, 60Hz రిఫ్రెష్ రేటుతో వస్తాయి. ఈ మూడింటికీ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2.5 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

 డైనమిక్ కాంట్రాస్ట్ డిస్ ప్లే, హై బ్రైట్ మోడ్, స్మూత్ మోషన్ కంట్రోల్,  వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌కి సపోర్ట్ చేస్తాయి. స్మార్ట్ టీవీలు అధికారిక ఆండ్రాయిడ్ 7.0 స్మార్ట్ ఓఎస్‌తో పనిచేస్తాయి. ఇది గూగుల్ ప్లే స్టోర్, గూగుల్ ఎకో సిస్టమ్, గూగుల్ మూవీస్, మ్యూజిక్, గేమ్‌లతో వస్తుంది. మీ ఆండ్రాయిడ్, ఐ‌ఓ‌ఎస్, మాక్, విండోస్ లేదా క్రోమ్ బుక్ నుండి టీవీకి  ప్రసారం చేయడానికి గూగుల్ క్రోమ్ కాస్ట్ కు సపోర్ట్ ఇస్తాయి.

ఆండ్రాయిడ్ టీవీ లైనప్ యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, ఫేస్‌బుక్, సోనీ లివ్, ఎఎల్‌టి బాలాజీలకు ఆక్సెస్ చేస్తూ వూ హైలైట్ చేస్తుంది. ముఖ్యంగా, యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌లో 4కె కంటెంట్‌ను ప్రసారం చేయగలదు. తాజా వు బ్రాండ్ ఆండ్రాయిడ్ టివి కనెక్టివిటీ ఆప్షన్ లో వై-ఫై, ఈథర్నెట్, బ్లూటూత్, 3 హెచ్‌డిఎంఐ పోర్టులు ఉన్నాయి.  

అదనంగా, టీవీలు రెండు 10W బాక్స్ స్పీకర్, డి‌టి‌ఎస్ సపోర్ట్ తో ఇంటర్నల్ డాల్బీ సౌండ్‌బార్, ఇతర ఫీచర్లలో హెడ్‌ఫోన్ జాక్, వాయిస్ కంట్రోల్డ్ రిమోట్ టీవీలతో పాటు షిప్పింగ్ చేస్తారు.మూడు వు బ్రాండ్ 4కె యుహెచ్‌డి టివిలు అధికారిక, లైసెన్స్ పొందిన ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ భవిష్యత్తులో అవి ఆండ్రాయిడ్ ఓరియోకు అప్‌గ్రేడ్ అవుతాయని చెప్పారు.  

also read  బిఎస్‌ఎన్‌ఎల్ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్...కాల్స్, హై-స్పీడ్ డాటా ఫ్రీ....


  కంపెనీ తన 43-అంగుళాల, 49-అంగుళాల మరియు 55-అంగుళాల ఆండ్రాయిడ్ 4కె యుహెచ్‌డి టివిల ధరలను వరుసగా రూ .36,999, రూ .46,999, రూ .55,999 గా నిర్ణయించింది. ఈ టీవీలు మార్చి 16 అర్ధరాత్రి నుండి  ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించబడతాయి. వు బ్రాండ్ 43 అంగుళాల ఆండ్రాయిడ్ టివి ప్రస్తుతం మార్కెట్లో  ఉన్న చౌకైన 4కె యుహెచ్‌డి టెలివిజన్లలో ఒకటి.  
 

టీవీల ఉత్పత్తికి పేరొందిన వీయు టెలివిజన్‌ ఆధునిక టెక్నాలజీతో వీయు ప్రీమియం 4కె టీవీని రూపొందించింది. దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసిన సందర్భంగా వియు టెలివిజన్‌ సీఈఓ దేవిత సరఫ్‌ మాట్లడుతూ ఈ ప్రీమియం 4కె టీవీలో లేటెస్ట్ ఫీచర్స్‌ను, నూతన హంగులతో డిజైన్‌ చేశారు. దీన్ని 3 మూడు సైజులో (43, 50, 55 అంగుళాలు)తయారు చేశామని, ఆండ్రాయిడ్‌ 9.0తో, ప్రత్యేకమైన డాల్బీ సౌండ్‌ సిస్టమ్‌తో రూపొందించామని తెలిపారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios