డ్యూయల్ హోల్-పంచ్ సెల్ఫీ కెమెరాలతో వివో కొత్త స్మార్ట్ ఫోన్

 ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో ఇ-కామర్స్ కార్యకలాపాలను అనుమతి ఇచ్చింది అలాగే ఆఫ్‌లైన్ రిటైలర్లకు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించడంతో, చైనా కంపెనీ వివో వి19ను లాంచ్ చేయాలని నిర్ణయించింది.
 

Vivo V19 Set to Launch in India With Dual Hole-Punch Selfie Cameras

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ  వివో కొత్త మోడల్  వి19 స్మార్ట్ ఫోన్ మే 12 మంగళవారం భారతదేశంలో లాంచ్ చేయనుంది. కొత్త వివో స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 26న దేశంలో లాంచ్ చేయాలని భావించారు, అయితే కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా  విడుదల చేయలేకపోయారు.

 ప్రభుత్వం కొన్ని ప్రాంతాలలో ఇ-కామర్స్ కార్యకలాపాలను అనుమతి ఇచ్చింది అలాగే ఆఫ్‌లైన్ రిటైలర్లకు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతించడంతో, చైనా కంపెనీ వివో వి19ను లాంచ్ చేయాలని నిర్ణయించింది.లాంచ్ టీజర్ల ప్రకారం వివో వి19 ఇండియా వెర్షన్ స్మార్ట్ ఫోన్ ఇండోనేషియాలో లాంచ్ చేసిన మోడల్‌కు భిన్నంగా ఉంటుంది.

కరోనా వైరస్  లాక్ డౌన్ కారణంగా దేశం లోని అన్నీ వ్యాపారాలు కొన్ని రోజులు స్తంభించి పోయాయి. లాక్ డౌన్ సడలింపు తరువాత భారతదేశంలో వివో వి 19 లాంచ్ మంగళవారం జరుగుతోంది. రియల్‌ మీ, షియోమి వంటి సంస్థలలాగా వివో వి19 స్మార్ట్ ఫోన్ లాంచ్ ను లైవ్ స్ట్రీమ్‌ను హోస్ట్ చేయటంలేదు. 

also read జియోతో సౌదీ సంస్థ మరో మెగా డీల్: కొత్తగా 320 బిలియన్ డాలర్ల పెట్టుబడులు...

భారతదేశంలో వివో వి19 ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే సుమారు 8జి‌బి ర్యామ్, 128 జిబి ఆన్ బోర్డ్ స్టోరేజ్ ఉన్న బేస్ వేరియంట్  25,000 రూపాయలు ఉంటుండొచ్చు అని అంచనా. ఈ ఫోన్ మిస్టిక్ సిల్వర్, పియానో ​​బ్లాక్ కలర్ ఆప్షన్లలో కూడా వస్తుందని చెబుతున్నారు.

వివో మొదట మార్చి 19నా వి19 స్మార్ట్ ఫోన్ ను ఇండోనేషియా మార్కెట్‌లో లాంచ్ చేసింది. అయితే, ఇండియా వేరియంట్ ఇండోనేషియా మోడల్‌కు భిన్నంగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఒరిజినల్ సింగిల్ హోల్-పంచ్ సెల్ఫీ కెమెరాకు బదులుగా డ్యూయల్ హోల్-పంచ్ సెల్ఫీ కెమెరా సెటప్‌తో వస్తున్నట్టు  సమాచారం. 

వివో గ్లోబల్ సైట్ ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం దీనికి డ్యూయల్ సిమ్ (నానో) వివో వి 19 ఆండ్రాయిడ్ 10 ఫన్‌టచ్ ఓఎస్ 10తో వస్తుంది. ఇది 6.44-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1080x2400 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 712 SoC , 8జి‌బి ర్యామ్ ఉంది. క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, కెమెరా సెటప్‌లో 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా ఉంది.

సెల్ఫీల కోసం, వివో వి 19 గ్లోబల్ వేరియంట్‌లో డ్యూయల్ సెల్ఫీ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 32 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో పాటు 8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి, 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios