Asianet News TeluguAsianet News Telugu

భారత మార్కెట్లోకి మరో 5జీ ​ఫోన్- ధర కాస్త ఎక్కువే!

భారత స్మార్ట్​ఫోన్​ విపణిలోకి మరో 5జీ స్మార్ట్​ఫోన్ విడుదలైంది. వివో సబ్​ బ్రాండ్ 'ఐక్యూ'.. ఐక్యూ3 పేరుతో ఈ మోడల్​ ఫోన్ ఆవిష్కరించింది. దేశంలో ఈ సంస్థ విడుదల చేసిన తొలి స్మార్ట్​ఫోన్ కూడా ఇదే. 

Vivo's iQoo 3 5G-ready phone launched in India. Check price, specification here
Author
Hyderabad, First Published Feb 26, 2020, 3:18 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భారత స్మార్ట్​ఫోన్ విపణిలోకి మరో కొత్త సంస్థ ప్రవేశించింది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ వివో సబ్​ బ్రాండ్గా ఐక్యూ పేరుతో దేశీయ విపణిలోకి ఆవిష్కరించింది. 

'ఐక్యూ3' పేరుతో 5జీ స్మార్ట్​ఫోన్​ను భారత మార్కెట్లోకి మంగళవారం ఐక్యూ విడుదల చేసింది. 8 జీబీ ర్యామ్​ ప్లస్ 128 స్టోరేజీ, 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 స్టోరేజీ సామర్థ్యంతో ఈ స్మార్ట్​ఫోన్​ను ఐక్యూ అందుబాటులోకి తెచ్చింది. 

వీటిలో 8 జీబీ విత్ 128 స్టోరేజీ ర్యామ్ ఫోన్ ధర రూ.36,990, 8 జీబీ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ ధర రూ.39,990, 12 జీబీ విత్ 256 జీబీ రామ్ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్ ధర రూ.44,990గా నిర్ణయించింది.

ఐక్యూ 3 స్మార్ట్ ఫోన్ అమ్మకాలు వచ్చే మార్చి 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఐక్యూ డాట్ కాం, ఫ్లిప్​కార్ట్​ ద్వారా కొనుగోళ్లకు అందుబాటులో ఉండనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్​ క్రెడిట్​ ద్వారా లావాదేవీలు, అన్ని రకాల ఈఎంఐలపై రూ.3,000 వరకు తగ్గింపు లభించనుంది.

ఈ ఫోన్ 6.44 అంగుళాల ఫుల్​ హెచ్​డీ+అమోలెడ్ డిస్​ప్లే కలిగి ఉంటుంది. 
వెనుక వైపు నాలుగు కెమెరాలు (48ఎంపీ+13ఎంపీ+13ఎంపీ+2ఎంపీ),  
రియర్​ కెమెరాతో 20x జూమ్​ సదుపాయం, 16 మెగా పిక్సెళ్ల పంచ్​ హోల్​ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 

ఇంకా స్నాప్​డ్రాగన్ 865 ప్రాసెసర్, 4440 ఎంఏహెచ్​ సామర్థ్యం గల బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. 55 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్​ (15 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ నింపే సామర్థ్యం) సపోర్ట్ ఉంది. యూఎస్​బీ టైప్​ సీ ఛార్జింగ్​ పోర్ట్​తోపాటు ఆండ్రాయిడ్ 10 ఓఎస్​పై ఈ ఫోన్ పని చేస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios