Asianet News TeluguAsianet News Telugu

త్వరలో మార్కెట్లోకి వచ్చే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..

స్మార్ట్‌ఫోన్లకు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారతదేశంలోకి మొబైల్ తయారీ దిగ్గజాలు తమ సరికొత్త ఉత్పత్తులను పోటాపోటీగా తీసుకొస్తున్నాయి. దక్షిణ కొరియాతోపాటు చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థలు ఈ ఏడాదిలోనే భారీ ఎత్తున తమ ఉత్పత్తులను భారత మార్కెట్లో  ప్రవేశపెడుతున్నాయి.

Upcoming Smartphones In 2019 That We Can't Wait For To Launch
Author
New Delhi, First Published May 6, 2019, 4:49 PM IST

స్మార్ట్‌ఫోన్లకు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారతదేశంలోకి మొబైల్ తయారీ దిగ్గజాలు తమ సరికొత్త ఉత్పత్తులను పోటాపోటీగా తీసుకొస్తున్నాయి. దక్షిణ కొరియాతోపాటు చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థలు ఈ ఏడాదిలోనే భారీ ఎత్తున తమ ఉత్పత్తులను భారత మార్కెట్లో  ప్రవేశపెడుతున్నాయి.

చైనా కంపెనీ వన్ ప్లస్‌కు చెందిన వన్‌ప్లస్ 7 ప్రో నాచ్ డిస్‌ప్లేతో రానుంది. వన్‌ప్లస్ మోడల్స్‌లో ఈ ఫీచర్స్ తో రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతోపాటు ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టంతో ఈ ఫోన్లు వస్తున్నాయి. 

ఇక మోటో మొబైల్స్ నుంచి మోటో జడ్ 4 కూడా అదిరిపోయే కెమెరాతో వస్తోంది. సింగిల్ షూటర్, లేజర్ ఆటో ఫోకస్, డ్యూయల్ టోన్ ఈడీ ఫ్లాష్ వంటి ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్ తోపాటు మోటోరోలా వన్ విజన్, గూగుల్ పిక్సెల్ 3ఏ ఎక్స్ఎల్, వన్ ప్లస్ 7ప్రో, గూగుల్ పిక్సెల్ 3ఏ వంటి ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చే కొన్ని టాప్ ఫోన్స్ గమనించినట్లయితే..

Oneplus 7 pro: అంచనా స్పెసిఫికేషన్స్

వన్‌ప్లస్ 7 ప్రో 6.70 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజీ, 48ఎంపీ,16ఎంపీ, 8ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. 

వన్‌ప్లస్ 7: అంచనా స్పెసిఫికేషన్స్

6.2 అంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 9పై, ఆక్సిజన్ ఓఎస్9, స్నాప్ డ్రాగన్  855 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, 48 ఎంపీ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే  ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4150 ఎంఏహెచ్ బ్యాటరీ.

Google pixel 3a XL: అంచనా స్పెసిఫికేషన్స్

6 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 9.0పై, 12.2ఎంపీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్టివ్ ఎడ్జ్, 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

Google pixel 3a: అంచనా స్పెసిఫికేషన్స్

5.6 అంగుళాల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 670 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజీ, ఆండ్రాయిడ్ 9.0పై, 12.2 ఎంపీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాక్టివ్ ఎడ్జ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Motorola Moto Z4

6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజీ, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0పై, 48 ఎంపీ బ్యాక్ కెమెరా, 25ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Motorala One Vision: అంచనా స్పెసిఫికేషన్స్

6.2 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ కెపాసిటీ టచ్ స్క్రీన్, ఆండ్రాయిడ్ 9.0పై, ఆండ్రాయిడ్ వన్ ఆక్టాకోర్, 48ఎంపీ రియర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా, లై-పో 3500 ఎంఏహెచ్ బ్యాటరీ(నాన్ రిమూవల్).

ఈ ఫోన్లతోపాటు నోకియా 9 ప్యూర్‌వ్యూ, రియల్‌మీ నుంచి ఓ కొత్త ఫోన్, నుబియా రెడ్ మ్యాజిక్ 3 లాంటి టాప్ ఫోన్లు కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios