శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం​ ఆపిల్ తన బడ్జెట్​ రేంజ్​​ ఐఫోన్​ 'ఎస్​ఈ 2020'ను ఆవిష్కరించింది. నాలుగేళ్ల క్రితం 2016లో విడుదలైన ఐఫోన్​ ఎస్​ఈకి అప్​డేట్​ వెర్షన్​గా 'ఎస్​ఈ 2020' వస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అభిమానుల కోలాహలం లేకుండా సాధాసీదాగా ఈ ఫోన్ ఆవిష్కరించారు.

మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేందుకు బడ్జెట్​ ఫోన్ల తయారీపై ఆపిల్ దృష్టి పెట్టింది. ఇందుకోసం మూడేళ్ల క్రితం ఐఫోన్​ ఎస్​ ఈని విడుదల చేసింది. చిన్న సైజులో ఉన్న ఈ ఫోన్​ ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందింది. ప్రస్తుతం విడుదల చేసిన ఎస్​ఈ-2020లోనూ అధునాతన ఫీచర్లను ఆపిల్ జోడించింది.

ఆపిల్ ప్రధాన మోడల్ ఫోన్ల ధరలతో పోలిస్తే సగానికంటే తక్కువకే ఎస్ఈ2020 ఫోన్ లభిస్తుంది. 40కి పైగా దేశాల్లో శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. 

తొలి తరం ఐఫోన్ ఎస్ఈ కంటే దీని డిస్ ప్లే పరిమాణం ఎక్కువ. కొత్త ఫోన్ల డిస్ ప్లేలతో పోలిస్తే చిన్నదే. అయినా హై డెఫినిషన్ గ్రాఫిక్స్ అనుభూతిని అందిస్తుంది. వ్యయం తగ్గించుకోవడానికి ఫేస్ రికగ్నేసన్ వంటి కొన్ని హై ఎండ్ ప్రత్యేకతల్లేకుండానే ఈ ఫోన్‌ను విపణిలోకి తీసుకొచ్చినట్లు తెలిపింది.

also read  ఇండియాలో ఎక్కువగా అలాంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.. అవేంటో మీకు తెలుసా‌...?

ఈ ఫోన్ 64జీబీ, 128జీబీ, 256జీబీ స్టోరేజీ వేరియంట్ల రూపంలో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. నలుపు, ఎరుపు, తెలుపు రంగుల్లోనూ లభించనుంది. అయితే ఐఫోన్​ ఎక్స్ తో టచ్ ​ఐడీకి ముగింపు పలికిన ఆపిల్​.. మళ్లీ ఎస్​ఈలో ఈ సౌకర్యాన్ని కల్పించింది.

ఇందులో ఐఫోన్​ 11, 11 ప్రో, 11ప్రో మ్యాక్స్​లో వాడిన అధునాతన ఏ13 బయోనిక్ చిప్​ను ఎస్ఈ2020 మోడల్ ఫోన్‌లో ఆపిల్ అమర్చింది. అంతేకాకుండా ఐపీ67 గుర్తింపు ఉన్న వాటర్​, డస్ట్ రెసిస్టెంట్​ సదుపాయం కల్పించింది.

4.7 అంగుళాల​ ఎల్​సీడీ తెర ఈ ఫోన్ 3 జీబీ ర్యామ్ సామర్థ్యంతో బ్యాక్  కెమెరా 12 ఎంపీ (5x జూమ్​, 6 పొట్రెయిట్ మోడ్స్​​, అడ్వాన్స్​డ్ బొకె, డెప్త్​ కంట్రోల్ ఫీచర్లు)తోపాటు 4కే వీడియో సపోర్ట్, ఫ్రంట్ కెమెరా 7 ఎంపీ సామర్థ్యం కలిగి ఉంటుంది. అలాగే బ్లూటూత్ 5.0 వసతి కూడా ఉంది. 

ఈ ఫోన్ ప్రారంభ ధర అమెరికాలో 399 డాలర్లుగా ఉంది. అయితే భారత్​లో ఈ ఫోన్​ ఎప్పటి నుంచి లభిస్తుందనే సమాచారాన్ని ఆపిల్ వెల్లడించలేదు. అధికారిక సమాచారం ప్రకారం భారత్​లో ప్రాథమిక వేరియంట్ ధర రూ.42,500 నుంచి ప్రారంభం అవుతుందని ఆపిల్ తెలిపింది​.