హువాయ్ P30 ప్రో రాక: ఇక స్మార్ట్‌ఫోన్ల ‘చీకటి’ యుద్ధమే!
హువాయ్ P30 ప్రో మార్కెట్లోకి రావడంతో నైట్ మోడ్ కెమెరా ఫోన్ల మధ్య పోటీ మరింత ఎక్కువైంది. నైట్ మోడ్‌లో మంచి ఫొటోలు కూడా తీయగలగడం దీని ప్రత్యేకత. చీకట్లో కూడా హువాయ్ P30 ప్రో చీకట్లో ఎలా పనిచేస్తుందనే దానిపై విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్లకు అతిపెద్ద మార్కెట్‌గా రూపుదిద్దుకుంటున్న మనదేశంలో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను భారీ స్థాయిలో మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. పోటీ బాగా ఉండటంతో సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కసరత్తులు చేస్తున్నాయి.
ముఖ్యంగా మంచి కెమెరా గల స్మార్ట్‌ఫోన్లకు బాగా గిరాకీ ఉండటంతో తయారీ సంస్థలన్నీ ఆ విషయంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. సరికొత్త ఫీచర్లను అందిస్తూనే కెమెరా క్లారిటీని పెంచుతున్నాయి. అంతేగాక, మొబైల్‌కు ఉండే కెమెరాల సంఖ్యను కూడా పెంచేస్తున్నాయి. అమేరాస్, 2,3,4 లెన్సెస్, రివర్సిబుల్ కెమెరా లాంటి కాన్సెప్టులతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
గత కొంత కాలంగా ఈ పోటీ కొనసాగుతున్నప్పటికీ హువాయ్ P30 ప్రో మార్కెట్లోకి రావడంతో మరింత ఎక్కువైంది. నైట్ మోడ్‌లో మంచి ఫొటోలు కూడా తీయగలగడం దీని ప్రత్యేకత. చీకట్లో కూడా హువాయ్ P30 ప్రో చీకట్లో ఎలా పనిచేస్తుందనే దానిపై విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హువాయ్ నైట్ మోడీ బాగా పనిచేస్తోందని సమాచారం ఉన్నప్పటికీ త్వరలో రానున్న పూర్తి రివ్యూ కోసం వేచిచూడాలి. కాంతి లేని సమయంలో ఫొటోలు తీయగలిగే కెమెరాలు ఉండటంతో ఈ ఫోన్‌పై వినియోగదారులు కూడా ఆసక్తిచూపుతున్నారు.
పోటీలో ఇతర ఫోన్లు..
కాగా, లో-లైట్(కాంతి తక్కువ ఉన్నసమయంలో) ఫొటోగ్రఫీ కోసం నైట్ సైట్ పేరుతో గూగుల్ మొదట ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. నవంబర్ 2018న నైట్‌సైడ్ మోడ్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్స్ తొలిసారిగా అందుబాటులోకి వచ్చాయి. మార్చిలో ఈ నైట్ సైడ్ మోడ్ కెమెరాతో తన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను పెంచుకుంది గూగుల్. గూగుల్ కెమెరా యాప్ ఏపీకే ఫైల్ ద్వారా.. వన్‌ప్లస్ 6టి లాంటి పలు మొబైల్స్ కూడా నైట్ సైట్ మోడ్ అందిస్తున్నాయి. శామ్సంగ్ గెలాక్సీ ఎస్10 కూడా బ్రైట్ నైట్ ఫీచర్‌తో మార్కెట్లోకి ప్రవేశించింది.
2019 లో లైట్ ఫొటోగ్రఫీ ఇయర్..
ఇటీవల కాలంలో మార్కెట్లోకి వచ్చే దాదాపు ప్రతి స్మార్ట్ ఫోన్ కూడా కెమెరా ఫీచర్ అప్‌డేట్ చేసుకుని వస్తున్నాయి. వన్‌ప్లస్ కూడా త్వరలో నైట్ మోడ్ ఫీచర్‌తో మరో మూడు స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఒప్పో, వీవో లాంటి సంస్థలు కూడా తమ ఫోన్లలో కెమెరా ఫీచర్లకు సరికొత్త హంగులు దిద్దుతూ మార్కెట్లోకి తెస్తున్నాయి.
మిడ్ రేంజ్ తోపాటు బడ్జెట్ ఫోన్లలో కూడా కెమెరా ఫీచర్‌కు ప్రాధాన్యత ఎక్కువైంది. 48మెగా పిక్సెల్ కెమెరాలతో మార్కెట్లోకి చాలా ఫోన్లు వస్తున్నాయి.. అయితే కాంతి తక్కువ ఉన్న సమయంలో కూడా ఫొటోలను క్లారిటీగా తీసే స్మార్ట్ ఫోన్లకే వినియోగదారులు ఓటేస్తున్నారు. ఐఫోన్ సంస్థ కూడా ఈ ఏడాదిలో లో-లైట్ ఫొటోగ్రఫీ ఫీచర్‌తో మొబైల్ ఫోన్లను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇలా ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలన్నీ కూడా నైట్ మోడ్ ఫొటోగ్రఫీతో వస్తుండటం గమనార్హం.