పంచి బేస్, కొత్త డిజైన్ తో సోనీ వైర్‌లెస్ స్పీకర్ విడుదల..

 ఈ సంవత్సరం ఎస్‌ఆర్‌ఎస్ -ఎక్స్‌బి23, ఎస్‌ఆర్‌ఎస్-ఎక్స్‌బి33, ఎస్‌ఆర్‌ఎస్-ఎక్స్‌బి43 అనే మూడు కొత్త మోడళ్లు స్పీకర్లను సోనీ  లాంచ్ చేసింది. ఇవి అతి తక్కువ ధరకే పూర్తిగా కొత్త డిజైన్ తో వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లు  ప్రీఆర్డర్ కోసం ఈ రోజు నుండి  అందుబాటులో ఉన్నాయి. 

Sony launches 3 new Bluetooth speakers line gets a welcome refresh

ప్రతి సంవత్సరం సోనీ తప్పకుండా ఒక కొత్త పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లను విడుదల చేస్తుంది. కానీ ఈ సంవత్సరం ఎస్‌ఆర్‌ఎస్ -ఎక్స్‌బి23, ఎస్‌ఆర్‌ఎస్-ఎక్స్‌బి33, ఎస్‌ఆర్‌ఎస్-ఎక్స్‌బి43 అనే మూడు కొత్త మోడళ్లు స్పీకర్లను లాంచ్ చేసింది.

ఇవి అతి తక్కువ ధరకే పూర్తిగా కొత్త డిజైన్ తో వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లు  ప్రీఆర్డర్ కోసం ఈ రోజు నుండి  అందుబాటులో ఉన్నాయి తరువాత రాబోయే కొద్ది వారాల్లో డెలివరీ చేయనున్నారు. మల్టీ  కలర్ ఆప్షన్స్ లో ఇవి లభిస్తున్నాయి,

అంతేకాదు ఇవి ఐ‌పి67 వాటర్‌ప్రూఫ్ అలాగే డస్ట్‌ప్రూఫ్, రస్ట్‌ప్రూఫ్ అంతకుముందు లాంచ్ చేసిన సోనీ బ్లూటూత్ స్పీకర్ల ఇంటిగ్రేటెడ్ "పార్టీ" లైటింగ్‌ను కూడా ఉంది. ఐ‌ఓ‌ఎస్, ఆండ్రయిడ్ స్మార్ట్ ఫోన్స్ లో సోనీ ఫెస్టబుల్ యాప్ ద్వారా వీటిని కంట్రోల్ చేయవచ్చు.

సోనీ ఈ సారి కొత్తగా అభివృద్ధి చేసిన ఎక్స్-బ్యాలెన్స్డ్ స్పీకర్ యూనిట్ నాన్ సర్కిలర్ ఆకారంలో తీసుకొస్తుంది. ఇది స్పీకర్ డయాఫ్రాగమ్ పెంచుతుంది, పంచీ బేస్  కోసం సౌండ్ పెంచుతుంది. ఫుల్ వాల్యూమ్ లో కూడా నాయిస్ తగ్గిస్తుంది.

ఎక్స్‌బి33 స్ప్పికార్ లో  సౌండ్ రేంజ్ 30% పెరిగిందని ఇంకా ఇందులో నాయిస్ రేటు 25% తగ్గిందని కంపెనీ పేర్కొంది. యు.కే, ఆస్ట్రేలియన్ దేశాలలో వీటి ధరలను ప్రకటించలేదు. ఈ స్పీకర్లు చైర్ కప్ హోల్డర్‌లో సరిపోయేలా కొత్త డిజైన్‌తో సోనీ పోర్టబుల్ స్పీకర్‌ను తయారు చేసింది. మెరుగైన బేస్, బ్యాటరీ లైఫ్ కూడా  అందిస్తుంది.


ఎస్‌ఆర్‌ఎస్ -ఎక్స్‌బి23 ఐదు వేర్వేరు కలర్ ఆప్షన్స్ బ్లాక్ , తౌప్, కోరల్ రెడ్, లైట్ బ్లూ, ఆలివ్ గ్రీన్ లభిస్తుంది. 12 గంటల బ్యాటరీ లైఫ్, మోడరేట్  వాల్యూమ్ లెవెల్స్ అందిస్తుంది. ఇది ఐ‌పి67 రేటింగ్‌తో వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్, రస్ట్‌ప్రూఫ్, షాక్‌ప్రూఫ్ కూడా. ఇది యూ‌ఎస్‌బి-సి టైప్ ఛార్జింగ్, సోనీ పార్టీ కనెక్ట్ ఫీచర్‌ను ఉపయోగించి 100 ఇతర సోనీ స్పీకర్లతో కనెక్ట్ చేయగలదు.

also read టెలికాం సంస్థలకు ట్రాయ్ షాక్: ఆ ప్లాన్లు వెంటనే నిలిపేయండి.. ...

ఎస్‌ఆర్‌ఎస్-ఎక్స్‌బి33 బ్లాక్, తౌప్, రెడ్  బ్లూ అనే నాలుగు వేర్వేరు కలర్ ఆప్షన్స్ లో వస్తుంది. రెండు కొత్త ఫుల్ రేంజ్ డ్రైవర్లు, రెండు కొత్త సైడ్-ఫైరింగ్  బేస్ రేడియేటర్,  మోడరేట్  వాల్యూమ్ లెవెల్స్ , 24 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.  ఐ‌పి67 రేటింగ్‌తో వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్, రస్ట్‌ప్రూఫ్, షాక్‌ప్రూఫ్. దీనికి యుఎస్‌బి-సి ఛార్జింగ్, సోనీ పార్టీ కనెక్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది ప్రోగ్రామబుల్ లైన్, స్పీకర్ లైట్లు, డివైజ్ ఛార్జింగ్ చేయడానికి యూ‌ఎస్‌బి- అవుట్ పోర్టు కలిగి ఉంది.

ఎస్‌ఆర్‌ఎస్-ఎక్స్‌బి43 బ్లాక్, తౌప్, బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. పంచీ బేస్ కోసం కొత్తగా రూపొందించిన డ్రైవర్లు దీనికి ఉనాయి, అలాగే మంచి క్లారీటి కోసం కొత్తగా జోడించిన ట్వీటర్. మోడరేట్  వాల్యూమ్ లెవెల్స్, 24 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. ఇది ఐ‌పి67 రేటింగ్‌తో వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్, రస్ట్‌ప్రూఫ్ కాకపోతే ఇతర రెండు స్పీకర్ల మాదిరిగా షాక్‌ప్రూఫ్ కాదు. దీనికి  కూడా యూ‌ఎస్‌బి-సి ఛార్జింగ్, పార్టీ కనెక్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రోగ్రామబుల్ లైన్, స్పీకర్, ట్వీటర్ లైట్లు, ఛార్జింగ్ డివైజ్ కోసం యూ‌ఎస్‌బి - అవుట్ పోర్టు ఉంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios