మీరు మంచి గేమర్ లేదా  ఆడియో సొంగ్స్ వినే వారు అయితే, చైనాకు చెందిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ హవిట్ తన మొదటి వైర్‌లెస్ హెడ్‌సెట్ హవిట్ ఐ 37 ను భారతదేశంలో రూ. 1,299 లాంచ్ చేసింది. ఈ ఇయర్‌ఫోన్స్‌  12 గంటల బ్యాటరీ లైఫ్‌ ఇస్తుంది. ప్రస్తుతం ఈ కొత్త  వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లో అమ్మకానికి ఉంది.


హవిట్ ఐ37 ఇయర్‌ఫోన్స్‌ టెక్నికల్ ఫీచర్ల గురించి చెప్పాలంటే వైర్‌లెస్ హెడ్‌సెట్‌లో డైనమిక్ స్పీకర్లు, బ్లూటూత్ 5.0 కాంపటిబిలిటీ ఇంకా ఇయర్‌పీస్‌లను కలిపే కేబుల్ ఉంది. దీనికి తోడు హవిట్  i37 హెడ్‌సెట్ ఇంటర్నల్ రిమోట్‌తో పొందుపరిచారు. ఇది వినియోగదారుని స్మార్ట్ ఫోన్ కి వచ్చే కాల్స్ మాట్లాడుకోవటానికి అలాగే మ్యూజిక్ వినటానికి, సాంగ్స్  స్కిప్ లేదా పాజ్ చేయటానికి, వాల్యూమ్‌ను కంట్రోల్  చేయటానికి ఉపయోగపడుతుంది.

also read  టి.వి కొంటే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌10 స్మార్ట్‌ఫోన్‌ ఉచితం...

మీరు రిమోట్‌ను ఉపయోగించకూడదనుకుంటే, హవిట్ ఐ37 వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు గూగుల్‌తో పాటు ఆపిల్ సిరితో వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో కూడా పనిచేస్తుంది. ఇది వాయిస్ కమాండ్ల ద్వారా డివైజ్/ స్మార్ట్ ఫోన్ కంట్రోల్ చేయటానికి సహకరిస్తుంది. "హవిట్ ఐ37 అనేది వైర్‌లెస్ హెడ్‌సెట్ ఇది అద్భుతమైన ఆడియో సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. ఆకట్టుకునే ఫీచర్లతో స్మార్ట్ ఇంకా స్టైలిష్ లుక్‌ని ఇస్తుంది" అని కంపెనీ పేర్కొంది.

హవిట్ ఐ37 నెక్‌బ్యాండ్ టెక్ ప్రేమికుల కోసం సౌఖర్యంగా ఉండేలా రూపొందించారు. మీరు రన్నింగ్, సైక్లింగ్, వ్యాయామం వంటివి చేసేటప్పుడు కూడా హెడ్‌సెట్ దీనిని హ్యాపీగా వాడుకోవచ్చు. ఇది మాత్రమే కాదు ఏదైనా తయారీ లోపాలకు వ్యతిరేకంగా నెక్‌బ్యాండ్ ఒక సంవత్సరపు వారంటీ ఇస్తుంది.


ఇయర్‌ఫోన్స్‌  నలుపు, తెలుపు ఇంకా ఎరుపు రంగులలో లభిస్తుంది. తేలికపాటి బరువుతో హవిట్ ఐ 37 ఇయర్‌ఫోన్‌లు మాగ్నెటిక్ ఇయర్‌బడ్స్‌తో వస్తాయి. కంపెనీ ప్రకారం " ఇందులో ఉన్న మ్యాగ్నెట్ ప్యానెల్లు  ఇయర్ బడ్స్ ఉపయోగంలో  లేనప్పుడు కలిసి లాక్ అవుతాయి."

also read సమస్యలలో చిక్కుకున్న టెలికం రంగం...

హవిట్ ఐ37లో లి-అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది వినియోగదారులకు 10 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 12 గంటల బ్యాక్ అప్ టైమ్ టాక్ ఇంకా 180 గంటల స్టాండ్బై ఇస్తుంది. అమెజాన్ ఇండియా వంటి అన్ని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై 1,590 రూపాయలకు టెక్ ఫ్రీక్‌ల కోసం బడ్జెట్ అనుకూలమైన “విజన్” గేమింగ్ హెడ్‌ఫోన్‌లను కూడా అడ్కామ్ ఇండియా విడుదల చేసింది. అయితే ఆఫ్‌లైన్ రిటైల్ ధర రూ .1,790.

అడ్కామ్ విజన్ గేమింగ్ హెడ్‌సెట్ ఎల్‌ఈ‌డి హెడ్‌సెట్ కొనుగోలు చేసిన తేదీ నుండి ఒక సంవత్సర పాటు వారంటీని కూడా ఉంది. దీని బరువు 322 గ్రాములు, 7 అడుగుల పొడవైన OTG కనెక్టింగ్ కేబుల్‌తో వస్తుంది. ఇది పి.సి, ల్యాప్‌టాప్, టాబ్లెట్, మొబైల్ ఫోన్లు లేదా ప్లేస్టేషన్, ఎక్స్-బాక్స్, నింటెండో వంటి గేమింగ్ బాక్స్‌కు సులభంగా కనెక్ట్ అవుతుంది.