గెలాక్సీ ఎ శ్రేణిలో 6వ స్మార్ట్‌ఫోన్‌గా గెలాక్సీ ఎ70ని శామ్సంగ్ ఇండియా ప్రకటించింది. 32ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరాతోపాటు భారీ ఫీచర్లతో ఈ ఫోన్ భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. సూపర్ స్లో-మో వీడియోస్ కూడా ఈ ఫోన్ తీయగలదు. 

గెలాక్సీ ఎ70 4500ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు 25డబ్ల్యూ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగివుంది. వినియోగదారులు ఫోన్ చెల్లింపులకు ఉపయోగపడే శామ్సంగ్ పే వ్యాలెట్‌ను గెలాక్సీ ఎ70 కలిగివుంది. 

గెలాక్సీ ఎ70.. 32ఎంపీ ట్రిపుల్ కెమెరా సాయంతో సూపర్ స్లో-మో, అల్ట్రా వైడ్ వీడియోలను కూడా తీయగలదు. 32ఎంపీ లో లైట్ లెన్స్, ఎఫ్/1.7 జెన్ జడ్ కలిగివుంది. లైటింగ్ ఎలావున్నా మంచి ఫొటోలను తీయగల సామర్థ్యం ఈ ఫోన్‌కు ఉంది.  8ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ 123 డిగ్రీలో ఫొటోలను తీస్తుంది. 5ఎంపీ డెప్త్ లెన్స్ పొర్ట్‌రేట్ షాట్స్ తీయడంలో ఉపయోగపడుతుంది. డెప్త్ అడ్జెట్ చేయడంలో కూడా సాయపడుతుంది.

కలర్, కాంట్రాస్ట్, బ్రైట్నెస్, ఇమేజ్ క్వాలిటీలను ఈ ఫోన్లోని శామ్సం్ ఇంటెలీజెంట్ సీన్ ఆప్టిమైజర్ 20మోడ్స్‌లో సరి చేస్తుంది.  ఇక 32ఎంపీ ఫ్రంట్ కెమెరా మంచి క్వాలిటీ సెల్ఫీలు తీసుకునేందుకు వీలుగా ఉంది. ఏఆర్-ఎమోజీ, సెల్ఫీ ఫోకస్ ఫీచర్లను కలిగివుంది.

గెలాక్సీ ఎ70 6.7ఇంచ్ ఎఫ్‌హెచ్‌డీ+ఇన్ఫినిటీ-యూ డిస్‌ప్లే, స్ట్రీమింగ్ ట్రూ హెచ్‌డీ కంటెంట్ కోసం వైడ్‌వైన్ ఎల్1 సెర్టిఫికేషన్ ఉంది. శామ్సంగ్ ప్రొప్రైటరీ అయిన సూపర్ అమోల్డ్ టెక్నాలజీ డిస్‌ప్లే లైవ్‌గా ఉంచుతుంది. వివిడ్, క్రిస్పీ వీడియోలను అనుమతిస్తుంది. 360 డిగ్రీ సరౌండ్ సౌండ్ అనుభవం కోసం గెలాక్సీ ఎ70కి డోల్బీ ఆట్మోస్ ఫీచర్  కూడా ఉంది.

శామ్సంగ్ పే.. మిలిటరీ గ్రేడ్ సెక్యూరిటీ నాక్స్‌తో వినియోగదారుల వ్యాలెట్లకు భద్రత కల్పిస్తోంది. మంచి కెమెరా, డిస్‌ప్లే, శామ్సంగ్ పే లాంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది గెలాక్సీ ఎ70. ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్ ఉండటంతో డిమాండ్ టాస్కులను కూడా ఈజీగా చేసుకోవచ్చు. 6జీబీ ర్యామ్ ఉండటంతో మల్టిటాస్కింగ్ కార్యకలాపాలను కూడా సులువవుతాయి. శామ్సంగ్ వన్ యూఐ ఇంటర్ఫెస్ ఆండ్రాయిడ్-పై తో ఈ ఫోన్ సౌకర్యంగా ఉంటుంది. 

ఇక బ్యాటరీ సామర్థ్యం 4500ఎంఎహెచ్ కలిగివుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే రెండురోజులపాటు వాడుకోవచ్చు. 25డబ్ల్యూ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉండటంతో వేగవంతంగా చార్జింగ్ అవుతుంది. 

గెలాక్సీ ఎ70 ధర రూ. 28,990. ఏప్రిల్ 20, ఏప్రిల్ 30 మధ్య కాలంలో ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. బ్లూ, బ్లాక్, వైట్ కలర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అన్ని రిటైల్ స్టోర్లలోనూ, శామ్సంగ్ ఈ షాప్, శామ్సంగ్ ఒపెరా హౌస్‌లలో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. గెలాక్సీ ఎ70 ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది.