Asianet News TeluguAsianet News Telugu

స్మార్ట్ యాప్‌లతో ట్రీవ్యూ ఎల్‌ఈడీ టీవీలు.. తక్కువ ధరకే..

థాయిలాండ్‌కు చెందిన ఎల్‌ఈడీ టీవీ, అప్లియేన్సెస్ తయారీ సంస్థ ట్రీవ్యూ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్‌డీ టీవీ మోడళ్లతో భారత్‌లోకి ప్రవేశిస్తోంది. భారతదేశం, మిడిల్ ఈస్ట్, యూరోపియన్, యు.ఎస్, ఆఫ్రికన్ దేశాలలో తమ ఉత్పత్తులను పరిచయం చేయడానికి క్యూట్రీ వెంచర్స్ తో కంపెనీ భాగస్వామ్యం చేసుకుంది. 

Thailand based electronics company Treeview to introduce TVs in India
Author
Hyderabad, First Published Sep 24, 2020, 10:50 AM IST

గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్లకు మార్కెటింగ్, లాజిస్టిక్స్ మరియు సేవల సహకారాన్ని పూర్తిస్థాయిలో అందిస్తున్న క్యూట్రీ వెంచర్స్ దక్షిణ భారతదేశంలో టి‌విల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. 

క్యూట్రీ వెంచర్స్ వ్యవస్థాపకుడు & సిఇఒ జుబిన్ పీటర్ మాట్లాడుతూ “మేము గత 10 సంవత్సరాలుగా గుజరాత్‌లో టివిలను ఉత్పత్తి  చేస్తున్నాము. ప్రస్తుతం సంవత్సరానికి  5 లక్షల ఇటిడి టివి యూనిట్లను తయారు చేస్తున్నాము, తయారీ సామర్థ్యం విస్తరణ రెండవ దశలో భాగంగా మేము దక్షిణ భారతదేశంలో కొత్త యూనిట్‌ను  ఏర్పాటు చేయాలని చూస్తున్నాము.

మేము దక్షిణాన ఒక యూనిట్ ఏర్పాటు చేయడానికి ప్రాథమిక చర్చలలో ఉన్నాము. తెలంగాణ లేదా ఎపిలో 25 లక్షల ఎల్‌ఈడీ టీవీలు, 6 లక్షల ఎయిర్ కండీషనర్‌లను తయారు చేయగల సామర్థ్యంతో సుమారు 250 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాము ” అని అన్నారు.

also read డ్యూయల్ రియర్ కెమెరాలతో మోటో ఇ7 ప్లస్ లాంచ్.. ధర ఎంతంటే ? ...

ట్రీవ్యూ ఒప్పందం

థాయిలాండ్‌కు చెందిన ఎల్‌ఈడీ టీవీ, అప్లియేన్సెస్ తయారీ సంస్థ ట్రీవ్యూ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్‌డీ టీవీ మోడళ్లతో భారత్‌లోకి ప్రవేశిస్తోంది. భారతదేశం, మిడిల్ ఈస్ట్, యూరోపియన్, యు.ఎస్, ఆఫ్రికన్ దేశాలలో తమ ఉత్పత్తులను పరిచయం చేయడానికి క్యూట్రీ వెంచర్స్ తో కంపెనీ భాగస్వామ్యం చేసుకుంది. 

ట్రీవ్యూ టీవీ యూనిట్లు భారతదేశం అంతటా ఎలక్ట్రానిక్స్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ భారతదేశంలో ట్రీవ్యూకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్య్వవహరించనున్నారు. 32 అంగుళాల నుండి 65 అంగుళాల టీవీలను స్మార్ట్ యాప్‌లతో (ఫేస్‌బుక్, యూట్యూబ్ కాస్ట్, ఈషేర్, మిరాకాస్ట్ మొదలైనవి) కంపెనీ పరిచయం చేయనుంది.

థాయ్‌లాండ్ సంస్థ ట్రీవ్యూ 32 అంగుళాల స్మార్ట్ టీవీలను రూ .11,990కు, 4కె 65 అంగుళాల స్మార్ట్ టీవీల ధర రూ .45,990 గా నిర్ణయించింది. నాన్-స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ  24 అంగుళాలకు ధర రూ .6,990, 32 అంగుళాలకు రూ .8,990 అందించనున్నారు. 

 భారతదేశంలో మొదటిసారి 100 అంగుళాల నుండి 300 అంగుళాల లేజర్ టీవీలను విడుదల చేయనున్నారు. "హోటళ్ళు మరియు రెస్టారెంట్లు వంటి వ్యాపారాల కోసం మేము బడ్జెట్ టీవీలను కూడా తయారు చేస్తాము" అని పీటర్ సమాచారం.
 

Follow Us:
Download App:
  • android
  • ios