రిలయన్స్ జియోమార్ట్ సెన్సెషన్.. రోజుకు 2 లక్షలకు పైగా ఆర్డర్లు..

రిలయన్స్ రిటైల్ బీటా ఆన్‌లైన్ కన్స్యూమర్ గ్రోసారి ప్లాట్ ఫామ్ జియోమార్ట్ యాప్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లో ప్రవేశించింది. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే జియోమార్ట్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో 10 లక్షల డౌన్‌లోడ్ మార్కును దాటింది. 

reliance jiomart app debuts on google android play store and ios app store

కొత్తగా ఈ కామర్స్ రంగంలోకి ప్రవేశించిన జియోమార్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా ఆర్డర్‌లను అందుకుంటుంది, ఈ ఆర్డర్ల సంఖ్య కూడా చాలా వేగంగా పెరుగుతోంది.  రిలయన్స్ రిటైల్ బీటా ఆన్‌లైన్ కన్స్యూమర్ గ్రోసారి ప్లాట్ ఫామ్ జియోమార్ట్ యాప్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లో ప్రవేశించింది.

ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే జియోమార్ట్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో 10 లక్షల డౌన్‌లోడ్ మార్కును దాటింది. ‘షాపింగ్’ విభాగంలో టాప్ 3 యాప్‌లలో ఒకటిగా నిలిచింది. యాప్ బెసేడ్ ఇంటర్‌ఫేస్ అక్సెస్ ద్వారా ఆండ్రోయిడ్, ఐ‌ఓ‌ఎస్ డివైజెస్ లో అందుబాటులో ఉన్న జియోమార్ట్ యాప్ తో సులభంగా ఆర్డర్‌లను చేయవచ్చు.

వేర్వేరు డివైజెస్ లో యాప్, వెబ్ పోర్టల్ రెండింటినీ ఉపయోగించే యూసర్లు తమ లాగిన్ ఐడితో అక్సెస్ కావొచ్చు. వారి పాత ఆర్డర్‌లు, కార్ట్ లో యాడ్ చేసుకున్నవి కూడా చూసుకోవచ్చు. బీటా ప్లాట్‌ఫాం జియోమార్ట్.కామ్‌ను దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో మార్చి చివరిలో ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా జియోమార్ట్ ప్లాట్‌ఫాం విస్తృతమైన ఆన్‌లైన్ ఆర్డరింగ్ సేవను టైర్ II, టైర్ III పట్టణాలకు తీసుకురావడం ద్వారా అవసరమైన వాటి కోసం డిజిటల్ షాపింగ్‌ను అందిస్తుంది, వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్, గ్రోసరీస్, పండ్లు, కూరగాయలు, అవసరమైన వస్తువుల హోం డెలివరీని కూడా పొందుతున్నారు.

జియోమార్ట్ ప్రతిరోజూ కొత్త ఉత్పత్తులు, కొత్త ఫీచర్లు, బ్రాండ్లు, రకరకాల ఉత్పత్తులను నిరంతరం జతచేస్తూ, ప్రతిసారీ షాపింగ్ చేసేటప్పుడు యూసర్లు సరికొత్త అనుభవాన్ని, గూప్ప ఆప్షన్లను  అందిస్తుంది. ఉత్పత్తులలో ఇప్పుడు పర్సనల్ కేర్ ఉత్పత్తులు, ఇంటి, వంటగది కేర్  ఉత్పత్తులు, పూజా సామగ్రి, షూ కేర్, బేబీ కేర్ ఉత్పత్తులు, బ్రాండెడ్ ఫుడ్ మొదలైనవి ఉన్నాయి. జియోమార్ట్ లో అవసరమైన వాటిపై ఆకర్షణీయమైన ధరలతో కనీసం 5% డిస్కౌంట్ అందిస్తుంది.

also read అమెరికాతో సహా అనేక దేశాల నమ్మకాన్ని భారత్ సంపాదించింది: విదేశాంగ మంత్రి ...

అంతేకాకుండా, జియోమార్ట్ వినియోగదారులకు సౌకర్యవంతమైన పేమెంట్ ఆప్షన్స్ కూడా ప్రారంభించింది, సోడెక్సో ఫుడ్ కూపన్లను ప్రస్తుత పేమెంట్ ఆప్షన్స్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులు, రోన్ లాయల్టీ పాయింట్లు, క్యాష్ ఆన్ డెలివరీ మొదలైన వాటికి జోడించింది.

క్రెడిట్ కార్డ్, వాలెట్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తుంది . ఆర్‌ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ ఎజిఎం సందర్భంగా జియోమార్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 2.5 లక్షలకు పైగా ఆర్డర్‌లను అందుకుంటునట్లు సమాచారం ఇచ్చింది. జియోమార్ట్ విస్తరణ ప్రణాళిక గురించి వివరిస్తూ, “జియోమార్ట్ ఇప్పుడు దాని పరిధి, డెలివరీ సామర్థ్యాలను పెంచడం పై దృష్టి పెట్టింది.

జియోమార్ట్ వినియోగదారులకు సౌలభ్యంగా, ఉన్నతమైన షాపింగ్ అనుభవాన్ని అందించడంలో నిమగ్నమై ఉంది. కిరాణా సరుకులతో పాటు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఫార్మాస్యూటికల్, హెల్త్‌కేర్ ను కవర్ చేయడానికి మేము జియోమార్ట్‌ను విస్తరిస్తాము. రాబోయే సంవత్సరాల్లో, మేము మరిన్ని నగరాలను కవర్ చేస్తాము,  భారతదేశం అంతటా ఉన్న వినియోగదారులకు సేవలు అందిస్తాము. ” అని తెలిపింది.

ఏ‌జి‌ఎంలో జియోమార్ట్ ప్రకటనను తెలిపిన తరువాత, విశ్లేషకులు జియోమార్ట్ గురించి ఉత్సాహంగా ఉన్నారు, “ఫేస్‌బుక్‌తో ఆర్‌ఐ‌ఎల్ భాగస్వామ్యం వల్ల కంపెనీ ఆన్‌లైన్ గ్రోసరిలో 2024 నాటికి 50కి పైగా  శాతం వాటాతో మార్కెట్ లీడర్‌గా మారవచ్చు, . ”

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios