రెడ్ మీ 7 Vs రెడ్‌మీ వై3: పోలికలు, స్పెసిఫికేషన్స్

న్యూఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రెడ్‌మీ 7, రెడ్‌మీ వై3లను జియోమీ సంస్థ విడుదల చేసింది. బడ్జెట్ ధరలో మార్కెట్లోకి ప్రవేశించిన ఈ రెండు ఫోన్ల ఫీచర్లు కూడా అనేక సారూప్యతలను కలిగివున్నాయి. ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో రెడ్‌మీ 7, రెడ్‌మీ వై3లు వచ్చే వారం నుంచి అందుబాటులో ఉండనున్నాయి. 

Redmi 7 vs Redmi Y3: Comparison of Xiaomi's Brand New   Smartphones for India

న్యూఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రెడ్‌మీ 7, రెడ్‌మీ వై3లను జియోమీ సంస్థ విడుదల చేసింది. బడ్జెట్ ధరలో మార్కెట్లోకి ప్రవేశించిన ఈ రెండు ఫోన్ల ఫీచర్లు కూడా అనేక సారూప్యతలను కలిగివున్నాయి. ఇ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో రెడ్‌మీ 7, రెడ్‌మీ వై3లు వచ్చే వారం నుంచి అందుబాటులో ఉండనున్నాయి. 

ఈ నేపథ్యంలో ఈ రెండు ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరల గురించిన వివరాలను తెలుసుకుందాం.. 

ధర విషయానికొస్తే..:

రెడ్‌మీ 72జీబీ, 32 జీబీ వేరియెంట్ ధర్: రూ. 7,999
3జీబీ, 32జీబీ వేరియెంట్ ధర: రూ. 8,999

రెడ్‌మీ వై3 3జీబీ, 32జీబీ మోడల్ ధర: రూ. 9,999
4జీబీ, 64జీబీ వేరియెంట్ ధర: రూ. 11,999

కాగా, ఏప్రిల్ 29 నుంచి రెడ్‌మీ 7ను అమెజాన్, ఎం.కామ్, ఎంఐహోంస్టోర్లలో అందుబాటులో ఉంటాయి. అలాగే రెడ్‌మీ వై3 ఏప్రిల్ 30 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా అందుబాటులో ఉండనున్నాయి.

రెడ్‌మీ వై3 విడుదల ఆఫర్ల విషయానికొస్తే.. ఎయిర్‌టెల్ నుంచి 1,120జీబీ 4జీ డేటాను పొందవచ్చు. రెడ్‌మీ 7 ఆఫర్లలో జియో డబుల్ డేటా నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది. రూ. 2,400 క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. 

డిజైన్: 

ఈ రెండు ఫోన్లు కూడి డిజైన్ పరంగా దాదాపు ఒకేలా ఉంటాయి. రెడ్‌మీ 7 స్పోర్ట్స్ ఔరు స్మోక్ గ్రేడియంట్ ఫినిష్‌తో ఉంటే.. రెడ్‌మీ వై3 స్పోర్ట్స్ ఔరు ప్రిస్మ్ గ్రేడియంట్ ఫినిష్‌తో ఉంటుంది. అయితే, వీటి బ్లాక్ కలర్ వేరియంట్లు మాత్రం గ్రేడియంట్ ఫినిష్ కలిగిలేవు. ఈ రెండు ఫోన్లు బరువు, పరిమాణం ఒకేలా ఉన్నాయి.

స్పెసిఫికేషన్స్:

రెడ్‌మీ వై3, రెడ్‌మీ 7 రెండూ డ్యూయల్-సిమ్(నానో), మైక్రో ఎస్డీ కార్డ్

ఆండ్రాయిడ్‌ ఆధారంగా MIUI 10 నడుస్తాయి
ఈ రెండు ఫోన్లు కూడా 6.26 అంగుళాలు, హెచ్‌డీ+(720+1520పిక్సెల్స్) డిస్‌ప్లేలు కలిగిఉన్నాయి. 19.9 కారక నిష్పత్తి.
ఈ రెండు ఫోన్లు కూడా ఆక్టా కోర్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 632ఎస్ఓసీ కలిగి ఉన్నాయి.
రెడ్‌మీ 7 బేస్ మోడల్ 2జీబీది కాగా, వై3 మోడల్‌ది 3జీబీగా ఉంది.
రెడ్‌మీ 7.. 3జీబీ ర్యామ్ వేరియంట్ టాప్ మోడల్‌గా ఉండగా.. 
రెడ్‌మీ వై3 4జీబీ ర్యామ్ వేరియంట్ టాప్ మోడల్‌గా ఉంది.


బ్యాక్ కెమెరా:

రెడ్‌మీ 7: డ్యూయల్ కెమెరా సెటప్ 12ఎంపీ+2ఎంపీ
ఫ్రంట్ కెమెరా: 8ఎంపీ సెన్సార్
ఏఐ పొట్రెయిట్ మాత్రమే అందిస్తోంది..

రెడ్‌మీ వై3: 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా
 వై3 ఈఐఎస్, ఆటో హెచ్‌డీఆర్, ఫ్రంట్ కెమెరా ఏఐ పొట్రెయిట్ మోడ్, 

బ్యాటరీ: 

రెడ్‌మీ 7: 4000ఎంఏహెచ్
రెడ్‌మీ y3: 4000ఎంఏహెచ్

కనెక్టవిటీ ఆప్షన్స్: 
4జీ వోల్ట్, వైఫై 802.11బీ/జీ/ఎన్, బ్లూటూత్ వీ4.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో-యూఎస్‌బీ , 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్. ఈ రెండు ఫోన్లు కూడా  ఐఆర్ బ్లాస్టర్లు కలిగి ఉన్నాయి.
యాక్సలరోమీటర్, అంబియంట్ లైట్ సెన్సార్, డిజిటల్ కంపాస్, ప్రాక్సిమిటి సెన్సార్ కలిగి ఉన్నాయి.

 

చదవండి: నేటి నుంచే హువాయ్ పీ30 లైట్ అమ్మకాలు: ధర, ప్రత్యేక ఫీచర్లు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios