ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ క్యూ సిరీస్‌లో  కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు మీడియా నివేదికలో తెలిపింది.  రియల్‌మీ క్యూ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ 5జి హ్యాండ్‌సెట్‌, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 65W ఫాస్ట్ ఛార్జింగ్ తో ఓ‌ఎల్‌ఈ‌డి డిస్‌ప్లేతో ఉంటుందని నివేదికలో పేర్కొంది.

కంపెనీ ఎగ్జిక్యూటివ్ గత వారం పేర్కొన్నట్లు ఈ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ యు.ఐ 2.0 తో రావచ్చని ఊహిస్తున్నారు. రియల్‌మీ క్యూ సిరీస్‌ కొత్త ఫోన్ అక్టోబర్ 13 న ప్రారంభమవుతుందని నివేదించింది. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ గురించి ఎలాంటి అధికారిక సమాచారం ప్రకటించలేదు.

కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇప్పటికే అక్టోబర్‌లో స్మార్ట్‌ఫోన్ లాంచ్ గురించి సూచించారు. గత వారం రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్ జు క్వి చేజ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. మోడల్ నంబర్లు RMX2117, RMX2173 కలిగిన రెండు స్మార్ట్‌ఫోన్‌లు రియల్‌మీ క్యూ సిరీస్, రియల్‌మీ ఎక్స్ సిరీస్‌కు చెందినవిగా ఆరోపించారు.

also read ఇన్‌స్టాగ్రామ్‌లాగానే లింక్డ్ఇన్ లో అదిరిపోయే లేటెస్ట్ ఫీచర్లు.. ...

మోడల్ నంబర్ RMX2117 ఉన్న ఫోన్ రియల్‌మీ క్యూ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌గా ప్రవేశిస్తుందని పేర్కొన్నారు. ఏదేమైనా RMX2173 రియల్‌మీ క్యూ సిరస్ ఫోన్‌ ప్రారంభించవచ్చని నివేదిక పేర్కొంది.

రియల్‌మీ క్యూ - సిరీస్ ఫోన్ ఫీచర్స్
రియల్‌మీ క్యూ సిరీస్ ఫోన్‌  హోల్-పంచ్ కటౌట్, 6.43-అంగుళాల పూర్తి-హెచ్‌డి + ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి డిస్‌ప్లే ఉంటుంది. ఈ ఫోన్‌లో అండర్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్,  6జి‌బి వరకు ర్యామ్, 2.4GHz ఆక్టా-కోర్, 256జి‌బి స్టోరేజ్ సపోర్ట్ ఉంది.

ఫోటోగ్రఫీ కోసం రియల్‌మీ క్యూ సిరీస్ ఫోన్ 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ కెమెరా, క్వాడ్ కెమెరా సెటప్‌తో రెండు 2 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్లతో వస్తుందని చెబుతున్నారు. ముందు వైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో, ఫోన్‌లో 65W ఫాస్ట్ ఛార్జింగ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ అందించనున్నారు.