OPPO K10 Review: సాలిడ్ ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకొచ్చిన ఒప్పో కె 10 స్మార్ట్ ఫోన్, ధర, ఫీచర్లు ఇవే...
ఇండియాలో రూ.15,000 లోపు బడ్జెట్‌లోని స్మార్ట్‌ఫోన్లకు (Smartphone Under Rs 15,000) డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కొత్త మోడల్స్‌ని రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా రూ.15,000 లోపు సెగ్మెంట్‌లో ఒప్పో ఇండియా నుంచి ఒప్పో కే10 (Oppo K10) మొబైల్ రిలీజైంది. దీని ఫీచర్లు ఏంటో తెలసుకుందాం.
ఇండియాలో రూ.15,000 లోపు బడ్జెట్‌లోని స్మార్ట్‌ఫోన్లకు (Smartphone Under Rs 15,000) డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కొత్త మోడల్స్‌ని రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా రూ.15,000 లోపు సెగ్మెంట్‌లో ఒప్పో ఇండియా నుంచి ఒప్పో కే10 (Oppo K10) మొబైల్ రిలీజైంది. ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే ఇందులో ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50మెగాపిక్సెల్ కెమెరా సెటప్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇటీవల ఈ ప్రాసెసర్‌తో పలు స్మార్ట్‌ఫోన్స్ ఇండియాలో రిలీజ్ అయ్యాయి. ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,990 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,990. మార్చి 29న సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.12,990 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.14,990 ధరకు సొంతం చేసుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ ఒక ఏడాది సబ్‌స్క్రిప్షన్ కాంప్లిమెంటరీగా లభిస్తుంది.
స్పెసిఫికేషన్స్ (AI Enhanced Camera Technology)
ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2మెగాపిక్సెల్ బొకే + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో ఫోటో, వీడియో, నైట్, ఎక్స్‌పర్ట్, పనోరమా, పోర్ట్‌రైట్, టైమ్‌ల్యాప్స్, స్టిక్కర్, స్లోమోషన్, టెక్స్‌ట్ స్కానర్, ఎక్స్‌ట్రా హెచ్‌డీ, మ్యాక్రో, గూగుల్ లెన్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో ఫోటో, వీడియో, పనోరమిక్, పోర్ట్‌రైట్, నైట్, టైమ్ ల్యాప్స్, స్టిక్కర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఒప్పో కే10 వెనుక కెమెరా మాడ్యూల్ రెక్టాంగులర్ షేప్‌లో పెద్దగా ఉంది. అందులో మూడు కెమెరా లెన్స్‌లు, ఓ ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.
ఒప్పో కే10 స్మార్ట్‌ఫోన్ ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Oppo K10 Android 11-ఆధారిత ColorOS 11.1తో రన్ అవుతుంది. ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని 5జీబీ వరకు ర్యామ్‌ను పొడిగించుకునే Dynamic RAM expansion ఫీచర్ ఉంది. అలాగే గరిష్ఠంగా 128జీబీ స్టోరేజ్ ఉండగా.. మైక్రోఎస్‌డీ కార్డుతో దాన్ని పొడిగించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన స్లాట్ ఇస్తోంది ఒప్పో.
సాఫ్ట్ వేర్ సైడ్ చూస్తే సున్నితమైన, ఫ్రెండ్లీ ఎక్స్పిరియన్స్ కోసం కలర్ ఓఎస్ 11.1 పై ఈ డివైజ్ రన్ చేస్తుంది. ఈ కలర్ ఓఎస్ 11.1 సిస్టమ్ బుస్టర్, యాంటీ పిపింగ్ నోటిఫికేషన్స్, ఏయిర్ గెశ్చర్స్, ఫ్లక్స్ డ్రాప్ వంటి యూజర్ ఎక్స్పిరియన్స్ కి పేరుగాంచింది. ఈ శక్తివంతమైన హార్డ్ వేర్ అండ్ సాఫ్ట్ వేర్ కలయికతో ఒప్పో కే10 అందరినీ ఆహ్లాదపరుస్తుంది.
33W సూపర్ వూక్ లైటింగ్ ఫాస్ట్ చార్జింగ్ తో 5000mah బ్యాటరీ
ఒప్పో కే10 33W సూపర్ వూక్ లైటింగ్ ఫాస్ట్ చార్జింగ్ తో 5000mah బ్యాటరీతో వస్తుంది. ఈ కాంబినేషన్ తో ఎటువంటి ఛార్జింగ్ సమస్య ఉండదు. ఇంకా బ్రౌసింగ్, గేమింగ్, కెమెరా, ఫోన్ వాడకం గంటల తరబడి మీ రోజు చివరి వరకు బ్యాటరీ ఉంటుంది. 33w సూపర్ వూక్ చార్జింగ్ స్మార్ట్ ఫోన్ కి క్విక్ బూస్ట్ ద్వారా కేవలం 5 నిమిషాల చార్జింగ్ తో 3 గంటల 38 నిమిషాల కాలింగ్ టైమ్ ఇస్తుంది. ఒప్పో కే10 టైప్ సి ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ సెగ్మెంట్ లో బెస్ట్ పవర్ మ్యానేజ్మెంట్ అందిస్తుంది.
చాలామంది ఫోన్ ఛార్జింగ్ నైట్ టైమ్ లో చేస్తుంటారు. ఇంకా ఫోన్ చార్జింగ్ పెట్టేసి రాత్రంతా నిద్రపోతుంటారు. ఇలా చేయడం వల్ల మీ స్మార్ట్ స్మార్ట్ ఫోన్ త్వరగా చెడిపోతుంది. అయితే కే10 ఏఐ టెక్నాలజి ఉపయోగించి మీ నిద్రని ట్రాక్ చేస్తూ ఫోన్ బ్యాటరీ 80% అవగానే ఛార్జింగ్ ఆపివేస్తుంది. అలాగే మీరు నిద్ర లేచే ఒక గంట ముందు మళ్ళీ ఛార్జింగ్ కొనసాగుతుంది. ఈ ఆప్టిమైజేడ్ ఓవర్ నైట్ చార్జింగ్ చాలా కూల్ ఫీచర్ మాత్రమే కాకుండా సూపర్ ఫంక్షనల్ కూడా.
ఫ్రెండ్లీ డిస్ ప్లే
అద్భుతమైన కలర్, పంచ్ హోల్ డిస్ ప్లేతో 6.59 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ప్లస్ కలర్ డిస్ ప్లే అందించారు. ఈ డిస్ ప్లే వెళుతూరులో కూడా అద్భుతమైన స్క్రీన్ విజిబిలిటీ అందిస్తుంది. 90hz రిఫ్రెష్ రేట్ యాప్స్ వాడకంలో సున్నితమైన అనుభవాన్ని ఇస్తుంది. ఈ సెగ్మెంట్ లో ఇతర ఫోన్స్ ల కాకుండా స్మూత్ టచ్, హై ఎండ్ స్క్రీన్ రిజోల్యూషన్ లభిస్తుంది. 90.8% స్క్రీన్ టు బాడీ రేషియో, సినిమాటిక్ అండ్ ఆనందకరమైన సినిమా అనుభూతి కోసం 1080x2412 ఎఫ్‌హెచ్‌డి రిజోల్స్యూషన్ తో వస్తుంది.
ఎల్‌సిడి స్క్రిన్స్ కోసం మొట్టమొదటిసరిగా ఒప్పో స్వంతంగా అభివృద్ది చేసిన అడప్టివ్ రీఫ్రెష్ రేట్ టెక్నాలజిని ఒప్పో కే10లో ప్రవేశపెట్టారు. దీని ద్వారా మీ వడకానికి తగ్గట్టుగా డివైజ్ రీఫ్రెష్ రేట్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేస్తుంది. ఇది మీరు కోరుకున్నట్టుగా స్మూత్ అనుభావాన్ని ఇస్తుంది. చాలామంది వారి స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై గంటల తరబడి గడుపుతుంటారు. కానీ ఒప్పో కే10 సన్ లైట్ అండ్ మూన్ లైట్ డిస్ ప్లేతో రోజంతా ఏఐ కంఫోర్ట్ ఇస్తుంది. కాంటి రక్షణ కోసం డివైజ్ వివిధ లైట్ మోడ్స్ తో బ్రైట్ నెస్ అడ్జస్ట్ చేస్తుంది. ఇంకా బెస్ట్ వ్యూ అభూభావాన్ని అందిస్తుంది.
డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ
గుడ్ బిల్ట్ క్వాలిటీ, ఆస్తేటిక్ డిజైన్ తో ఒప్పో కే10 ఒప్పో వాగ్దానంతో వస్తుంది. ఫీచర్స్ పరంగా ఈ ఫోన్ హై ఎండ్ ఒప్పో ఫోన్స్ లో కనిపించే ఒప్పో గ్లో డిజైన్ అందించింది. ఈ టెక్నాలజి బ్యాక్ ప్యానెల్‌ను మెరిసేలా చేయడమే కాకుండా ఫింగర్ ప్రింట్ రిసీస్టంట్ మీ డివైజ్ ఇతరుల నుండి ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది.
డివైజ్ గురించి అడుగుతు మా వద్దకు చాలా మంది వస్తుంటారు. ఇంత బ్రిలియంటైన డిజైన్ అద్భుతమైన ధర వద్ద అందుబాటులో ఉండడం చూసి ఆశ్చర్యపోయారు.\
కే10 అత్యధిక మన్నికను నిర్ధారించడానికి కొన్ని కఠినమైన డ్రాప్ టెస్ట్స్ కి కూడా వెళ్ళింది. ఇందులో IP5X, IPX4 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఫోన్ ఎంత అందంగా ఉంటుందో అంతే ఫంక్షనల్ గా ఉంటుంది. ఈ ఫోన్ బరువు కేవలం 189 gm ఇంకా ఒక చేతిలో పట్టుకోవడం సౌకర్యంగా ఉంటుంది అలాగే మన జేబులో సులభంగా సరిపోతుంది. ఈ క్రమంలో ఫోన్ రూపాన్ని మెరుగుపర్చడానికి ఒప్పో సైడ్ ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్‌ను అందించింది, దీని ద్వారా డివైజ్ ని చాలా సౌకర్యవంతంగా అన్‌లాక్ చేస్తుంది ఉంటుంది. డివైజ్ మొత్తం లుక్ చాలా ప్రీమియంగా, గ్రిప్, మన్నికతో అద్భుతమైన ఇన్-హ్యాండ్ అనుభూతిని అందిస్తుంది.
ఫైనల్ తాట్స్
ఒప్పో కే10 (Oppo K10) అనేది మీరు ఉపయోగించే సమయంలో మీ ముఖంపై చిరునవ్వును నింపే అత్యంత విశ్వసనీయమైన డివైజెస్ లో ఒకటి. కెమెరా, డిస్‌ప్లే, డిజైన్, పనితీరు వంటి అన్నిటికి రైట్ బాక్స్ టిక్ చేస్తుంది. అలాగే మీ డబ్బుకి పూర్తి విలువ ప్యాకేజీ ఇస్తుంది. డైనమిక్ మెమరీతో పాటు ర్యామ్ విస్తరణ టెక్నాలజి ఈ ధర వద్ద ఒప్పో నుండి వచ్చిన మాస్టర్‌స్ట్రోక్. మీరు తప్పనిసరి కొనుగోలు చేయాల్సిన డివైజ్ కోసం వెతుకుతున్నట్లయితే ఇది బక్స్ కోసం గరిష్ట బ్యాంగ్‌ను అందిస్తుంది.
ఒప్పో కే10ని కొనుగోలు చేయడానికి కస్టమర్‌లు 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐని పొందవచ్చు, ఇంకా ఎస్‌బిఐ డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు అండ్ ఈఎంఐ లావాదేవీలపై 2వేల ఫ్లాట్ డిస్కౌంట్, స్టాండర్డ్ చార్టర్డ్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌లు ఇంకా క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. కస్టమర్‌లకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు డిస్నీ+హాట్‌స్టార్ సబ్ స్క్రిప్షన్ 1-సంవత్సరం పాటు లభిస్తుంది. అలాగే ఫ్లిప్ కార్ట్ క్విక్ ద్వారా ఎంపిక చేసిన పిన్ కోడ్‌లలో కేవలం 90నిమిషాలలో డెలివరీ పొందవచ్చు.
ఒప్పో ఎంకో ఎయిర్ 2
కే10 మనీ ప్రతిపాదనను సంపూర్ణం చేయడానికి, ఒప్పో ఎంకో ఎయిర్ 2 ట్రు వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లుని కూడా లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్‌లు గొప్ప ఆడియో క్వాలిటీ అందిస్తాయి. ఏఐ ఇన్-కాల్ నాయిస్ క్యాన్సలేషన్ తో 13.4mm కాంపోజిట్ టైటానైజ్డ్ డయాఫ్రాగమ్ డ్రైవర్ ఉపయోగించి ఇయర్‌బడ్‌లు ఆడియో అనుభవం అద్భుతమైనవిగా చేస్తాయి.
ఇవి కేవలం 3.5గ్రా బరువుతో ప్రతి ఇయర్‌బడ్‌తో ఎర్గోనామిక్‌గా రూపొందించబడింది. ఇంకా అద్భుతమైన అపారదర్శక జెల్లీ కేస్ క్యాప్ తో వస్తుంది. ఇంకా రెండు ఆక్టివ్ రంగులలో లభిస్తుంది వీటిలో వైట్ అండ్ బ్లూ ఉన్నాయి. మీ వినియోగాన్ని బట్టి మీరు 24 గంటల వరకు యుసెజ్ సమయాన్ని పొందుతారు. ఇంకా ప్రత్యేకమైన టచ్-కంట్రోల్ తో టియూవి రీన్‌ల్యాండ్ హై పెర్ఫార్మెన్స్ అండ్ లో లాటెన్సీ సర్టిఫికేషన్ ఉంది. మీరు ఎంకో ఎయిర్ 2ని ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్ లో 29 మార్చి 2022 నుండి రూ.2499 ధరకు కొనుగోలు చేయవచ్చు.