Asianet News TeluguAsianet News Telugu

14న ఎంట్రీ: వన్‌ప్లస్ 7 ప్రో స్పెసిఫికేషన్స్ ఇవే!

వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో మొబైల్స్ వారం రోజుల్లో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ సమయంలోనే ఆ ఫోన్లకు సంబంధించిన డిజైన్స్ లీకయ్యాయి. మే 14న అధికారికంగా ఈ రెండు ఫోన్లు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. 

OnePlus 7 Pro Almond Colour Variant Leaked
Author
New Delhi, First Published May 7, 2019, 3:22 PM IST

వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో మొబైల్స్ వారం రోజుల్లో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ సమయంలోనే ఆ ఫోన్లకు సంబంధించిన డిజైన్స్ లీకయ్యాయి. మే 14న అధికారికంగా ఈ రెండు ఫోన్లు భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. 

ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు అధికారికంగా వెల్లడికాకపోయినప్పటికీ.. కొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి. వన్‌ప్లస్ 7 ప్రో 5జీ నెట్ వర్క్‌ను సపోర్ట్ చేస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. లీకైన సమాచారం ప్రకారం.. 6జీబీ+128జీబీ మోడల్ ధర రూ.49,999 ఉండొచ్చని అంచనా. 

8జీబీ+256జీబీ స్టోరేజీ ధర రూ. 52,999, 12జీబీ+256జీబీ ధర రూ. 57,999 ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. నెబులా బ్లూ, మిర్రర్ గ్రే రంగుల్లో లభించనుంది. 

వన్‌ప్లస్ 7 ప్రో ఫీచర్లు: అంచనా ప్రకారం..

డిస్‌ప్లే: 6.67 అంగుళాల ఫ్లూయిడ్ అమోల్డ్
ర్యామ్: 6జీబీ, 8జీబీ, 12జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ+256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
రియర్ కెమెరా: 48+8+16 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 48 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్

కాగా, వన్‌ప్లస్ 7ప్రో తోపాటు వన్‌ప్లస్ 7 కూడా రిలీజ్ అవుతోంది. 6.41 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, వెనుకవైపు రెండు కెమెరాలు 48ఎంపీ, 5ఎంపీ, బ్యాటరీ 3,700 ఎంఏహెచ్ బ్యాటరీ.

Follow Us:
Download App:
  • android
  • ios