భారత మార్కెట్లోకి నోకియా 4.2: ధర, స్పెసిఫికేషన్స్, ఆఫర్లు..

హెచ్ఎండీ గ్లోబల్ మరో కొత్త నోకియా స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా 4.2 పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్ ఆండ్రాయిడ్ వన్ ప్రొగ్రాం ఆండ్రాయిడ్ పై 9 ప్లాట్‌ఫాంపై పనిచేస్తుంది. దీనికి ప్రత్యేకంగా గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఉండటం విశేషం. 

Nokia 4.2 launched at Rs. 10,990 in India: Price, offers, specifications

హెచ్ఎండీ గ్లోబల్ మరో కొత్త నోకియా స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా 4.2 పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్ ఆండ్రాయిడ్ వన్ ప్రొగ్రాం ఆండ్రాయిడ్ పై 9 ప్లాట్‌ఫాంపై పనిచేస్తుంది. దీనికి ప్రత్యేకంగా గూగుల్ అసిస్టెంట్ బటన్ కూడా ఉండటం విశేషం. 

ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో దీన్ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. హెచ్ఎండీ గ్లోబల్ రెండు వేరియంట్లలో నోకియా 4.2ను పరిచయం చేయగా, ఇప్పుడు అందులో ఒకటి మాత్రమే మార్కెట్లోకి తీసుకొచ్చింది.

3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉన్న ఈ మొబైల్ ధరను రూ. 10,999గా నిర్ణయించారు. స్నాప్‌డ్రాగన్ 439 ప్రాసెసర్, బ్లాక్, పింక్ శాండ్ రంగుల్లో ఇది లభ్యం కానుంది. ప్రస్తుతానికి నోకియా ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ మొబైల్‌ను విక్రయిస్తోంది. మే 14 నుంచి నోకియా 4.2 క్రోమా, రిలయన్స్, సంగీత, పూర్విక, బిగ్ సీ, మైజీ లాంటి స్టోర్లలో లభిస్తుందని హెచ్ఎండీ గ్లోబల్ వెల్లడించింది. 

ప్రారంభ ఆఫర్ కింద నోకియా ఆన్‌లైన్ స్తోర్ ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ. 500 రాయితీ అందిస్తోంది. ఈ ఆఫర్ జూన్ 10 వరకు అమలులో ఉండనుంది. ఇక వొడాఫోన్-ఐడియా వినియోగదారులు రూ. 2,500 విలువైన 50వోచర్లను పొందవచ్చు. 

అంతేగాక, 6నెలలపాటు ఉచిత స్క్రీన్ రిప్లేస్మెంట్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు హెచ్ఎండీ గ్లోబల్ పేర్కొంది. భారత మార్కెట్లోకి నోకియా 4.2 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉందని హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా హెడ్ అజయ్ మెహతా అన్నారు. ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రొగ్రాంలో భాగంగా తర్వాతి రెండు అప్‌డేట్‌ల(క్యూ, ఆర్‌)ను కూడా ఇస్తామన్నారు.

నోకియా 4.2 స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్‌ 439 ప్రాసెసర్‌
3జీబీ ర్యామ్‌+ 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్‌ 9 పై
వెనుక వైపు 13+2 ఎంపీ డ్యుయల్‌ కెమెరాలు
ముందువైపు 8ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios