Asianet News TeluguAsianet News Telugu

పెద్ద డిస్ ప్లేతో డిసెంబర్ 8న మోటోరోలా జి9పవర్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే ?

 మోటో జి9పవర్ లాంచ్ డిసెంబర్ 8న మధ్యాహ్నం 12 గంటలకు కానుంది. మోటరోలా ఇండియా కూడా దీన్నిద్వారా  అధికారికంగా ధృవీకరించింది.

motorola  g9 power launch in india on 8 december 8 company confirms price and specifications
Author
Hyderabad, First Published Dec 5, 2020, 12:09 PM IST

లెనోవా యజమాన్యంలోని మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో జి9పవర్‌ను మరికొద్ది రోజుల్లో ఇండియాలో లాంచ్ చేయనుంది. మోటో జి9పవర్ లాంచ్ డిసెంబర్ 8న మధ్యాహ్నం 12 గంటలకు కానుంది. మోటరోలా ఇండియా కూడా దీన్నిద్వారా  అధికారికంగా ధృవీకరించింది.

మోటో జి9పవర్  స్మార్ట్ ఫోన్ ను మొదట ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనుంది. భారతదేశానికి ముందు, మోటో జి9పవర్‌ను ఐరోపాలో లాంచ్ చేశారు. మోటో జి9పవర్ ఇండియాలో అధికారిక ధర గురించి ఎటువంటి సమాచారం లేదు, కానీ ఐరోపాలో దీనిని 199 యూరోలకు లాంచ్ చేశారు, అంటే సుమారు ఇండియాలో రూ.17,400.

ఈ ఫోన్ సింగిల్ వేరియంట్ 4 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్‌లో లభిస్తుంది. మోటో జి 9 పవర్‌ను ఎలక్ట్రిక్ వైలెట్, మెటాలిక్ సెజ్ కలర్ వేరియంట్‌లో కొనుగోలు చేయవచ్చు. 

మోటో జి 9 పవర్ స్పెసిఫికేషన్లు 
ఈ ఫోన్‌ మీకు స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది. 720x1640 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.8-అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్‌తో లభిస్తాయి, మెమరీ కార్డ్ సహాయంతో 512 జీబీ వరకు స్టోరేజ్ పెంచవచ్చు.

also read ల్యాప్‌టాప్‌ను ఛార్జ్ చేసే మొట్టమొదటి పవర్‌బ్యాంక్‌ ఇండియాలో లాంచ్.. ఒకేసారి 3 డివైజెస్ ఛార్జ్.. ...

 

మోటో జి 9 పవర్ కెమెరా

మోటో జి9 పవర్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది, దీనిలో ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్స్, రెండవ కెమెరా 2 మెగాపిక్సెల్, మూడవ కెమెరా 2 మెగాపిక్సెల్ డీప్ సెన్సార్. ఈ ఫోన్‌లో సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.


మోటో జి 9 పవర్ బ్యాటరీ

మోటరోలాకు చెందిన ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, 20 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో కనెక్టివిటీ కోసం వై-ఫై, బ్లూటూత్ వి5, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios