Asianet News TeluguAsianet News Telugu

మిలటరీ గ్రేడ్ బిల్డ్ క్వాలిటీతో ఎల్‌జి కె 42 కొత్త స్మార్ట్ ఫోన్.. బడ్జెట్ ధరకే లాంచ్..

ఎల్‌జి ఇండియా మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ఎల్‌జీ కె42 ను భారత్‌లో విడుదల చేసింది. ఎల్‌జీ కె42  అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL-STD-810G సర్టిఫైడ్ చేయబడింది. 

lg k42 launched in india with mil std 810g military grade build check price and specifications here
Author
Hyderabad, First Published Jan 23, 2021, 6:03 PM IST

ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఎల్‌జి ఇండియా మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ఎల్‌జీ కె42 ను భారత్‌లో విడుదల చేసింది. ఎల్‌జీ కె42  అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే ఈ ఫోన్ మిలిటరీ గ్రేడ్ MIL-STD-810G సర్టిఫైడ్ చేయబడింది.

ఈ  సర్ఫికెట్ కోసం ఎల్‌జి కె 42 తక్కువ ఉష్ణోగ్రత,  ఉష్ణోగ్రత షాక్, వైబ్రేషన్ షాక్, షాక్, తేమతో సహా తొమ్మిది వేర్వేరు టెస్టులు  చేయబడ్డాయి. ఎల్‌జీ కె42కి రెండేళ్ల వారంటీ లభిస్తుంది.

దీని  ప్రత్యేకమైన  ఫీచర్స్ హెచ్‌డి + డిస్‌ప్లే, పంచ్‌హోల్ డిజైన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉన్నాయి.

ఎల్‌జి కె 42 ధర
ఎల్‌జి కె 42 ధర రూ .10,990. దీనిలో  3 జీబీ ర్యామ్‌తో 64 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఈ ఫోన్ గ్రే, గ్రీన్ కలర్ వేరియంట్లలో వస్తుంది.  ఈ ఎల్‌జీ ఫోన్‌తో వన్‌టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌తో సహా రెండేళ్ల వారంటీ ఇస్తున్నారు. ఈ ఫోన్‌ను గత ఏడాది యుఎస్‌లో లాంచ్ చేశారు.

also read ఐఫోన్‌ కొనాలనుకునే వారికి గోల్డెన్ ఛాన్స్.. జనవరి 26 వరకు మాత్రమే ఆఫర్.. ...

 ఎల్‌జీ కె 42 స్పెసిఫికేషన్లు
ఎల్‌జీ కె 42 కి ఆండ్రాయిడ్ 10తో ఎల్‌జీ యుఎక్స్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌కు 6.6-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లే లభిస్తుంది, దీని రిజల్యూషన్ 720x1600 పిక్సెల్స్. ఫోన్‌లో మీడియాటెక్  ఆక్టాకోర్ హెలియో పి22 (ఎమ్‌టి 6762) ప్రాసెసర్, 3 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ఇచ్చారు, దీనిని మెమరీ కార్డ్ సహాయంతో విస్తరించుకోవచ్చు.

ఎల్‌జీ కె 42 కెమెరా
కెమెరా విషయానికొస్తే, దీనికి సింగిల్ రియర్ ట్రిపుల్ కెమెరా సెటప్, సింగిల్ ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంది. వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్ కెమెరా,  రెండవది 5 మెగాపిక్సెల్ సూపర్ వైడ్ యాంగిల్ కెమెరా, మూడవది 2 మెగాపిక్సెల్ డీప్ లెన్స్  కెమెరా, నాల్గవది 2 మెగాపిక్సెల్  లెన్స్ కెమెరా, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా  ఉంది.
 
ఎల్‌జీ కె 42 బ్యాటరీ & కనెక్టివిటీ
కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 4 జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్ పవర్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. దీనిలో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఫోన్ బరువు 182 గ్రాములు. గూగుల్ అసిస్టెంట్ కోసం ఫోన్‌కు ప్రత్యేక బటన్ కూడా ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios