డ్యూయల్ సెల్ఫీ ఫ్లాష్ లైట్ తో ఇన్ఫినిక్స్ హాట్ 10 స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర కూడా 10వేల కన్నా తక్కువే..
ఇన్ఫినిక్స్ హాట్ 10లో డ్యూయల్ సెల్ఫీ ఫ్లాష్ లైట్ వంటి ఫీచర్లు మొదటిసారిగా అందించాము. తక్కువ ధరకే మంచి ప్రాసెసర్ ఉన్న ఫోన్‌కు వినియోగదారుల నుండి డిమాండ్ ఉంది, కాబట్టి ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జి70 ప్రాసెసర్ అందించాము.
షెన్‌జెన్ స్మార్ట్‌ఫోన్ సంస్థ ఇన్ఫినిక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 10ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ హోల్ పంచ్ డిస్ ప్లేతో వస్తుంది. ఇది కాకుండా ఫోన్ ముందు భాగంలో డ్యూయల్ సెల్ఫీ ఫ్లాష్ లైట్ అందించారు. ఈ ఫోన్‌లో బ్యాటరీ సేవింగ్ కోసం పవర్ మారథాన్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు, ఇది బ్యాటరీ లైఫ్ 25 శాతం వరకు పెంచుతుంది. .
ఇన్ఫినిక్స్ హాట్ 10 స్పెసిఫికేషన్లు : ఇన్ఫినిక్స్ హాట్ 10 లో 720x1640 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 10 బేస్డ్ ఎక్స్‌ఓఎస్ 7.0, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, మీడియాటెక్ హెలియో జీ70 ప్రాసెసర్ ఇందులో ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ హాట్ 10 కెమెరా : ఇన్ఫినిక్స్ నుండి వచ్చిన ఈ ఫోన్‌లో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, వీటిలో ప్రధాన కెమెరా 16 మెగాపిక్సెల్స్. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
ఇన్ఫినిక్స్ హాట్ 10 బ్యాటరీ - ఇన్ఫినిక్స్ హాట్ 10లో 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. కనెక్టివిటీ కోసం వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్, 4జి, మైక్రో యుఎస్‌బి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ ఉంది.
also read షియోమి కొత్త ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జర్.. కేవలం 19 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ చార్జ్.. ...
ఈ ఫోన్ గురించి ఇన్ఫినిక్స్ ఇండియా సీఈఓ అనీష్ కపూర్ మాట్లాడుతూ "కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్‌కు సంబంధించి మా వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌పై మేము చాలా శ్రద్ధ పెట్టాము. ఇన్ఫినిక్స్ హాట్ 10లో డ్యూయల్ సెల్ఫీ ఫ్లాష్ లైట్ వంటి ఫీచర్లు మొదటిసారిగా అందించాము.
తక్కువ ధరకే మంచి ప్రాసెసర్ ఉన్న ఫోన్‌కు వినియోగదారుల నుండి డిమాండ్ ఉంది, కాబట్టి ఫోన్‌లో మీడియాటెక్ హెలియో జి70 ప్రాసెసర్ అందించాము. హీలియో జి70 అనేది శక్తివంతమైన గేమింగ్ ప్రాసెసర్.
ఈ ప్రాసెసర్‌తో భారతీయ మార్కెట్లో రూ.10వేల కన్నా తక్కువకే లభించే ఏకైక ఫోన్ ఇన్ఫినిక్స్ హాట్ 10. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌లోని మరే ఫోన్‌లో లేని డ్యూయల్ సెల్ఫీ ఫ్లాష్ లైట్ ఇచ్చాము.
భారతీయ వినియోగదారులకు చాలా ప్రత్యేకమైన ఇన్ఫినిక్స్ హాట్ 10 బ్యాటరీ ఆప్టిమైజేషన్ కోసం మేము పవర్ మారథాన్ టెక్నాలజీని ఉపయోగించాము. ఈ ఫోన్‌తో మీకు గొప్ప స్టయిల్, స్ట్రాంగ్ పవర్ లభిస్తుంది." అని అన్నారు.