సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో హువావే కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్...
హువావే తన నోవా 6 ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్‌ను మలేషియాలో విడుదల చేసింది. దీనిని నోవా 7ఐ అని పిలుస్తోంది. ఇది ఆక్టా-కోర్ కిరిన్ 810 ఎస్‌ఓసి, 8జిబి ర్యామ్,128జిబి స్టోరేజ్ కలిగి ఉంది.
హువావే కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. హువావే నోవా 7ఐ స్మార్ట్ ఫోన్ 4200 ఎంఏహెచ్ బ్యాటరీతో, హిసిలికాన్ కిరిన్ 810 ప్రాసెసరుతో వస్తుంది. హువావే తన నోవా 6 ఎస్‌ఈ స్మార్ట్‌ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్‌ను మలేషియాలో విడుదల చేసింది. దీనిని నోవా 7ఐ అని పిలుస్తోంది.
ఇది ఆక్టా-కోర్ కిరిన్ 810 ఎస్‌ఓసి, 8జిబి ర్యామ్,128జిబి స్టోరేజ్ కలిగి ఉంది. హువావే నోవా 7ఐ 48 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను ఇందులో ఉంది. ముందు కెమెరా ఎఫ్ / 2.0 ఆపర్చర్‌తో 16 మెగాపిక్సెల్ షూటర్. ఇది 6.10-అంగుళాల ఎల్‌సిడిని 2310 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్ ఉంది. ఇది సాకురా పింక్, మిడ్ నైట్ బ్లాక్, క్రష్ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
also read సోనీ కొత్త వైర్‌లెస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సింగ్ హెడ్‌ఫోన్స్...
హువావే నోవా 7ఐ ధర
మలేషియా బ్లాగ్ సోయా సిన్కావ్ ప్రకారం హువావే నోవా 7ఐ ధర MYR 1,099 (సుమారు రూ. 18,900). ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌ల కోసం సిద్ధంగా ఉంది, ఫిబ్రవరి 22 నుండి షిప్పింగ్ ప్రారంభమవుతుంది. ఇతర మార్కెట్లలో లభ్యతపై సమాచారం లేదు. ఇది మలేషియాలో మాత్రమే అందుబాటులో ఉంది.
హువావే నోవా 7ఐ ఫీచర్స్
డ్యూయల్ సిమ్ (నానో), హువావే నోవా 7ఐ 6.4-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1,080x2,310 పిక్సెల్స్) డిస్ ప్లేని 398 పిపి పిక్సెల్ తో కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఈఎంయూఐ 10.0.1 పై పనిచేస్తుంది. నోవా 7ఐ 8జిబి ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిని మైక్రో ఎస్‌డి కార్డ్ ఉపయోగించి 256జిబి వరకు పెంచుకోవచ్చు.
హువావే నోవా 7ఐ ఆక్టా-కోర్ కిరిన్ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. హువావే 40W సూపర్ చార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇచ్చే 4200 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో సపోర్ట్ చేస్తుంది. ఆప్టిక్స్ గురించి మాట్లాడుతూ హువావే నోవా 7ఐ వెనుక నాలుగు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా వైడ్ యాంగిల్-లెన్స్, ఎఫ్/1.8 ఎపర్చర్‌తో 48 మెగాపిక్సెల్ షూటర్ ఉంది.
also read ఆ స్మార్ట్ ఫోన్స్ కు భారీగా పడిపోయిన డిమాండ్...ఎందుకంటే...?
అదనంగా 120 ° వ్యూ ఆంగిల్ కలిగిన 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాలో ఎఫ్/2.0 లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది.
కనెక్టివిటీ కోసం హువావే నోవా 7ఐ లో 4జి ఎల్‌టిఇ, వై-ఫై 802.11 ఎ/బి/జి/ఎ/ఎసి, బ్లూటూత్ 5.0, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇంకా సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.
హువావే టెక్నాలజీస్ కో, లిమిటెడ్ ఒక చైనీస్ మల్టీ టెక్నాలజి కంపెనీ. హువావే టెలికమ్యూనికేషన్ డివైజెస్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తుంది. ప్రధాన కార్యాలయం గ్వాంగ్‌డాంగ్‌లోని షెన్‌జెన్‌లో ఉంది. ఈ సంస్థను 1987 లో రెన్ జెంగ్ఫీ స్థాపించారు.