ఆ స్మార్ట్ ఫోన్స్ కు భారీగా పడిపోయిన డిమాండ్...ఎందుకంటే...?

ఒకప్పుడు బడ్జెట్‌ ఫోన్లు, ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్ల డిమాండ్‌లో ప్రపంచంలో ఏకైక మార్కెట్‌ ఇండియా. కానీ ఇపుడు ట్రెండ్‌ మారిందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదించింది. ముఖ్యంగా రూ. రూ.5వేల లోపు ఖరీదు గల స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి యువభారతం ఆసక్తి చూపడం లేదని తెలిపింది.

Smartphones below Rs 5000 are not selling in India -

న్యూఢిల్లీ: ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో దిగ్గజ సంస్థలకు భారత్ స్వర్గధామంలా విరాజిల్లుతున్నది. కానీ ప్రస్తుతం  భారత మార్కెట్లో బడ్జెట్‌ ధరల స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు వెలవెలబోతున్నాయని తేలింది.

ఒకప్పుడు బడ్జెట్‌ ఫోన్లు, ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్ల డిమాండ్‌లో ప్రపంచంలో ఏకైక మార్కెట్‌ ఇండియా. కానీ ఇపుడు ట్రెండ్‌ మారిందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ నివేదించింది. ముఖ్యంగా రూ. రూ.5వేల లోపు ఖరీదు గల స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేయడానికి యువభారతం ఆసక్తి చూపడం లేదని తెలిపింది.

also read తక్షణం బకాయిలు చెల్లించండి.. లేదంటే!

నిజానికి ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లకు తగ్గిపోతున్న డిమాండ్ విషయమై 2018లోనే సంకేతాలు మొదలయ్యాయని కౌంటర్ పాయింట్‌  రీసెర్చ్‌ పరిశోధన తేల్చింది. 2018లో 25శాతం క్షీణించిన ఈ కేటగిరీ అమ్మకాలు 2019లో 45 శాతానికి పెరిగింది.

Smartphones below Rs 5000 are not selling in India -

ప్రధానంగా ఎంట్రీ లెవల్ కేటగిరీ రూ .5000 స్మార్ట్‌ఫోన్‌లలో లభించే మార్జిన్ కంటే దేశంలోని ఇంటీరియర్‌ పరికరాల ఖర్చు ఎక్కువ అవుతోందని తెలిపింది. అలాగే, ఈ ఫోన్‌ల డిమాండ్ కూడా గణనీయంగా పడిపోయిందని పేర్కొంది. దీనికి తోడు ఫీచర్ ఫోన్ వినియోగదారులు స్మార్ట్‌ఫోన్లకు మారిపోవడం కూడా ఒక కారణం. 

also read ఎయిర్‌టెల్ డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో 4 కొత్త రీఛార్జ్ ప్లాన్లు

అయితే, భారతదేశంలో ఇంకా 45 కోట్ల మిలియన్ల ఫీచర్ ఫోన్లు వినియోగంలో ఉన‍్నా, అప్‌గ్రేడ్‌ అయ్యేందుకు చాలామంది వినియోగదారులు ఆసక్తి చూపడంలేదు. మరోవైపు, భారతదేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌ల సగటు ధర క్రమంగా పెరుగుతోందని ఐడీసీ డేటా ద్వారా తెలుస్తోంది. 

ఇది 2018లో 159 డాలర్లు (సుమారు రూ. 11,350 ) నుండి 2019 లో 160 డార్లు (సుమారు రూ. 11,421) కు పెరిగింది.  ప్రస్తుతం 170 డాలర్ల (సుమారు రూ. 12,135 ) స్థాయికి చేరింది. ఈ గణాంకాల ప్రకారం బట్టి చూస్తే ఎంట్రీ లెవల్లో చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం షియోమీయే ఎక్కువ ఫోన్లను విక్రయిస్తోంది.  
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios