హువామికి చెందిన అమేజ్‌ఫిట్ పాప్ ప్రో స్మార్ట్‌వాచ్‌ను డిసెంబర్ 1 న చైనాలో విడుదల చేయనున్నారు. లాంచ్ సంబంధించి హువామి ఒక టీజర్ పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌ ద్వారా అమేజ్‌ఫిట్ పాప్ ప్రో కొన్ని ఫీచర్లు కూడా వెల్లడించారు.

దీనికి షియోమి రెడ్‌మి వాచ్ వంటి స్క్వేర్ డయల్ అందించారు. అమేజ్‌ఫిట్ పాప్ ప్రో గత నెలలో లాంచ్ చేసిన అమేజ్‌ఫిట్ పాప్ కి ప్రీమియం వేరియంట్ గా వస్తుంది. డిజైన్ పరంగా అమేజ్‌ఫిట్ పాప్ ప్రో అమేజ్‌ఫిట్ పాప్‌తో సమానంగా కనిపిస్తుంది.

also read పాకెట్ సైజులో టెండా వై-ఫై హాట్‌స్పాట్‌ డివైజెస్ విడుదల.. తక్కువ ధరకే.. ...

 డిసెంబర్ 1న లాంచ్ ఈవెంట్ ఉండనున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్‌వాచ్‌ స్క్వేర్ డయల్‌ కలర్ టచ్‌స్క్రీన్‌తో వస్తుంది. ఈ వాచ్‌ ఎన్‌ఎఫ్‌సికి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఇన్‌బిల్ట్ జిపిఎస్‌ అందించారు.

అమేజ్‌ఫిట్ పాప్ ప్రో వాచ్ 31 గ్రాముల బరువుతో పి‌ఏ‌ఐ (పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్) కు సపోర్ట్ చేస్తుంది. దీనిలో 60 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లతో 1.43-అంగుళాల ఓ‌ఎల్‌ఈ‌డి డిస్ ప్లే ఉంది.

టీజర్ పోస్టర్ ప్రకారం ఈ వాచ్‌ లో 24 గంటల హార్ట్ బీట్ సెన్సార్, మైక్రోఫోన్ ఉంది, మైక్రోఫోన్ ద్వారా మీరు వాయిస్ కామండ్స్ ఇవ్వగలుగుతారు. ఇండియాలో ఈ వాచ్ ధర గురించి ఎటువంటి సమాచారం లేనప్పటికి చైనాలో దీని ధర 349 చైనీస్ యువాన్ అంటే సుమారు 3,900 రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు.