Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్లో ప్రవేశపెట్టని ఫోన్ పొగొట్టుకున్న హానర్: తిరిగిస్తే భారీ నజరానా

పోగొట్టుకున్న తమ స్మార్ట్‌ఫోన్‌ను తిరిగి తెచ్చి ఇచ్చిన వారికి భారీగా రివార్డు ఇస్తామంటూ ప్రకటించింది ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హానర్. ఎందుకంటే ఆ ఫోన్ మార్కెట్లోకి ఇంకా  తీసుకురాలేదు. 

Honor lost a prototype phone and is offering $5600 to whoever   returns it
Author
Munich, First Published Apr 25, 2019, 4:35 PM IST

పోగొట్టుకున్న తమ స్మార్ట్‌ఫోన్‌ను తిరిగి తెచ్చి ఇచ్చిన వారికి భారీగా రివార్డు ఇస్తామంటూ ప్రకటించింది ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హానర్. ఎందుకంటే ఆ ఫోన్ మార్కెట్లోకి ఇంకా తీసుకురాలేదు. 

జర్మనీలో హువావే సబ్‌బ్రాండ్ అయిన హానర్‌కు చెందిన ఉద్యోగి తనతో తెచ్చుకున్న ఫోన్‌ను పోగొట్టుకోవడంతో ఈ ప్రకటన చేసింది హానర్. ఏప్రిల్ 22న జర్మనీలోని మ్యూనిచ్‌కు రైల్లో వెళుతుండగా హానర్ మొబైల్‌ను పోగొట్టుకున్నాడు ఆ ఉద్యోగి.

దీంతో అప్ కమింగ్ ప్రోటో టైప్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను దొరికినవారు తిరిగి ఇవ్వాలని హువావే విజ్ఞప్తి చేసింది. గ్రే ప్రొటెక్టివ్ కవర్‌తో ఉన్న హానర్ మొబైల్‌ను సురక్షితంగా రిటర్న్ చేసిన వారికి 5,600 యూరోలు(సుమారు రూ. 4లక్షలు) నజరానాగా ఇస్తామని ట్విట్టర్ వేదికగా  ప్రకటించింది.

కాగా, మే 21న లండన్‌లో నిర్వహించనున్న ఓ ప్రత్యేక కార్యక్రమంలో హానర్ 20 సిరీస్‌లో భాగంగా హానర్ 20 ప్రో, హానర్ 20ఏ, హానర్ 20సీ, హానర్ 20 ఎక్స్ తదితర స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుంది. అయితే, పోయిన స్మార్ట్ ఫోన్ కూడా ఈ కార్యక్రమంలో ప్రవేశపెట్టాల్సిన ఫోనే అని భావిస్తున్నారు. 

చదవండి: ఫ్లిప్‌కార్ట్ సూపర్ వాల్యూ వీక్ సేల్: ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపులు

Follow Us:
Download App:
  • android
  • ios