Asianet News TeluguAsianet News Telugu

తక్కువ ధరకే ఫేస్ అన్‌లాక్ ఫీచర్ తో జియోనీ ఎఫ్8 నియో కొత్త స్మార్ట్‌ఫోన్..

 జియోనీ ఎఫ్8 నియో పేరుతో వస్తున్న ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ వినియోగదారుల కోసం 6వేల లోపు బడ్జెట్  ధరకే విడుదల చేశారు. జియోనీ కొత్త ఫోన్ ముఖ్యమైన ఫీచర్స్ గురించి చెప్పాలంటే ఈ ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్, స్లో మోషన్, బ్యూటీ మోడ్, నైట్ మోడ్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. 

gionee f8 neo budget smartphone launched in india know price in india specifications-sak
Author
Hyderabad, First Published Oct 24, 2020, 12:02 PM IST

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ జియోనీ  ఒక కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. జియోనీ ఎఫ్8 నియో పేరుతో వస్తున్న ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ వినియోగదారుల కోసం 6వేల లోపు బడ్జెట్  ధరకే విడుదల చేశారు.

జియోనీ కొత్త ఫోన్ ముఖ్యమైన ఫీచర్స్ గురించి చెప్పాలంటే ఈ ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్, స్లో మోషన్, బ్యూటీ మోడ్, నైట్ మోడ్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. భారతదేశంలో జియోనీ ఎఫ్8 నియో ధర, ఫీచర్స్ వివరాలు..

జియోనీ ఎఫ్ 8 నియో స్మార్ట్‌ఫోన్  2 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర భారతదేశంలో రూ.5,499 గా నిర్ణయించిది. బ్లాక్, రెడ్, బ్లూ అనే మూడు కలర్ వేరియంట్లలో వస్తుంది. జియోనీ బ్రాండ్ కొత్త ఫోన్ భారతదేశంలో దాదాపు రెండు లక్షల మొబైల్ రిటైలర్ల ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

జియోనీ ఎఫ్ 8 నియో ఫీచర్స్.. 

సాఫ్ట్‌వేర్ ఇంకా డిస్ ప్లే: జియోనీ ఎఫ్ 8 నియో స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ పైన నడుస్తుంది, ఈ ఫోన్ 5.45 అంగుళాల హెచ్‌డి + (720 × 1,440 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంది.

also read ఫేస్‌బుక్‌ కొత్త డేటింగ్ సర్వీస్.. 32 దేశాలలో అందుబాటులోకీ.. ...

ప్రాసెసర్, ర్యామ్ ఇంకా స్టోరేజ్: స్పీడ్, మల్టీ టాస్కింగ్ కోసం 2 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్‌తో యునిసాక్ ఎస్సి 9863 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఇందులో అందించారు. మైక్రో ఎస్డీ కార్డు సహాయంతో స్టోరేజ్ మరింత పెంచుకోవచ్చు.

కెమెరా: జియోనీ మొబైల్‌లో 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, ఎల్‌ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

కనెక్టివిటీ: 4జి ఎల్‌టిఇ, బ్లూటూత్, వై-ఫై, మైక్రో-యుఎస్‌బి, జిపిఎస్ / ఎ-జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో జెమ్ ఎడ్జ్ డిజైన్ ఇచ్చారు. ఈ ఫోన్‌లో ఫింగర్  ప్రింట్ సెన్సార్ లేదు.

బ్యాటరీ సామర్థ్యం: జియోనీ ఎఫ్ 8 నియోలో 3,000 mAh బ్యాటరీ అందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios