హార్ట్ బీట్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్‌తో బోట్ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్‌..

బోట్ స్టార్మ్‌లో ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే 24/7 హార్ట్ బీట్ మానిటర్‌తో పాటు బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ సెన్సార్స్ ఇందులో ఉన్నాయి. బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్‌తో భారతదేశంలో లాంచ్ చేసిన చౌకైన స్మార్ట్‌వాచ్ ఇదే. 

boat storm smartwatch launched in india with blood oxygen monitoring-sak

భారతీయ కంపెనీ బోట్ స్టోర్మ్ అనే మొట్టమొదటి స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసింది. బోట్ స్టార్మ్‌లో ప్రత్యేకమైన ఫీచర్ ఏంటంటే 24/7 హార్ట్ బీట్ మానిటర్‌తో పాటు బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ సెన్సార్స్ ఇందులో ఉన్నాయి.

బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్‌తో భారతదేశంలో లాంచ్ చేసిన చౌకైన స్మార్ట్‌వాచ్ ఇదే. ఈ బోట్ స్టార్మ్ స్మార్ట్‌వాచ్ అక్టోబర్ 29 అంటే నేటి నుండి ఫ్లిప్‌కార్ట్, బోట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సేల్స్ ప్రారంభంకానుంది. అయితే లాంచ్ ఆఫర్ కింద బోట్ స్టార్మ్ స్మార్ట్ వాచ్ రూ.1,999 ధరకే కొనుగోలు చేయవచ్చు, దీని అసలు ధర రూ.5,990. 

బోట్ స్టార్మ్ స్మార్ట్‌వాచ్‌ ఫీచర్స్ 

ఇందులో తొమ్మిది స్పోర్ట్స్ మోడ్‌లు, 100కి పైగా డౌన్‌లోడ్ చేయగల వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌కి మెటల్ బాడీ ఇచ్చారు. బ్లాక్ అండ్ బ్లూ రెండు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. సులభంగా మార్చగల సిలికాన్ బెల్ట్  అందించారు.

also read నేడు అంతర్జాతీయ ఇంటర్నెట్ దినోత్సవం.. కరోనా నివారణకు ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డ ఇంటర్నెట్.. ...

1.3 అంగుళాల టచ్ కర్వ్డ్ డిస్‌ప్లేతో ఈ వాచ్ వస్తుంది. బోట్ స్టార్మ్ స్మార్ట్‌వాచ్‌ బ్యాటరీ లైఫ్ 10 రోజుల బ్యాకప్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేసింది.

బోట్ స్టార్మ్ బ్లడ్ ఆక్సిజన్‌ లెవెల్ కొలవడానికి ఎస్‌పి‌ఓ2 సెన్సార్‌ ఇందులో అమర్చారు. వాచ్‌లో రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, హైకింగ్, క్లైంబింగ్, యోగా వంటి తొమ్మిది స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. వాటర్ రెసిస్టెంట్ కోసం 5ఏ‌టి‌ఎం రేట్ చేయబడింది. ఫోన్‌లో వచ్చే అన్ని నోటిఫికేషన్‌లు వాచ్‌లో కనిపిస్తాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios