స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ ఒక కొత్త హోమ్ ప్రాడక్ట్ ని ప్రకటించింది. అదేంటంటే ఆపిల్ హోమ్‌పాడ్ అయితే భారతదేశంలో ఆపిల్ హోమ్‌పాడ్ ధరను అధికారికంగా ప్రకటించారు. కాలిఫోర్నియాకు చెందిన దిగ్గజం కుపెర్టినో  మొదటి ఆర్థిక త్రైమాసికంలో ఈ కొత్త ప్రాడక్ట్ వివరాలను తెలిపింది.

ఆపిల్ అమెజాన్ ఎకో, గూగుల్ హోమ్ స్మార్ట్ స్పీకర్లకు పోటీగా జూన్ 2017 లో ఆపిల్ హోమ్‌పాడ్‌ను ఆవిష్కరించింది. ఆపిల్ హోమ్‌పాడ్‌  2018 ఫిబ్రవరిలో యుఎస్, యుకె, ఆస్ట్రేలియాలో మొదటిగా లాంచ్ చేశారు. కొన్ని నెలల తర్వాత కెనడా, ఫ్రాన్స్, జర్మనీలలో దీని అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

also read ఇండియాలో ఐఫోన్ అమ్మకాలకు తగ్గని డిమాండ్...ఆపిల్ సీఈఓ

భారతదేశంలో ఆపిల్ హోమ్‌పాడ్ ధర రూ. 19,900. ఇది త్వరలో ఇండియన్ మార్కెట్లోకి రానుంది అని ఆపిల్ ఇండియా ధృవీకరించింది.ఆపిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ జాబితాలో మొదట్లో దీని ధరను తెలిపింది, కాని మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆపిల్ హోమ్‌పాడ్‌ను 2018 యుఎస్ లో $ 349 (సుమారు రూ .24,900) డాలర్ల వద్ద లాంచ్ చేశారు. అయితే గత ఏడాది ఏప్రిల్‌లో దీని ధరను $299  (సుమారు రూ. 21,300) డాలర్లకు తగ్గించారు.

ఆపిల్ హోమ్‌పాడ్ ఫీచర్స్

ఆపిల్ హోమ్‌పాడ్ 6.8-అంగుళాల ఎత్తు, ఆపిల్ కంపెనీ ఆడియో టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ఇది కస్టమ్-ఇంజనీరింగ్ యాంప్లిఫైయర్ హై-ఎక్స్ కర్షన్ వూఫర్‌తో పనిచేస్తుంది.  స్మార్ట్ స్పీకర్ ఆపిల్ ఎ8 చిప్ ద్వారా పనిచేస్తుంది ఇంకా ఇందులో సిరి ఇంటిగ్రేషన్ కూడా ఉంది.

హోమ్‌పాడ్ పైభాగంలో గెశ్చర్ కంట్రోల్స్  ప్రారంభించటనికి టచ్ ప్యానెల్ కూడా ఉంది. వైట్, స్పేస్ గ్రే కలర్ ఆప్షన్లలో మెష్ ఫాబ్రిక్ డిజైన్ తో లభిస్తుంది.అంతేకాకుండా మీ ఇంటి వద్ద మల్టీ హోమ్‌పాడ్ డివైజ్ లను ఉపయోగించి మల్టీ-రూమ్ ఆడియోని ఎక్స్ పిరియన్స్ చేయడానికి స్పీకర్ ఎయిర్‌ప్లే 2 సపోర్ట్ తో వస్తుంది.

also read ట్రంప్‌కు షాక్: 5జీ...సేవలకు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్


ధ్వనిని స్వయంచాలకంగా విశ్లేషించడానికి మరియు స్థానం ఆధారంగా ధ్వనిని సర్దుబాటు చేయడానికి హోమ్‌పాడ్ ప్రాదేశిక అవగాహనతో వస్తుందని ఆపిల్ పేర్కొంది.మీ మ్యూజిక్ ట్రాక్‌లను లేదా సాంగ్స్ వైర్‌లెస్‌గా ప్లే చేయడానికి లేదా దాని ఇంటర్నల్ ఆడియో సిస్టమ్‌ను ఉపయోగించి ఫోన్ కాల్‌ మాట్లాడడానికి మీరు హోమ్‌పాడ్‌ను మీ ఐ‌ఓ‌ఎస్ లేదా ఐప్యాడ్ ఓస్ డివైజ్ కనెక్ట్ చేయవచ్చు.

స్పీకర్ ఎం‌ఐ‌ఎం‌ఓ, బ్లూటూత్ v5.0 తో Wi-Fi 802.11ac తో సహా పలు రకాల కనెక్టివిటీ ఆప్షన్స్ తో వస్తుంది. దీనికి  బిల్ట్ ఇన్ పవర్  సప్లై కూడా కలిగి ఉంది. హెచ్‌ఈ-ఏ‌ఏ‌సి, ఏ‌ఏ‌సి, ప్రొటెక్టెడ్  ఏ‌ఏ‌సి, యంపి3, యంపి3 వి‌బి‌ఆర్, ఏ‌ఐ‌ఎఫ్‌ఎఫ్, ఎఫ్‌ఎల్‌ఏ‌సి వంటి ఆడియో ఫార్మాట్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఇదికాకుండా, స్పీకర్ 5.6-అంగుళాల వెడల్పు ఇంకా 2.5 కిలోల బరువు ఉంటుంది.