క్యుపెర్టినో సంస్థ ఆపిల్   ఐఫోన్ 12 లాంచ్ తరువాత త్వరలో సరికొత్త ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి కొన్ని వివరాలను ప్రకటించింది. సరికొత్త హార్డ్‌వేర్‌తో మూడు మోడల్స్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది.

మాక్‌బుక్ ప్రో, మాక్‌బుక్ ఎయిర్, మాక్ మినీ  అప్‌గ్రేడ్ వెర్షన్‌ను ప్రకటించింది. ప్రత్యేక విషయం ఏమిటంటే  మాక్‌బుక్ ప్రో, మాక్‌బుక్ ఎయిర్, మాక్ మినీలలో ఆపిల్ ఇన్‌హౌస్ ఎం1 ప్రాసెసర్‌ను ఉపయోగించింది.

ఈ ఏడాది ప్రారంభంలో ఇంటెల్‌కు బదులుగా ఎం1 - ఆధారిత చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. గత 15 సంవత్సరాలుగా  ఇంటెల్ ఎక్స్ 86 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తోందని ఆపిల్  తెలిపింది. ఆపిల్ కొత్త ప్రాసెసర్‌కు ఆపిల్ ఎం1 అని పేరు పెట్టింది.

also read నాలుగు కెమెరాలతో హానర్ 10 ఎక్స్ లైట్‌ స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఇండియాలో ధర ఎంతంటే ? ...

13 అంగుళాల మాక్‌బుక్ ప్రో 256 జీబీ స్టోరేజ్ ధర 1,22,900 రూపాయలు. 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ .1,42,900. రెండు వేరియంట్లలో 8 జీబీ యూనిఫైడ్ ర్యామ్ తో వస్తుంది. సిల్వర్, స్పేస్ గ్రే కలర్ వేరియంట్‌లలో కొనుగోలు చేయవచ్చు.

 కొత్త మాక్‌బుక్ ఎయిర్  256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ .92,900, 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .1,17,900.  సిల్వర్, స్పేస్ గ్రే,  గోల్డ్ కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. మాక్ మినీ 256 జీబీ మోడల్ ధర రూ .64,900, 512 జీబీ మోడల్ ధర రూ .84,900.

ఆపిల్ ప్రకారం, మాక్‌బుక్ ఎయిర్ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన 13 అంగుళాల నోట్ బుక్. కొత్త మాక్‌బుక్‌కు 3.5 ఎక్స్ ఫాస్టర్ సిపియు, 5 ఎక్స్ ఫాస్టర్ గ్రాఫిక్స్, 9 ఎక్స్ ఫాస్టర్ మెషిన్ లెర్నింగ్ తో వస్తుంది.

కొత్త మాక్‌బుక్ మార్కెట్‌లోని అన్ని పిసిల కంటే 98 రెట్లు వేగంగా ఉంటుందని పేర్కొంది. బ్యాటరీకి సంబంధించి 15 గంటల పాటు వైర్‌లెస్ వెబ్ సర్ఫింగ్ బ్యాక్ అప్ ఇస్తుందని కంపెనీ  క్లెయిమ్ చేసింది. అయితే ఈ మూడు మోడల్లు ప్రస్తుతం ప్రీ బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నాయని, వచ్చే వారం మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది.