Asianet News TeluguAsianet News Telugu

పెద్ద బ్యాటరీతో హువావే కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్...

హువావే ఎంజాయ్ 10ఇలో మెడిటెక్ హెలియో పి35తో వస్తుంది. 3 జిబి, 4 జిబి అనే రెండు ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది.హువావే ఎంజాయ్ 10ఇ లో వాటర్ డ్రాప్ నాచ్ హౌసింగ్ సెల్ఫీ షూటర్, డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఎమరాల్డ్ గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే మూడు కలర్లలో లభిస్తుంది. 

huawei company launches enjoy 10e smart phone in china
Author
Hyderabad, First Published Mar 3, 2020, 2:41 PM IST

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ హువావే నుండి ఎంజాయ్ 10ఇ స్మార్ట్ ఫోన్ చైనాలో లాంచ్ చేశారు. ఇది 6.3-అంగుళాల స్క్రీన్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌గా ఉంటుందని అలాగే ర్యామ్, స్టోరేజ్‌లో ఆప్షన్స్ లో మూడు వేరియంట్లు ఉంటాయని తెలుస్తుంది.

హువావే ఎంజాయ్ 10ఇ లో వాటర్ డ్రాప్ నాచ్ హౌసింగ్ సెల్ఫీ షూటర్, డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఎమరాల్డ్ గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్, పెర్ల్ వైట్ అనే మూడు కలర్లలో లభిస్తుంది. 

హువావే ఎంజాయ్ 10ఇ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో వస్తుంది. 3 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్, 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్, చివరకు 4 జిబి ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి.  

also read విపణిలోకి రెడ్‌మీ నోట్‌ 9 స్మార్ట్ ఫోన్... ఆవిష్కరించనున్న బాలీవుడ్ హీరో

4జి‌బి+ 64జి‌బి వేరియంట్ ధర సుమారు రూ. 10,300 ఉండగా 4జి‌బి + 128జి‌బి వేరియంట్ ధర సుమారు రూ .12,300 ఉంది.  3 జీబీ ర్యామ్ వేరియంట్ ధర వెల్లడించలేదు. ప్రపంచంలోని ఇతర దేశాలలో లభ్యతపై సమాచారం లేదు. 

 డ్యూయల్ సిమ్ గల హువాయ్ ఎంజాయ్ 10ఇ  ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఈ‌ఎం‌యూ‌ఐ 10తో పని చేస్తుంది. దీనికి 6.3-అంగుళాల హెచ్‌డి + (720 x 1600 పిక్సెల్) స్క్రీన్‌ను కలిగి ఉంది.

వెనుక వైపు ఉన్న డ్యూయల్ కెమెరాల గురించి మాట్లాడుకుంటే13 మెగాపిక్సెల్ సెన్సార్, ఎఫ్/1.8 ఎపర్చరుతో, సెకండరీ కెమెరా ఎఫ్/2.0 ఎపర్చర్‌తో 2 మెగాపిక్సెల్ సెన్సార్ ఇందులో ఉంది. ప్రధాన సెన్సార్‌లో 4x డిజిటల్ జూమ్ కూడా ఉంది. ముందు భాగంలో హువావే ఎంజాయ్ 10ఇలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఎఫ్/ 2.0 ఎపర్చర్‌తో ఉంటుంది.

also read విమానాల్లో ఇక ఇన్‌ఫ్లైట్ వై-ఫై.. తొలి చాన్స్ విస్తారాకే!

డివైస్  3 జిబి వేరియంట్లో 64 జిబి స్టోరేజ్ ఉండగా, 4 జిబి వేరియంట్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది అందులో ఒకటి 64 జిబి, 128 జిబి. హువావే ఎంజాయ్ 10ఇ మైక్రో ఎస్‌డి కార్డ్ 512జి‌బి వరకు సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ కోసం హువావే ఎంజాయ్ 10ఇలో 4జి ఎల్‌టిఇ, వై-ఫై 802.11 బి/ జి‌ / ఎన్, బ్లూటూత్ వి5.0, మైక్రో-యుఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, ఒటిజి (ఆన్ ది గో) సపోర్ట్  ఉంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ గురించి ప్రస్తావించలేదు.

హువావే ఎంజాయ్ 10ఇ 5,000mAh బ్యాటరీ ఇందులో ఉంది. 10W ఛార్జింగ్  సపోర్ట్ ఇస్తుంది. పెద్ద బ్యాటరీ, హెచ్‌డి+ డిస్ ప్లే, ఫోన్ సైజ్ 159.07x75.06x9.04 ఎం‌ఎం,185 గ్రాముల బరువు ఉంటుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios