కరోనావైరస్ కారణంగా తగ్గుతున్న ఐఫోన్ ఉత్పత్తి....
చైనాలో కరోనావైరస్ కారణంగా అనేక పరిశ్రమలు ఈ వైరస్ కారణంగా తాత్కాలికంగా మూతపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం టెక్నాలజీ రంగంపై బాగానే పడింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు జనాలు హడలెత్తిపోతున్నారు. ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని భయపెట్టిస్తున్న కరోనావైరస్ వ్యాప్తి కేవలం చైనాలోని ప్రధాన ప్రాంతాలలోనే కాదు, చైనాలో ఉన్న అనేక పరిశ్రమలు ఈ వైరస్ కారణంగా తాత్కాలికంగా మూతపడుతున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ ప్రభావం టెక్నాలజీ రంగంపై బాగానే పడింది.
ప్రముఖ ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కుయో ఒక కొత్త పరిశోధన నోట్ పోస్ట్ చేశారు. కరోనావైరస్ వ్యాప్తి వల్ల ఆపిల్ సంస్థ సరఫరాపై ప్రభావం చూపుతుందని, 2020 మొదటి నెలలో ఐఫోన్ సప్లయ్ పై ప్రభావం చూపిస్తుందని తెలిపారు.కరోనావైరస్ వ్యాప్తితో దేశం మొత్తం పోరాడుతుండగా ఆపిల్ ఇటీవల చైనాలోని అన్నీ రిటైల్ షాపులను మూసివేసింది.
also read వాట్సాప్ సేఫ్ కాదు...టెలిగ్రామ్ సీఈఓ హెచ్చరిక...
కుయో తన తాజా పరిశోధన నోట్‌లో చైనాలో మొత్తం స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు పడిపోతాయని ఇందులో భాగంగా ఆపిల్ ఎగుమతులు కూడా దెబ్బతింటున్నాయని అన్నారు.కొరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆపిల్ ఉత్పత్తులు, అలాగే ఉత్పత్తి నష్టాలను ఎదుర్కోవలసి వస్తుందని కొన్ని ఫ్యాక్టరీలు తాత్కాలికంగా మూసివేసారు.
చైనా మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు సంవత్సరానికి 15 శాతం తగ్గి 2020లో 310 మిలియన్లకు తగ్గుతాయని కుయో తాజా పరిశోధన నోట్ లో పేర్కొంది.అంతేకాకుండా, కరోనావైరస్ వ్యాప్తి వలన ఐఫోన్ సప్లయ్ ప్రభావితమవుతోందని, 2020 మొదటి త్రైమాసికంలో ఐఫోన్ రవాణా అంచనాలు 10 శాతం వరకు తగ్గుతాయని కుయో పేర్కొన్నాడు.
also read పుమా నుండి కొత్త స్మార్ట్ వాచ్...ధర ఎంతో తెలుసా ?
ఇతర దేశాలకు వెళ్ళేందుకు ప్రయాణ ఆంక్షలు అమల్లో ఉన్నందున ఆపిల్ ఉద్యోగులు చైనాలోని ఉత్పత్తులను, ఇతర కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలను పరీక్షించడానికి ఇతర ప్రదేశాలకు వెళ్లడానికి అవకాశం లేదు. ఫిబ్రవరి 9 వరకు చైనాలోని ప్రధాన నగరాలలోని అన్ని కార్యాలయాలు, రిటైల్ దుకాణాలను కూడా ఆపిల్ మూసివేసింది. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఆపిల్ సంస్థ మాత్రమే కాదు, అనేక చైనీస్ ఫోన్ బ్రాండ్ల పై కూడా ఈ సప్లయ్ ప్రభావం ఉంది.
చైనా కేంద్రంగా అనేక ఐఫోన్ ఉత్పత్తి ప్లాంట్లను కలిగి ఉన్న ఆపిల్ కూడా కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే ఐఫోన్ల ఉత్పత్తి కూడా తగ్గనుందని ప్రముఖ ఆపిల్ అనలిస్ట్ మింగ్ చి కువో వెల్లడించారు.