ఇక లేటెస్ట్‌గా వచ్చే స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ 10 క్యూ ఓఎస్ అప్‌డేట్‌తో వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు గూగుల్ నుంచి వచ్చిన లేటెస్ట్ వర్షన్  ఆండ్రాయిడ్ 9పై. ఇదే ఓఎస్ చాలా స్మార్ట్ ఫోన్లలో ఉపయోగిస్తున్నారు. తాజాగా, ఆండ్రాయిడ్ 10క్యూ కూడా రిలీజ్ అయ్యింది. ఇక లేటెస్ట్‌గా వచ్చే కొన్ని స్మార్ట్ ఫోన్లలో ఈ ఈపరేటింగ్ సిస్టమే రానుంది. 

ఆండ్రాయిడ్ 10 క్యూ ఫీచర్లు:

డార్క్ థీమ్:
ఆండ్రాయిడ్ 10క్యూలో మీరు మీ స్మార్ట్‌ఫోన్ మొత్తానికి డార్క్ థీమ్ సెట్ చేసుకోవచ్చు. ఓలెడ్ స్క్రీన్స్ ఉపయోగించేవారికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. అంతేగాక, బ్యాటరీని ఆదా చేస్తుంది.

స్మార్ట్ రిప్లై, స్మార్ట్ సజెషన్స్: 
గూగుల్ మెషీన్ లెర్నింగ్ ఫీచర్లని యూజర్లకు అందుబాటులోకి తెస్తోంది. స్మార్ట్ రిప్లై, స్మార్ట్ సజెషన్స్ ఫీచర్ కూడా అలాంటిదే. ఇకపై మీ మెసేజింగ్ యాప్స్‌లో స్మార్ట్ రిప్లై, స్మార్ట్ సజెషన్ ఫీచర్లు కూడా వాడుకోవచ్చు. దీని ద్వారా మీకు వచ్చిన మెసేజ్ కంటెంట్‌ను అర్థం చేసుకుని అందుకు కావాల్సిన రిప్లైని సజెస్ట్ చేస్తుంది. ఒకవేళ మీకు మెసేజ్‌లో ఎవరైనా అడ్రస్ పంపిస్తే.. డైరెక్ట్‌గా గూగుల్ మ్యాప్‌లో మీకు ఆ అడ్రస్ చూపిస్తుంది.

లైవ్ క్యాప్షన్:
మీ ఫోన్‌లో ఉన్న వీడియో ప్లే అయ్యేప్పుడు లైవ్ క్యాప్షన్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. యూట్యూబ్ వీడియో అయినా.. వీడియో కాల్, పాడ్ క్యాస్ట్, వాయిస్ మెసేజ్.. అయినా లైవ్ క్యాప్షన్ ఫీచర్ పనిచేస్తుంది. లైవ్ క్యాప్షన్స్ ఇస్తుంది.

డిజిటల్ వెల్బీయింగ్:
ఇంతకుముందు వచ్చిన ఆండ్రాయిడ్ వచ్చిన ఆండ్రాయిడ్ 9పై ఓఎస్‌లో డిజిటల్ వెల్బీయింగ్ ఫీచర్ ఉంది. స్క్రీన్ టైమ్‌ని తగ్గించడానికి ఉపయోగపడే ఫీచర్ ఇది. ఇందులో మరిన్ని ఫీచర్లను జత చేసింది గూగుల్. యూజర్లు కొన్ని యాప్స్‌ని తాత్కాలికంగా నిలిపివేయొచ్చు. చెప్పాలంటే పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు అడిక్ట్ కాకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

5జీని సపోర్ట్ చేసే తొలి ఓఎస్:
ఆండ్రాయిడ్ క్యూ 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేయనుంది. 5జీ కనెక్టివిటీని సపోర్ట్ చేసే మొదటి ఆపరేటింగ్ సిస్టమ్ ఇదే కావడం విశేషం. 5జీ సపోర్ట్ చేసే యాప్స్ తయారు చేసేందుకు కావాల్సిన టూల్స్‌ని డెవలపర్లకు గూగుల్ అందించనుంది. 

సెక్యూరిటీ ప్రైవసీ: 
ఆండ్రాయిడ్ సెట్టింగ్స్‌లో కొత్తగా ‘ప్రైవసీ’ ఆప్షన్స్ కనిపించనున్నాయి. దీని ద్వారా లొకేషన్ డేటా, పర్మిషన్స్ యూజర్లకు మరింత కంట్రోల్ వస్తుంది.

ఫోల్డబుల్ డివైజ్ సపోర్ట్:

ఆండ్రాయిడ్ 10 క్యూ ఫోల్డబుల్ డివైజ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇటీవల కాలంలో మొబైల్ తయారీ సంస్థలు ఫోల్డబుల్ ఫోన్ల తయారీకి మొగ్గుచూపుతున్న నేపథ్యంలో ఆండ్రాయిడ్ 10క్యూను వాటికి సపోర్ట్ చేసే విధంగా రూపొందించినట్లు తెలుస్తోంది. 

ఆండ్రాయిడ్ 10 క్యూ ఓఎస్‌తో మొబైల్ ఫోన్లు ఇవే:

గూగుల్ పిక్సెల్ ఫోన్స్:
పిక్సెల్ అండ్ పిక్సెల్ ఎక్స్ఎల్
పిక్సెల్ 2 అండ్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్
పిక్సెల్ 3, పిక్సెల్ 3ఎక్స్ఎల్

శామ్సంగ్:
గెలాక్సీ ఎస్10, గెలాక్సీ ఎస్10ఈ
గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9+
గెలాక్సీ నోట్ 9

వన్‌ప్లస్:
వన్‌ప్లస్ 6, వన్‌ప్లస్ 6టీ
వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ ప్రో.

చదవండి: గూగుల్ పిక్సెల్ Pixel 3a, 3a XL విడుదల: ధర, ఫీచర్లు..